Big Stories

Congress Manifesto 2024 : కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదల.. పాంచ్ పటాకా..!

Congress Manifesto 2024 Elections
Congress Manifesto 2024 Elections

Update on Congress Manifesto 2024 Elections: దేశవ్యాప్తంగా ఎలక్షన్‌ ఫీవర్.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. విమర్శలు.. వాటికి కౌంటర్లు. నార్మల్ లాంగ్వెజ్‌ నుంచి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌ వరకు.. ఇలా ఓ పార్టీ మరో పార్టీపై.. ఓ నేత మరో నేతపై.. దాడి చేస్తూనే ఉన్నారు. మరి ఓటర్ ఏం చూసి పలానా పార్టీకి ఓటు వేస్తాడు? ఈ తిట్ల దండకాన్ని చూసి వేస్తాడా? నో.. మేనిఫెస్టో.. ఏ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంది? అనే విషయాన్ని అనలైజ్ చేసుకునే ఓటును వేస్తాడు.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు పార్టీలు వివరించే ఓ పేపర్.. ఇచ్చే హామీ.. మేనిఫెస్టో.. అలాంటి మేనిఫెస్టోను న్యాయ్‌ పత్ర పేరుతో విడుదల చేసింది కాంగ్రెస్.. ఐదు న్యాయాలు.. 25 గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ విషయం తెలిసిందే.. కానీ ఐదు న్యాయాలే ఎందుకు? ఆ న్యాయాల వెనక అసలు కారణాలేంటి?

- Advertisement -

పాంచ్‌ న్యాయ్‌.. ఇంతకీ ఏంటవి? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ సింపుల్.. కిసాన్ న్యాయ్.. నారీ న్యాయ్.. శ్రామిక్ న్యాయ్.. యువ న్యాయ్.. హిస్సేదారి న్యాయ్.. ఇంత భారీ భారీ పదాలు ఎందుకు కానీ.. సింపుల్‌ వర్డ్స్‌లో డిస్క్రైబ్ చేస్తే.. రైతులు, మహిళలు, యువకులు, శ్రామికులు అంటే ఇప్పటికే పనిచేస్తున్నవారు. లాస్ట్‌ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్టడుగు వర్గాలు. ఈ ఐదు కేటగిరీలకు హైప్రియారిటీ ఇస్తామంటోంది కాంగ్రెస్.. ఇది సాధాసీదాగా తీసుకున్న నిర్ణయం కాదు.. ప్రజలతో చర్చించి.. వారి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని రూపొందించిన డాక్యుమెంట్.. పాంచ్‌ న్యాయ్ అని చెబుతోంది కాంగ్రెస్..ఈ ఐదు న్యాయాలను చూస్తే చాలా స్ట్రాటజిక్ ఎట్ ది సేమ్‌ టైమ్. ఆ రంగాల వారిని అభివృద్ధి చేయాలనుకోవడమే టార్గెట్‌లా కనిపిస్తోంది.

- Advertisement -

Also Read: మాజీ సీఎంల టార్గెట్..పెద్దిరెడ్డికి గడ్డుకాలమేనా?

ఒక్కో న్యాయంపై బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం.. ఫస్ట్ నారీ న్యాయ్.. అంటే మహిళల అభివృద్ధికి తాము ఏం చేయబోతున్నాం? అనే విషయాలను ఇందులో క్లాసిఫై చేసింది. టెక్నికల్‌గా చూస్తే మొత్తం దేశంలో ఉన్న ఓటర్లలో సగం మంది మహిళలే.. మహిళల గురించి ఆకాశంలో సగం అని మనం కవితలు చెప్పుకుంటున్నా.. గ్రౌండ్ రియాల్టీ అలా లేదు.. వారికి ఉద్యోగాల్లో సరైన ప్రాధాన్యత లేదు. ఆర్థికంగా అండ లేకపోవడంతో వారు ధైర్యంగా గొంతు ఎత్తలేని పరిస్థితి.. ఈ సిట్యూవేషన్‌ మారాలంటోంది కాంగ్రెస్.. అందుకే నారీ న్యాయ్ పేరుతో వారికి మరిన్ని అవకాశాలను పెంచాలని చూస్తోంది.

కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని చెబుతోంది. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే.. ఫ్యామిలీలో మహిళలకు ఇంపార్టెన్స్‌ పెరుగుతోంది. వారిని ట్రీట్‌ చేసే విధానం కూడా మారే అవకాశం ఉంది. నెక్ట్స్‌.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్.. ఇది ఇంప్లిమెంట్ అయితే కీలక పోస్టుల్లో సగం మంది మహిళలే ఉంటారు.. డెసిషన్‌ మెకింగ్‌లో వారి భాగస్వామ్యం పెరుగుతుంది. ఇక ఊర్లల్లో ఉండే ఆశ, అంగన్వాడీల సాలరీస్‌ను పెంచడం.. నిజానికి ప్రతి ఒక్క గ్రామంలో వీళ్ల రోల్‌ చాలా ఇంపార్టెంట్.. అందుకే వారి సేవలను గుర్తించి వారి జీతాలను పెంచుతామంటోంది కాంగ్రెస్.. ఓవరాల్‌గా చూస్తే మహిళలను మహాలక్ష్ములుగా మార్చడమే కాంగ్రెస్‌ టార్గెట్‌గా ఉంది. కర్ణాటక, తెలంగాణలో మహాలక్ష్మి పథకాలను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తోంది కాంగ్రెస్.. ఇప్పుడిదే ఫార్ములాని నేషన్‌ వైడ్‌గా ఇంప్లీమెంట్ చేయాలని చూస్తోంది.

యువత.. దేశానికి వెన్నెముక.. అలాంటి యంగ్‌ జనరేషన్‌ డెవలప్‌మెంట్‌పై కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎడ్యుకేషన్‌ కంప్లీట్ చేసుకున్న యంగ్‌ జనరేషన్‌కు సరైన ఎంప్లాయిమెంట్‌ లేదా వారు లైఫ్‌లో కోరుకున్నది సాధించేందుకు సరైన అవకాశాలు కల్పించకపోతే..వారు మాత్రమే కాదు.. దేశం కూడా నష్టపోయినట్టే. ప్రస్తుతం మనం నేషనల్‌ వైడ్‌గా ఈ సిట్యూవేషన్‌ను చూస్తూనే ఉన్నాం. ఉద్యోగం కోసం ఆందోళనల బాట పట్టాల్సి వస్తుంది యువత. అందుకే కాంగ్రెస్‌ యూత్‌పై కూడా మెయిన్‌గా ఫోకస్ చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటోంది.

Also Read: గురి తప్పదు! మీ ఇద్దరికి చెక్! అసలుకే ఎసరు?

అంతేకాదు.. యువతకు ఏడాది పాటు అప్రెంటీస్ షిప్ ప్రొగ్రామ్‌ను డిజైన్ చేసింది. వీరికి ఈ ఏడాది కాలంలో లక్ష రూపాయలు కూడా అందించనుంది. సో ఎడ్యుకేషన్‌ కంప్లీట్ చేసుకున్న యువత ఏదో ఓ కోర్సులో జాయిన్ అవుతారు. ఏడాదిలో వారు ఓ కోర్సును కంప్లీట్‌ చేస్తారు.. అందులో ఎక్స్‌పర్ట్ అవుతారు. ఎట్ ది సేమ్ టైమ్.. లక్ష రూపాయలు కూడా సంపాదించుకుంటారు. ఇది యువతకు మేలు చేసే డెసిషనే అనే చెప్పాలి. ఇలా అనేక కోర్సులు కంప్లీట్ చేసి కొత్తగా స్టార్టప్‌ కంపెనీలను ప్రారంభించాలనుకునే వారి కోసం.. ఐదు వేల కోట్ల నిధిని కేటాయిస్తామని చెబుతోంది కాంగ్రెస్.. యువత టైమ్‌ను, ఎనర్జీ వృథాగా పోకుండా.. కాంగ్రెస్‌ యువ న్యాయ్‌ను డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది.

నెక్స్ట్.. శ్రామిక్‌ న్యాయ్ అంటే కార్మికులకు న్యాయం చేయడం.. దేశాభివృద్ధి డిపెండ్ అయ్యేది కార్మికులపైనే.. అందుకే వారిని కూడా మెయిన్ కేటగిరీలో చేర్చింది కాంగ్రెస్.. వారి కోసం రైట్ టు హెల్త్ చట్టాన్ని తీసుకొస్తామని చెబుతోంది. అంటే అత్యవసర చికిత్సతో పాటు.. వారికి ఎలాంటి చికిత్సనైనా అందించడంతో పాటు.. వారికి రీహాబిలిటేషన్‌ను కూడా ఉచితంగా అందించేందుకు ఏకంగా చట్టాన్ని తీసుకొస్తామని చెబుతోంది. చేసే పనికి గౌరవం ఇవ్వడంతో పాటు.. జాతీయ ఉపాధి హామీ కార్మికులకు రోజు వేతనాన్ని 400కు పెంచడం.. అంతేకాదు.. అర్బన్ ఏరియాల్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెబుతోంది. అంతేకాదు కార్మికులందరికి జీవిత బీమా, ప్రమాద హామీని అందిస్తామంటోంది. కీలక ప్రభుత్వ విధుల్లో ఉద్యగాల కాంట్రాక్ట్ విధానాన్ని నిలిపివేస్తామని హామీ ఇస్తోంది. ఓవరాల్‌గా చూస్తే కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం కాంగ్రెస్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇక కిసాన్ న్యాయ్.. దేశంలో.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల రైతులు ప్రస్తుతం NDA సర్కార్‌పై గుర్రుగా ఉన్నారు. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు మరికొన్ని డిమాండ్లను వారు తెరపైకి తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతమున్న ఎన్డీఏ సర్కార్‌ పట్టించుకోవడం లేదు. ఇప్పుడీ డిమాండ్లను కూడా తమ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్.. నిజానికి రైతుల ఆందోళనలకు ఎప్పటి నుంచో మద్ధతు పలుకుతోంది కాంగ్రెస్.. స్వామినాథన్‌ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేయడం.. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లించేందుకు గ్యారెంటీ.. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్.. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తానంటోంది కాంగ్రెస్ ఇది రైతులకు చాలా ఉపయోగపడేదనే చెప్పాలి.. పన్ను మినహాయిస్తే రైతులకు లాభం చేకూరనుంది. ఈ హామీలు రైతులను కాంగ్రెస్‌వైపు చూసేలా చేస్తున్నాయి.

Also Read: అనుకున్నది ఒకటి ఐనది ఒకటి.. ఇద్దరికి హ్యాండే

ఇక మోస్ట్ ఇంపార్టెంట్.. అట్టడుగు వర్గాలను బలోపేతం చేయడం..రాహుల్‌ గాంధీ మొదటి నుంచి ఈ అంశంపై పోరాడుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను ఎత్తేస్తామన్నారు. ఇప్పుడదే విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, సబ్‌ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్‌.. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తింపు ఇస్తామంటోంది కాంగ్రెస్.. నిజానికి ఈ హామీల అమలుకు సంబంధించిన చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది.

ముఖ్యంగా రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేయాలన్నదైతే చాలా కాలంగా ఉంది. దేశంలోని గిరిజనులు, దళితులు, బీసీలు.. ఈ డిమాండ్ చేస్తున్నారు. కులాల వారీగా లెక్కలు తీయాలి.. బీసీలకు 50 కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలి.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా 80 శాతం ఉంటే.. రిజర్వేషన్ 50 శాతానికి ఎలా పరిమితం చేస్తారన్న ప్రశ్నలు ఉన్నాయి. అందుకే ఈ డిమాండ్‌ను ప్రధానంగా తమ మేనిఫెస్టోలో హైలేట్ చేసింది కాంగ్రెస్.. నిజానికి కాంగ్రెస్‌ చెబుతున్న ఈ ఐదు న్యాయాలు.. దేశంలోని మెజారిటీ వర్గాలను కవర్ చేస్తున్నాయి. అభివృద్ధి ఎంత అవసరమో.. సంక్షేమం కూడా అంతే అవరసమంటోంది కాంగ్రెస్.. ఇవి రెండు కళ్లలాంటివని చెబుతోంది. ఈ మేనిఫెస్టోపై లెటెస్ట్‌గా ఓ కామెంట్ చేశారు రాహుల్‌ గాంధీ. అదేంటో మీరూ వినండి.

విన్నారుగా.. మేం చెప్పిందే ఫైనల్ కాదు.. ప్రజలకు నచ్చకపోయినా.. ఇంతకంటే బెటర్‌గా ఇంకా ఏమైనా సూచించినా.. ఇందులో మార్పులు చేర్పులు చేస్తామని చెబుతున్నారు రాహుల్.. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో బహుశా ఇదే ఫస్ట్‌ ఏమో.. తాము చెప్పిందే వేదం అనుకునే పార్టీలున్న ఈ టైమ్‌లో..ఇబ్బందులు, అభ్యంతరాలు ఉంటే చెప్పేయండి.. మార్చేద్దామంటున్నారు రాహుల్.. మీకు కూడా కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ఏమైనా అభ్యంతరాలున్నాయా? ఇంకేందుకు ఆలస్యం.. మీ ఒపినియన్‌ను మెయిల్ చేసేయండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News