Big Stories

Congress Vs BJP Manifesto War: కాంగ్రెస్, బీజేపీ పార్టీల మేనిఫెస్టో వార్.. ఏది నిజం..?

Congress, BJP Manifesto War: వెల్త్, వెల్ఫేర్, వర్క్.. ఇదే కాన్సెప్ట్‌తో పాంచ్‌ న్యాయ్.. పచ్చీస్‌ గ్యారెంటీ అంటూ మేనిఫెస్టోను తీసుకొచ్చింది కాంగ్రెస్.. కానీ ఇప్పుడదే మేనిఫెస్టో ఫుల్ కాంట్రవర్సీకి కేరాఫ్‌ అయ్యింది. రీజన్‌ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్. ఈ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్‌ భావజాలం ఉంది. అంటున్నారు మోడీ.. దానికి కాంగ్రెస్‌ కౌంటర్లు కూడా ఇస్తోంది. ఇంతకీ మోడీ ఇలా ఎందుకంటున్నారు? దానికి కాంగ్రెస్‌ ఇచ్చే కౌంటరేంటి?

- Advertisement -

సింపుల్‌గా తేల్చేశారు. అన్ని గ్యారెంటీలు.. ఎన్నో హామీలతో ఉన్న మేనిఫెస్టోను సింపుల్‌గా ముస్లిం లీగ్‌ మేనిఫెస్టో అన్నారు మోడీ.. ఇంతకీ ఏంటీ ముస్లిం లీగ్.. ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం.. అదేంటో తెలుసకుంటేనే మోడీ విమర్శలు.. దానికి కాంగ్రెస్‌ ఇచ్చే కౌంటర్స్‌ ఏంటో అర్థమవుతాయి. ముస్లిం లీగ్‌ అనేది స్వాతంత్ర్యానికి పూర్వం 1906లో ఏర్పాటైంది. అంటే ఇది బ్రిటిష్‌ ఇండియా కాలం నాటి రాజకీయ పార్టీ.. అప్పటి భారత్‌లో ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలనేది ఈ పార్టీ లక్ష్యం.. అయితే 1937 నుంచి ముస్లిం లీగ్‌ చాలా యాక్టివ్ అయ్యింది.

- Advertisement -

ఎప్పుడైతే 1940లో జిన్నా ఆధ్వర్యంలో లాహోర్ రిజల్యూషన్‌ చేశారో.. అప్పుడే పాకిస్థాన్ డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత దేశ విభజన సమయంలో జరిగిన హింస.. వేలాది మంది హత్యకు గురవ్వడం. పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడటం.. అక్కడ ముస్లిం లీగ్ అధికారంలోకి రావడం ఇవ్వన్ని జరిగిపోయాయి. ఇది బ్రీఫ్‌గా ముస్లింలీగ్‌ స్టోరి..అలాంటి ముస్లిం లీగ్‌ను పోట్రెట్‌ చేసేలా ఉందంటున్నారు మోడీ. దీంతో దేశంలో మరోసారి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Also Read: కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదల.. పాంచ్ పటాకా..!

మనకు ఇండిపెండెన్స్‌ వచ్చినప్పుడు ముస్లింలీగ్‌లో ఏ ఆలోచనలైతే ఉండేవో.. ఇప్పుడు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో కూడా అవే ఆలోచనలో ఉన్నాయంటున్నారు మోడీ. అసలు కాంగ్రెస్‌కు ఐడియాలజీ అన్నదే లేదంటూ ఫైర్ అవుతున్నారు మోడీ.. మరి నిజంగానే మోడీ మేనిఫెస్టోలో అంతగా ముస్లింలీగ్‌ను గుర్తు చేసే అంశాలు ఏమున్నాయి? అనేదే అసలు ప్రశ్న.. ఇదే ప్రశ్నను కాంగ్రెస్‌ నేతలను అడిగితే వారు మరికొన్ని కొత్త విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారు. మోడీకి అసలు చరిత్రపై అస్సలు క్లారిటీ లేదంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.. ముస్లిం లీగ్‌ దేశ విభజనను కొరుకున్నది నిజమే.. కానీ ఆ పార్టీతో అప్పుడు చేతులు కలిపింది ఎవరు? క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్‌ వారికి మద్ధతిచ్చింది ఎవరు? దేశ జైళ్లన్నీ కాంగ్రెస్‌ వారితో నిండితే.. దేశ విభజన చేసిన వారితో ప్రభుత్వాలు నడిపింది ఎవరు? ఇవే ఇప్పుడు రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలు.. రాజకీయ వేదికపై నిల్చొని మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావంటూ మోడీకి చురకలు వేస్తున్నారు రాహుల్.

రాహుల్ ప్రశ్నలు సరే.. నిజానికి ముస్లింలీగ్‌తో చేతులు కలిపి ప్రభుత్వాలను నడిపింది ఎవరు? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ తెలుసుకోవాలంటే కాస్తంత చరిత్రలోకి వెళ్లాలి.. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ.. హిందూ మహాసభ ముఖ్య నేత, ఇయన జనసంఘ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన 1941లో బెంగాల్‌లో ఉన్న ముస్లింలీగ్‌ ప్రభుత్వంలో ఫైనాన్స్‌ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎందుకంటే రెండో ప్రపంచయుద్ధంలో భారతీయ దళాలను ఉపయోగించాలన్న బ్రిటిష్‌ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతలు రాజీనామా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది.. మహాత్మాగాంధీ, నెహ్రూ అరెస్ట్ అయ్యారు. ఇలాంటి సమయంలో ముస్లింలీగ్‌ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతను తీసుకుంది. అలాంటి ప్రభుత్వంలో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ భాగమయ్యారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.. ఆయన ప్రభుత్వంలో చేరే సమయానికే ముస్లింలీగ్‌ ప్రత్యేక పాకిస్థాన్‌ కావాలని రిజల్యూషన్ చేసింది.ఇప్పుడీ విషయాలను కాంగ్రెస్‌ హైలేట్ చేస్తోంది. ముస్లిం లీగ్‌కు సపోర్ట్‌ చేసింది మీరా? మేమా? అని ప్రశ్నిస్తోంది.

మోడీ వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్‌ ఈసీని ఆశ్రయించింది. మొత్తం ఆరు కంప్లైంట్స్‌ చేసింది. ఇందులో మోడీపైనే రెండు కంప్లైంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్‌ మేనిఫెస్టోకు, ముస్లింలీగ్‌ ఐడియాలజీకి సంబంధం లేదు.. కానీ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.. అని కంప్లైంట్‌లో మెన్షన్ చేసింది కాంగ్రెస్. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఖర్గే కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, అట్టడుగు వర్గాలు ఇలా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా హామీలను ఇచ్చింది కాంగ్రెస్‌. ప్రస్తుతం ఇవేవీ చర్చకు రావడం లేదు. చర్చ మొత్తం ముస్లింలీగ్‌ చుట్టే తిరుగుతోంది. ఇదే ఆశించి బీజేపీ డైవర్ట్ గేమ్ ఆడుతుందా? అనే డౌట్స్ కూడా లేకపోలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News