Bigg Boss 9 Telugu Day 61 : డే 60 ఎపిసోడ్ లో ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ గా తనూజా, భరణి, ఇమ్మూ , రీతూ, దివ్య, సుమన్ శెట్టి ఛాన్స్ పట్టేసిన విషయం తెలిసిందే. అయితే 10వ వారం కూడా ఇమ్మూనే కెప్టెన్ అయ్యి కూర్చున్నాడు. రీతూకి, తనూజాకి భంగపాటు తప్పలేదు. ఇంతకీ ఈరోజు ఎపిసోడ్ బిగ్ బాస్ 9 తెలుగు డే 31లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
రెబల్ పవర్ తో తనూజాను తీసి ఉంటే నీకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండేది కదా ? అని అడిగాడు డెమోన్. కానీ రీతూ మాత్రం తను ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు. అలా తీసేయడానికి నాకు మనసొప్పదు. మా మధ్య ఏదన్నా ఉంటే తర్వాత చూసుకుంటాం అని సమాధానం చెప్పింది. ఇక దివ్య రెబల్ అయినప్పుడు మిమ్మల్ని తీయలేకపోయాను. లేపిన ముగ్గురిలో నుంచి ఒకరిని తీయాలి. కానీ అప్పటికే లేచారు కాబట్టి కన్సిడర్ చేయరేమో అని కళ్యాణ్ ను తీసేసాను అని తన కన్నింగ్ గేమ్ ను స్వయంగా బయట పెట్టుకుంది. అంతకుముందే టీం స్పిరిట్, మనలో ఎవ్వరూ ఎవ్వరినీ తీయకూడదు అని మాట్లాడింది దివ్య. ఇప్పుడు స్వయంగా కళ్యాణ్ కు వెన్నుపోటు పొడుస్తూ తన దరిద్రమైన స్ట్రాటజీని బయట పెట్టింది.
ఇక కెప్టెన్సీలో సపోర్టింగ్ టాస్క్ పెట్టాలని గట్టిగా కోరుకుంది తనూజా. ఫిజికల్ టాస్క్ పెడితే ఇమ్మూ గెలుస్తాడు అనే ఉద్దేశం ఆమెది. అనుకున్నట్టే బిగ్ బాస్ ముద్దుబిడ్డ కోరికను తీర్చాడు. ‘వే టు కెప్టెన్సీ’ అంటూ రెడ్, బ్లూ ట్రైన్స్ టాస్క్ పెట్టాడు. ఫస్ట్ బజర్ మోగగానే నాన్ కంటెండర్లు ట్రైన్ లో డ్రైవర్ గా కూర్చోవాలి. బిగ్ బాస్ ఏ ట్రైన్ కదులుతుందని చెప్తే, ఆ ట్రైన్ డ్రైవర్ కు కంటెండర్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్ వస్తుంది. ఈ టాస్క్ లో నిఖిల్ సుమన్ శెట్టిని, రామూ భరణిని, సాయి దివ్యను తీసేశారు. రీతూ, ఇమ్మూ, తనూజా మిగలగా… చివర్లో దివ్య తనూజాను తొలగించి పర్సనల్ పగ తీర్చుకుంది. దీంతో తనూజా గుక్కపెట్టి ఏడ్చి, భరణిని తన దగ్గరకు రావొద్దని చెప్పేసింది.
ట్రైన్ డ్రైవర్ కోసం చివర్లో రీతూ, కళ్యాణ్ మధ్య స్ట్రాంగ్ ఫైట్ నడిచింది. అయితే హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ కు ఇచ్చినట్టు… దివ్యకు చెయిర్ ను కట్టబెట్టారు. ఇంకేముంది దివ్య ముందు తనూజాపై తన పగ తీర్చుకుని, తరువాత మాట మార్చింది. కళ్యాణ్ కు ‘నాకు ఆ టైమ్ లో డెసిషన్ మార్చుకోవాలి అన్పించింది’ అని చెప్పింది. అతను పక్కకెల్లగానే లేదు కళ్యాణ్ చెప్పకముందే నేను కుర్చీలో కూర్చున్నాను అనేసింది. అంతేకాదు భరణిపై మీవల్లే నన్ను ఎన్ని మాటలు అంటున్నారో చూశారా? స్టాండ్ తీసుకోండి ఇప్పటికైనా అంటూ తనూజాపై ఎగదోసె ప్రయత్నం చేసింది. కానీ మీరూ మీరూ కొట్టుకుంటే నేనెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతా అంటూ భరణి తిరిగి ఆమెపైనే సీరియస్ అయ్యాడు.
ఇక చివరగా రీతూ – ఇమ్మూ మిగిలిపోయారు. వాళ్ళిద్దరితో ఒకరు కెప్టెన్ కావడానికి మళ్ళీ ‘కౌంట్ ఇట్ క్రాక్ ఇట్’ అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో అక్కడుకున్న వస్తువుల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత అవి ఎన్ని ఉన్నాయో లెక్కబెట్టి, ఆ వస్తువుకు సంబంధించిన కోడ్ ను సెట్ చేయాలి. ఆ తరువాత అందులోని రాడ్ ను అన్ లాక్ చేసి, పక్కనున్న బాక్స్ ను పగలగొట్టి, ఫ్లాగ్ తీసుకోవాలి. ఈ టాస్క్ లో గెలిచి ఇమ్మూ 3వ సారి కెప్టెన్ అయ్యాడు.
Read Also : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా