Theertham : ఇంట్లో శంఖంను ఉంచుకోవచ్చా..అసలు పూజలు చేయవచ్చా అనే సందేహాలకు సమాధానమిది. శంఖాల్లో దక్షిణావర్త శంఖం ఉత్తమమైంది.. శంఖము లక్ష్మీ స్వరూపము. శంఖం కాల్షియంకు సంబంధించినది. దాని ద్వారా తీర్థమును తీసుకుంటే అనేక వ్యాధులు మటుమాయం అవుతాయి. అలాగే భగవంతునికి తీర్థ పూజ చేయడానికి అభిషేకించడానికి లక్ష్మికే అధికారం. అందుకే శంఖం ద్వారానే తీర్థమూ, అభిషేకం చేస్తారు.శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి ఇలానే వచ్చింది. ఇంట్లో శంఖాన్ని పెట్టుకునేందుకు కొన్ని పద్ధతులు ఉంటాయి. శంఖం తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి. శంఖం చివరి భాగం పడమర వైపు చూసేలా పెట్టుకోవాలి.
దేవీ భాగవతంలో శంఖం మహత్యాన్ని వివరించారు. లక్ష్మీదేవి కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. వాటిని లక్ష్మీనివాసమని అంటారు. శంఖం ధ్వని ఎక్కడ ఉండదో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ ఇంట్లోని పూజమందిరంలో శంఖం ఉండదో అక్కడ ఎక్కువ ఐశ్వర్య నిలువదు. ఏ ఇంట్లో అయితే శంఖాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారోఅక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ప్రతీ రోజు శంఖాన్ని కడిగి పువ్వులు పెట్టి భక్తితో ఆరాధిస్తారో వారిని లక్ష్మి కటాక్షిస్తుంది.
బ్రహ్మదైవత్వ పురాణంలోను శంఖం విశిష్టత గురించి ఉంది. సత్యనారాయణ స్వామి వత్ర కల్పనలో శంఖం ప్రస్తావన ఉంది. శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజించాలని చెబుతోంది. కనీసం నమస్కారమైన చేయాలి. శంఖం లేకపోతే సంపద ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోను శంఖంను నేలపైన ఉంచకూడదు. ఒక పళ్లెంలో కాని, ఆకుపైన కూడా ఉంచాలి. సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట.
హిందూ పురాణాల ప్రకారం, విష్ణువు తన వివిధ అవతారాలలో, ప్రపంచంలోని ప్రతికూలతను నాశనం చేయడానికి శంఖాన్ని ఊదాడు. శంఖం సముద్ర మథనం లేదా సముద్ర మంథనం నుండి ఉద్భవించిందని నమ్ముతారు. శంఖారావం వల్ల మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం చేకూరుతుంది .