ప్రణీత్ వాడిన టెక్నిక్కే ప్రభాకర్ రావు సైతం యూజ్?
జూన్ 17న బాధితులతో కన్ ఫ్రంటేషన్తెలీదు- గుర్తులేదు- మరచిపోయా. ఇదీ బేసిగ్గా విచారణలో కొందరు నిందితులు తప్పించుకునే ఫార్ములా. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ విచారణ ఎదుర్కుంటున్న ప్రభాకర్ రావు పరిస్థితి కూడా.. ఇంచు మించు అలాగే సాగుతున్నట్టు సమాచారం. కొన్నిసార్లు తనకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారంటూ.. ఆయన మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాక్కాదని భావించిన సిట్.. ఆయను భిన్నమైన రీతిలో విచారించాలని డిసైడ్ అయ్యిందీ దర్యాప్తు సంస్థ.
నాటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ అనిల్..
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీగా పని చేసిన ప్రభాకర్ రావు సైతం.. ప్రణీత్ రావు తదితరులు వాడిన టెక్నిక్కే వాడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఈ విచారణకు హాజరైన అందరి వేళ్లు ప్రభాకర్ రావు వైపు చూపగా.. ప్రభాకర్ రావు సైతం సరిగ్గా ఇలాగే తన పై అధికారులు చెప్పడం వల్లే చేశానని అన్నారు. ఆనాటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ అనిల్ కుమార్ ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెప్పారాయన.
ఆధారాలు చూపించి మరీ విచారణ
జూన్ 14, శనివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ప్రభాకర్ రావును మొత్తం 9 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి.. ప్రభాకర్ రావును FSL రిపోర్ట్ ఆధారంగా ప్రశ్నించారు. మావోయిస్టుల పేర్లు చెప్పి.. పలువురు పొలిటీషియన్లు, ఇండస్ట్రియలిస్టుల ఫోన్ టాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. ఒక వేళ ఆయన సమాధానం తప్పు చెబితే.. తమ దగ్గరున్నా ఆధారాలను చూపించి మరీ అడిగినట్టు సమాచారం. ఉన్నతాధికారుల కళ్లుగప్పడానికి ప్రభాకర్ రావు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారో కూడా వెలుగులోకి తెచ్చే యత్నం చేసింది సిట్. కొన్నింటికి ఉన్నతాధికారుల పేర్లు వాడిన ప్రభాకర్ రావు.. మరికొన్ని సార్లు సైలెంట్ మోడ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
మావోయిస్టుల పేర్లు చెప్పి CDR, IPDR సేకరణ
మావోయిస్టుల పేర్లు చెప్పి కొందరు ప్రముఖులకు చెందిన కాల్ డీటైల్ రికార్డులు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటైల్ రికార్డులు సేకరించారని.. వీటి ఆధారంగా పెద్ద ఎత్తున అనధికార ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. అంతే కాదు తప్పుడు సమాచారంతో.. హోం శాఖ నుంచి అనుమతి కోరినవి కొన్ని కాగా.. అనధికారంగా వందల ప్రొఫైళ్ల తయారీ చేసినట్టు గుర్తించారు. ఈ వివరాలు 1200 పేజీల వరకూ ఉండగా.. వీటినే ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. వీటితో పాటు పలు హార్డ్ డిస్క్‌లను కట్టర్లతో ధ్వంసం చేశారు. కొన్ని హార్డ్ డిస్క్‌ల ముక్కలను మూసీలో పడేసినట్టు గుర్తించింది దర్యాప్తు బృందం.
బాస్ ప్రభాకర్ రావు చెబితే చేశానన్న ప్రణీత్ రావు
ఇదంతా ఎందుకు చేశారు? ఎవరు ఆదేశాలిచ్చారు? అని ప్రణీత్‌రావును సిట్ అధికారులు ప్రశ్నించినపుడు.. తన బాస్ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే చేశానని ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభాకర్‌రావు నిరాకరించడంతో ప్రణీత్‌రావుతో డేటా ధ్వంసానికి ముందు ఏ సమయంలో ఫోన్ మాట్లాడారు? ఎంత సేపు మాట్లాడుకున్నారు? అన్న వివరాలను ప్రభాకర్‌రావు ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ చేయించినట్లు కొంతవరకు ప్రభాకర్‌రావు అంగీకరించినట్లు తెలుస్తోంది.
రిట్రీవ్ డేటా ఆధారంగా పలు ప్రశ్నలు
డేటా ధ్వంసానికి సంబంధించి నిబంధనలను పాటించలేదన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించారని సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నుంచి అందిన ముఖ్యమైన రిట్రీవ్ డేటా ఆధారంగా కూడా ప్రభాకర్‌రావును సిట్ అధికారులు ప్రశ్నించారని తెలిసింది. తదుపరి విచారణలో ప్రభాకర్‌రావుతో పాటు ప్రణీత్‌రావును కలిపి.. విచారించాలని సిట్ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మొత్తం 27 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ
ఇప్పటి వరకూ మూడు రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించగా.. మొత్తం 27 గంటల విచారణా సమయం ఎదుర్కున్నారాయన. నిందితుడి నుంచి మరిన్ని వివరాలను రాబట్టడానికి కొత్త టెక్నిక్ వాడేలా ప్రణాళిక రచించింది సిట్. అందులో భాగంగా ట్యాపింగ్ బాధితులను ప్రభాకర్ రావు ముందుంచి.. ముఖాముఖీ మాట్లాడించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా.. 600 మంది బాధితుల జాబితా రూపొందించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తాము గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో.. ఆయన ముందే చెప్పించే ఎత్తుగడ వేస్తున్నట్టు సమాచారం. దీని ద్వారా ప్రభాకార్ రావు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలన్న ఆలోచనలో సిట్ ఉన్నట్టు తెలుస్తోంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంత నాయకుడిపై ట్యాపింగ్
అసలీ ఫోన్ ట్యాపింగ్ అన్న సాంకేతిక పరిజ్ఞానం వాడాల్సింది వేరు. కానీ వాడిన విధానం వేరన్నది ఇప్పుడు మెయిన్ కంప్లయింట్. బేసిగ్గా తీవ్రవాదుల కదలికలు పసిగట్టడానికి.. వారి మాటలను అనుసరించి సమాచారం రాబట్టడానికి.. ఈ మెథడ్ ఫాలో అవుతుంది పోలీస్ శాఖ. కానీ ఇదే విధానం ఫాలో అయ్యి.. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఒక పొలిటీషియన్ ఉద్యోగులపై నిఘా పెట్టారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఈయన ఉద్యోగులందరూ మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణం చూపించి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డట్టు విచారణలో బయట పడింది. అలాగే ఒక మహిళా ఎమ్మెల్యే ఫోన్ సైతం ఇలాగే ట్యాప్ చేసి.. ఆ సమాచారాన్ని నాటి బీఆర్ఎస్ మంత్రికి చేరవేసినట్టు ఐడెంటిఫై చేసింది సిట్.
సెంట్రల్ జోన్ SHO ఫోన్ సైతం ట్యాపింగ్
అంతే కాదు హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఒక స్టేషన్ SHO ఫోన్ సైతం ట్యాపింగ్ చేశారు. ఇతడు SIB సమాచారం బయటకు పొక్కేలా చేస్తున్నారన్న అనుమానంతో ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావ్ బృందం ఫాలో అయిన మరో రాంగ్ మెథడ్ ఏంటంటే.. నేతలకు, వ్యాపారులకు, మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ముద్ర వేసి డిపార్ట్ మెంట్లోని కొందరి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఒక ఇన్ స్పెక్టర్ కి, మావోయిస్టులకు సంబంధాలేముంటాయని విచారణాధికారులు వేసే ప్రశ్నలకు ప్రభాకర్ రావు మౌనమే సమాధానంగా ఉన్నారట.
2007లో సాధారణ SIగా డిపార్ట్ మెంట్లోకి ప్రణీత్
2007 బ్యాచ్ SI గా డిపార్ట్ మెంట్లోకి అడుగు పెట్టిన ప్రణీత్ రావుకు.. మునుగోడు ఉప ఎన్నిక లో అందించిన ట్యాపింగ్ సేవలకుగానూ.. బంపరాఫర్ దక్కినట్టు తెలుస్తోంది. ఆ బై ఎలెక్షన్ టైంలో SIBలోని స్పెషల్ ఆపరేషన్స్ ద్వారా అక్రమ ట్యాపింగ్ చేసిందుకు ఆయనకు డీఎస్పీ పదోన్నతి లభించినట్టు తెలుస్తోంది. దీన్నే యాక్సిలరేటెడ్ ప్రమోషన్ అంటారు. దీని వెనక కూడా ప్రభాకర్ రావు ఉన్నట్టు సమాచారం. 2022 నవంబర్ లో ఉప ఎన్నిక జరగ్గా.. 2023 మార్చి 31న ప్రణీత్ రావు డీఎస్పీ అయ్యారు. 2007 బ్యాచ్ లో సుమారు 450 మంది ఎస్సైగా పోలీసు శాఖలో చేరగా వీరిలో ప్రణీత్ రావు ఒక్కరే డీఎస్పీ ర్యాంక్ లో ఉండటం గుర్తించాల్సిన విషయం.
యాంటీ మావోయిస్టు కార్యకలాపాల్లో..
బేసిగ్గా ఎస్ఐబీలో మావోయిస్టు కార్యకలాపాల్లో.. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన అధికారులకు.. ఈ తరహా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ లభిస్తుంది. ఇక్కడ చిత్రమైన విషయమేంటంటే.. ప్రణీత్ అక్రమ ట్యాపింగ్ చేసినందుకు ఈ ప్రతిఫలం దక్కడం గమనించాల్సిన విషయం. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగాపని చేసిన టైంలో.. బీబీనగర్ ఎస్సైగా పని చేసేవారు ప్రణీత్ రావు. సామాజిక సంబంధ బాంధవ్యాల దృష్ట్యా.. ప్రభాకర్ రావుకు దగ్గరయ్యారు ప్రణీత్ రావు. తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ లోకి రావడంతో ప్రభాకర్ రావు సైతం అక్కడే చేరారు. 2017లో ఇన్ స్పెక్టర్‌గా చేరి తర్వాతి ఐదేళ్లకే.. డీఎస్పీ కాగలిగారు. జూన్ 17న ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతుండగా.. ఇలాంటి ఎన్నో విషయాలను వెలుగులోకి తేవడానికి.. బాధితులతో కన్ ఫ్రంటేషన్ పద్ధతి వాడేలా తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఏమంటున్నారు? వారి మెయిన్ కంప్లయింట్ ఏంటి?
ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఏమంటున్నారు? వారి మెయిన్ కంప్లయింట్ ఏంటి? ట్యాపింగ్ బాధితులు కేవలం ఆరు వందల మందేనా? అంతకన్నా మించి ఉందా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఏం చేశారు? అసలా వివరాలు ఎలాంటివి? ఇది ఎంతటి చట్ట విరుద్ధమైనది? బాధితుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్యాపింగ్ బాధితులది ఒక్కొక్కరిదీ ఒక్కో ఆందోళన
ట్యాపింగ్ బాధితులది ఒక్కొక్కరిదీ ఒక్కో ఆందోళన. ప్రస్తుతం విచారణాధికారులు ఆరు వందల మంది వివరాలు సేకరించారు. కానీ ఈ మొత్తం 4 వేలకు పైగా ఉందని అంటారు బాధితులు.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఒక వేళ ప్రభుత్వం చెప్పిందే అనుకుందాం. అధికారులకు ఏమైంది? భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా వింటారా? ఇది అన్యాయం. అన్నది వీరి ఆవేదనగా తెలుస్తోంది. ఇది ఎంత మాత్రం కరెక్టు కాదు. దీన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దయచేసి వీరందరినీ కఠినంగా శిక్షించండని వీరు డిమాండ్ చేస్తున్న విధం కనిపిస్తోంది.
బంధుమిత్రులందరి మాటలూ విన్నారు- బాధితులు
ఇప్పటి వరకూ మా ఫోన్లు ఎంతో సేఫ్ అనుకున్నాం. పార్టీకి పని చేసినందుకుగానూ మా బంధు మిత్రులందరి మాటలూ విన్నారు. ఇది ఎంత వరకూ సమంజసం? ఇలాగేనా చేసేది. రాజ్యాంగం ఏం చెబుతోంది? వీళ్లేం చేశారు? మాకు అస్సలు అర్ధం కావడం లేదన్నది వీరి ఆక్రందనగా తెలుస్తోంది.
ప్రభాకర్ రావును నియమించిన సోమేశ్ ని సైతం శిక్షించాలి- బాధితులు
ప్రభాకర్ రావు ఒక మాజీ ఐపీఎస్. ఆయన ఎప్పుడైతే రిటైర్డ్ అయ్యారో ఆయన జీరోకి వచ్చేస్తారు. అలాంటి ఆయన్ను పిలిచి తిరిగి అధికారం ఇచ్చిన నాటి సీఎస్ సోమేశ్ కుమార్‌ని కూడా తప్పక శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీళ్లకీ అధికారం ఎవరిచ్చారు? ఇలాంటి వాళ్లను అసలు ఏం చేయాలి? ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఇలా జరగటం ఎంత మాత్రం క్షమార్హం కాదని అంటారు వీరు. ఇది పూర్తి చట్ట వ్యతిరేకంగా అభివర్ణిస్తున్నారు వీరంతా.
ఎవరికీ తెలియని నెంబర్లు కూడా రికార్డింగ్‌లో ఉన్నాయి
వీరందరిదీ ఒకటే మాట. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఫోన్లు, మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరికీ తెలియని నెంబర్లు కూడా రికార్డింగ్‌లో ఉన్నాయి. ఈ రోజు పోలీసులు చెబుతుంటే.. మా గుండె జలదరించింది. 2023 నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల నుంచి 6 వేల ఫోన్ల వరకూ ట్యాప్‌కి గురయ్యాయి. గత పాలకుల ఆదేశాల మేరకు వ్యక్తిగత వివరాలను కూడా చాటుగా వినడం నేరమంటూ.. వీరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ప్రతిపక్షమే ఉండకూడదన్న ధోరణి కరెక్టు కాదు
ప్రతిపక్షమే ఉండకూడదన్న ధోరణిలో ఇదంతా సాగింది. ఇది కరెక్టు కాదు. ఎన్నికల సమయంలో మా ప్రతి కదలికా ఫాలో అయ్యారు. మా ప్రతి ఫోన్ విన్నారు. నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలన్నది బాధితుల డిమాండ్‌గా తెలుస్తోంది.
మరే పాలకులూ ఇలా చేయాలంటే భయపడాలి
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ లో భాగస్వాములైన వీరందని ఎలా శిక్షించాలంటే వచ్చే రోజుల్లో మరే పాలకులైనా సరే.. ఇలా చేయడానికే భయపడాలి. ఈ దిశగా వీరికి శిక్షలు పడాలన్నది బాధితుల వాయిస్‌గా తెలుస్తోంది.
నిందితులకు అలాంటి శిక్షలు పడాలి- బాధితులు
ఈ కేసులోని నిందితులంతా కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పారు. ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే తామీ ట్యాపింగ్‌కి పాల్పడినట్టు చెప్పారు. ప్రభాకర్ రావు చూస్తే శాఖాపరమైన ఆదేశాలు మాత్రమే ఇచ్చామంటున్నారు. ఉన్నతాధికారులకు తెలిసే ఈ పని చేశామన్నది ఆయన మాట. డీఎస్పీ ప్రణీత్ రావును కూడా విచారించిన అధికారులకు తెలిసిందేంటంటే.. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే హార్డు డిస్కులు ధ్వంసం చేశానని అంటారాయన. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే మరోమారు ప్రభాకర్ రావును విచారించారు. ఈ విషయాలు ఎలా తెలిశాయో అర్ధంగాక ప్రభాకర్ రావు షాకైనట్టు తెలుస్తోంది.
రాజకీయ నాయకులపై నిఘా కోసమే SIBలో SOT
రాజకీయ నాయకులపై నిఘా కోసమే ఎస్ఐబీలో.. ఎస్వోటీని ఏర్పాటు చేసినట్టు అంగీకరించారు ప్రభాకర్ రావు. అంతే కాదు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారిని టార్గెట్ చేసుకుని.. వారందరి సంభాషణలు వినాలన్న ఉద్దేశంతోనే.. ఈ SOT విభాగం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికలక ముందు బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఉన్న వారందరితో పాటు.. ప్రముఖుల ఫోన్లపై SOT నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. మావోయిస్టు సానుభూతిపరుల పేరిట వీరిందరినీ ట్యాప్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రణీత్ రావు ఫోన్లో పలువురు రాజకీయ నాయకుల కాల్ రికార్డింగ్స్ గుర్తించారు విచారణాధికారులు. జూన్ 16న బాధితుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన అధికారులు.. పదిహేడున ప్రభాకర్ రావును బాధితుల ముందు.. మరింత సమాచారంతో విచారించనున్నారు.
Story By Adinarayana, Bigtv Live