BigTV English

Samantha : హెల్త్ సమస్యపై సమంత భావోద్వేగం..ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సామ్

Samantha : హెల్త్ సమస్యపై సమంత భావోద్వేగం..ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సామ్

Samantha : తన ఆరోగ్య సమస్యపై సమంత ఎమోషనల్ అయ్యింది. యశోద ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంది. ఇప్పటికింకా తాను చావలేదంటూ తీవ్ర భావోద్వేగం చెందింది.కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానని ఇటీవల సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.చేతికి సెలైన్ పెట్టుకుని డబ్బింగ్ చెబుతున్న ఫోటో షేర్ చేసింది. తను బాధ పడుతున్న
వ్యాధి గురించి వివరించింది. సమంత నటించిన యశోద సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక పక్క ట్రీట్ మెంట్ తీసుకుంటూనే సమంత డబ్బింగ్ పూర్తి చేసింది.ప్రస్తుతం సామ్ యశోద సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.


మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటున్న సామ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యింది. జీవితంలో కొన్ని మంచి రోజులు,మరికొన్ని చెడ్డరోజులు వస్తాయని తెలిపింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక నేను ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమోననిపించిందని తెలిపింది. అయినా ఇప్పుడు ఒక్కసారి వెనుతిరిగి చూస్తే ఇంత దాకా వచ్చానా అనిపిస్తోందని అంటూ భావోద్వేగానికి గురైంది. జీవితంలో పోరాటం చేస్తూ ముందుకెళుతున్నానని స్పష్టం చేసింది.చివరికి గెలవాలన్న లక్ష్యంతోనే ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే తత్వం సమంతది. తనకు పట్టుదల, సాహసం ఎక్కువేనని అటు సినిమాల్లో ఇటు నిజ జీవితంలోనూ నిరూపించింది.ఇప్పుడామె మయోసైటిస్‌ వ్యాధి రూపంలో ఎదురైన కఠిన సవాల్‌ను అంతే ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఒక పక్క చికిత్స తీసుకుంటూనే యశోద సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ చెప్పింది. ఆరోగ్యం సహకరించకున్నా.. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.జీవితంలో ఏరోజు ఎలా ఉన్నా.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా.. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని సమంత సందేశమిచ్చింది.


సమంత ఏమాయ చేసిందో కానీ తెలుగు ప్రేక్షకులకు అభిమాన కథానాయికగా మారింది. ఎన్టీఆర్, అల్లు అర్జన్ లాంటి యంగ్ హీరోల పక్కన హీరోయిన్ గా మెప్పించింది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ల పక్కన హీరోయిన్ గా మెరిసింది. అంతే కాదు కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో జీవించింది. ఇక్కడ వరకు సామ్ జీవిత సినిమాలో ఇంటర్వెల్ అనుకోవాలి. ఎందుకంటే నాగ చైతన్యతో ప్రేమ,పెళ్లి, విడాకుల తర్వాత ఆమె జీవితంలో సెకండాఫ్ ప్రారంభమైంది. ఒకవైపు వెబ్ సిరీస్ ల్లో మరోవైపు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి. అంతకు ముందు సమంత కేవలం సౌతిండియా స్టార్ మాత్రమే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత సమంత స్టార్ డమ్ మారిపోయింది. దేశవ్యాప్తంగా పేరొచ్చింది. బాలీవుడ్ లో వరస ఆఫర్లు వచ్చాయి. అదే సమయంలో ఆమెకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ను వదలిపెట్టలేదు. తన మాతృభాష తమిళ సినిమాలను నిర్లక్ష్యం చేయలేదు. ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ మరో రేంజ్ కు చేరుకున్న సమంతకు ఇప్పుడు ఊహించని కష్టం ఎదురైంది.

నవంబర్ 11న సమంత నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని సమంత విశ్వాసం వ్యక్తం చేసింది. యశోదలో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చాయని తెలిపింది. ఈ సినిమా ఆడియన్స్ కు కొత్త అనుభవాన్ని ఇస్తుందని తెలిపింది. వృత్తిపట్ల సమంతకున్న నిబద్ధతను చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×