OTT Movie : ఒక ఇండియన్ రొమాంటిక్ క్రైమ్ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుతో అందరి చూపు ఆ సినిమాపై పడింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శనకు వచ్చింది. ఇందులో నటించిన అనసూయ సెంగుప్తాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును వరించింది. ఈ కేటగిరీలో అవార్డు గెలిచిన మొదటి ఇండియన్ మహిళగా అనసూయ సెంగుప్తా గుర్తింపు పొందింది. ఈ కథ సె*క్స్ వర్కర్స్ రియల్ లైఫ్ స్ట్రగుల్స్, లెస్బియన్ రొమాన్స్, వుమెన్ ఎంపవర్‌మెంట్ మీద ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? దీని కథ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘The Shameless’ 2024లో వచ్చిన హిందీ రొమాంటిక్ క్రైమ్ మూవీ. కాన్‌స్టాంటిన్ బోజానోవ్ అనే బల్గేరియన్ డైరెక్టర్ దీనిని తెరకెక్కించాడు. ఇందులో అనసూయ సెంగుప్తా (రేణుకా), ఓమారా షెట్టి (దేవిక) ప్రధాన పాత్రల్లో నటించారు. 115 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి ఐయండిబిలో 6.0 /10 రేటింగ్ ఉంది. ఈ చిత్రం ఇంకా ప్రధానంగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడుతోంది. థియేటర్లలో కూడా రిలీజ్ కాలేదు. అయితే తొందరలోనే నేరుగా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అధికారిక సమాచారం కోసం వేచి ఉండాల్సిందే.
ఢిల్లీలో ఒక బ్రోథల్ హౌస్ లో కస్టమర్‌గా వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్‌ని, రేణుకా అనే సె*క్స్ వర్కర్ సెల్ఫ్ డిఫెన్స్‌లో చంపి ఎస్కేప్ అవుతుంది. ఆమె గతం చాలా ట్రాజిక్ గా నడిచింది. రిలిజియస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె అనుకోని పరిస్థితుల వల్ల బ్రోథల్ లైఫ్‌లో చిక్కుకుంది. ఇప్పుడు పోలీస్ సెర్చ్ నుంచి తప్పించుకుని నార్త్ ఇండియాలోని ఒక దేవదాసీ ట్రెడిషనల్ గ్రూప్ లో చేరుతుంది. అక్కడ ఆమెను ఆశ్రయం ఇస్తారు కానీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అక్కడే 17 ఏళ్ల దేవిక ఆమెకు పరిచయం అవుతుంది. దేవిక ఇన్నోసెంట్ అమ్మాయి. ఆమె ఫ్యామిలీ ఆమెను రిలిజియస్ సాక్రిఫైస్ కోసం ప్లాన్ చేస్తుంది. రేణుకా, దేవిక మధ్య మొదట ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయి, తర్వాత డీప్ ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది. ఈ బాండింగ్ లెస్బియన్ రొమాన్స్‌గా మారుతుంది.
Read Also : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు
రాత్రయితే సీక్రెట్ మీటింగ్స్ తో ఒకరినొకరు షేర్ చేసుకుంటారు. వీళ్ళ రొమాన్స్ హద్దులు దాటి పోతుంది. రేణుకా దేవికకి ఫ్రీడమ్ గురించి చెప్పి ఎస్కేప్ ఐడియా ఇస్తుంది. కమ్యూనిటీ లీడర్స్ అంతా వీళ్ళ మధ్య రిలేషన్‌షిప్‌ని చూసి షాక్ అవుతారు. వాళ్లు ఇద్దరినీ పనిష్ చేయడానికి ట్రై చేస్తారు. దేవికని రేణుకా కాపాడుతూ ఎస్కేప్ ప్లాన్ వేస్తుంది. ఇద్దరూ రిస్క్ తీసుకుని పారిపోతారు. కానీ క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? గ్రామస్తులకు వీళ్ళు దొరికిపోతారా ? స్వేచ్చగా బ్రతుకుతారా ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ క్రైమ్ మూవీని చూసి తెలుసుకోండి.