BigTV English
Advertisement

Mark Zuckerberg : మనకు తెలియని.. జుకెర్‌బర్గ్..!

Mark Zuckerberg : మనకు తెలియని.. జుకెర్‌బర్గ్..!
Mark Zuckerberg

Mark Zuckerberg : ఫేస్‌బుక్ రూపకర్త జుకెర్‌బర్గ్ గురించి తెలియని యువతీ యువకులు ప్రపంచంలో ఎవరూ ఉండరంటే ఆశ్చర్యం లేదు. తన ఆవిష్కరణతో ఇంటర్నెట్ రూపురేఖలు మార్చిన జుకెర్ బర్గ్ కేవలం 32 ఏళ్ల వయసుకే 53 బిలియన్ డాలర్ల ఆస్తికి యజమాని కాగలిగాడు. అయితే.. యువ ఆవిష్కర్తలకు మార్గదర్శకుడినగా నిలిచిన జుకెర్ బర్గ్ వ్యక్తిగత జీవితంలోనూ మనకు తెలియని ఆసక్తికరమైన విశేషాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.


జుకెర్‌బర్గ్ స్కూలు విద్యార్థిగా ఉండగా, ఆయన తండ్రి ఓ డెంటల్ క్లినిక్ నడిపేవాడు. అక్కడికి వచ్చే పేషెంట్ల వివరాలను రిసెప్షనిస్టు పదేపదే ఫోన్ చేసి తండ్రికి చెప్పటం మార్క్ గమనించాడు. రిసెప్షనిస్ట్‌తో పనిలేకుండా రోగుల వివరాలు తండ్రికి చేరేలా ఓ ప్రోగ్రామింగ్ సిస్టం తయారు చేశారు. అప్పుడు మార్క్ వయసు 12 ఏళ్లే.

తల్లిదండ్రులు.. మార్క్ కంప్యూటర్ శిక్షణకై ఓ ట్యూటర్‌ను పెట్టారు. అయితే.. మనోడి నాలెడ్జ్ చూసి, వీడికి నేను చెప్పాల్సిందేమీ లేదని ఆయన తేల్చిపారేశాడట.
స్కూల్‌లో ఉండగా, ‘సినాప్స్’ అనే మ్యూజిక్ యాప్‌చేశాడు. అది హిట్ కావటంతో దాన్ని10 లక్షల డాలర్లకు కొనటంతో బాటు కొలువూ ఇస్తామని Microsoft ఆఫర్ వచ్చింది. అయితే.. ‘చదువుకు ఇబ్బంది’ అని నో చెప్పాడట.


హార్వర్డ్‌లో ఉండగా, విద్యార్థుల్లో ఎవరు అందంగా ఉన్నారో చెప్పండంటూ ఓటింగ్ అప్షన్‌తో ‘ఫేస్‌మాస్’ అనే వెబ్‌సైట్ చేశాడు. అయితే అనుమతి లేకుండా విద్యార్థుల ఫోటోలు వాడటంతో వర్సిటీ ఆ ప్రాజెక్టును రద్దుచేసింది. క్యాంపస్‌లో మార్క్ ఇంటర్నెట్ వాడకుండా నిషేధం విధించారు.

2004లో హార్వర్డ్ హాస్టల్లోని డార్మిటరీలో నలుగురు రూమ్‌మేట్స్‌తో కలిసి మార్క్ ఫేస్‌బుక్‌ను ఆవిష్కరించాడు. అయితే.. డ్రాపవుట్‌గా మిగిలాడు. 2017 మే 25న అదే హార్వర్డ్ ‘వీడు మా విద్యార్థే’ అంటూ హానరరీ డిగ్రీని ప్రదానం చేసింది.

మార్క్.. ఓ పార్టీకి వెళ్లినప్పుడు.. అక్కడ రెస్ట్‌రూమ్ క్యూలో నిలబడిన ప్రిస్కిల్లా చాన్‌ అనే చైనా అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు. కొన్నాళ్ల ప్రేమాయణం తర్వాత 2012లో వారి పెళ్లి జరిగింది.
పెళ్లిలో భార్యకు తొడిగిన పెళ్లి ఉంగరాన్ని మార్క్ స్వయంగా డిజైన్ చేశాడు. ఆసియా వాసులు అదృష్ట రత్నంగా నమ్మే కెంపు(రూబీ), దానికి ఇరువైపులా 2 చిన్న వజ్రాలుండేలా రూపొందించాడు.

2015లో ‘మాక్సిమా’ అనే పాప, 2017లో ‘ఆగస్ట్’ అనే పాప పుట్టగా మరోమారు పాప పుట్టబోతోందని 2023 జనవరి 2న మార్క్ ప్రకటించారు. (అమెరికాలో లింగ పరీక్షలు చట్టబద్దం). మొదటి పాప పుట్టినప్పుడు మార్క్ దంపతులు రూ. 3 లక్షల కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఫేస్‌బుక్‌లో తమ 99 శాతం షేర్లను తమ జీవితకాలంలో దశల వారీగా విరాళమిస్తామనీ ప్రకటించారు. తన ఆదాయంలో సగం చారిటీకి ఇస్తానని బిల్‌గేట్స్, వార్రెన్ బఫెట్‌తో కలిసి 2010లో సంతకాలు చేశారు.

మార్క్ 6 భాషల్లో నిష్ణాతుడు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, హిబ్రూ, లాటిన్, ప్రాచీన గ్రీకులతో బాటు అత్తామామలతో మాట్లాడేందుకు 2010లో మాండరిన్ నేర్చుకున్నాడు.

మార్క్‌కు నచ్చిన మ్యూజిక్ ఆర్టిస్టులు.. గ్రీన్ డే, షకీరా, జై జెడ్, టైలర్ స్విఫ్ట్‌.

‘అదృష్టం ఎప్పుడూ ధైర్యవంతులవైపే ఉంటుంది’ అనేది మార్క్ ఫేవరెట్ కొటేషన్.

ఫేస్‌బుక్ సీఈవోగా మార్క్ వార్షిక వేతనం కేవలం ఒక డాలర్ మాత్రమే! అయితే.. కంపెనీ లాభాల్లో వాటా, వగైరాలు చాలానే ఉన్నాయి.

తనకున్న కలర్ బ్లైండ్‌నెస్ వల్ల మార్క్.. ఎరుపు, ఆకుపచ్చ గుర్తులను గుర్తించలేడు. అందుకే.. ఫేస్‌బుక్ లోగోను బ్లూ కలర్‌లో రూపొందించాడు.

మార్క్ దంపతులు ‘బీస్ట్’ అనే మగ కుక్కను పెంచుకుంటున్నారు. దానికి ఫేస్‌బుక్‌లో 25 లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు.

ఈ రోజుకీ ఫేస్‌బుక్ ఆఫీసులో మార్క్‌కు ప్రత్యేక క్యాబిన్ లేదు. సహోద్యోగులతో కలిసి వారి డెస్క్ మీదే కూర్చుని పనిచేస్తారు. అక్కడే ఉన్న ఓ మోస్తరు కాన్ఫరెన్స్ రూమ్‌లో ఎక్కువ సమయం మీటింగులతో బిజీగా ఉంటారు.

మార్క్ బిజినెస్ కార్డ్‌లో ‘ఐ యామ్ సీఈవో, బిచ్ (I’m CEO, Bitch) అని ఉంటుంది. ఔను, ఇది ముమ్మాటికీ నిజం. కావాలంటే మీరు నెట్‌లో చెక్ చేసుకోవచ్చు.

స్నేహితులు ఆయన్ను ‘జుర్క్’ అని పిలుస్తారు. ఆయన తల్లి ‘ప్రిన్స్‌లే’ అంటుందట.

2011 నాటికి గూగుల్‌ప్లస్‌లో అత్యధికులు ఫాలో అయ్యే వ్యక్తిగా మార్క్ నిలిచారు. ఎంతగా అంటే.. గూగుల్‌ప్లస్ వ్యవస్థాపకుడి ఫాలోవర్లను సైతం మించిపోయేంత.

మార్క్‌ ఏటా ఓ తీర్మానం చేసుకుంటారు. 2009లో రోజూ టై కట్టుకోవాలని, 2011లో స్వయంగా తాను చంపిన జంతువులనే తింటానని, 2013లో ‘ఫేస్‌బుక్’లో కాకుండా, రోజుకో కొత్త వ్యక్తిని బయట కలుస్తానని వెల్లడించారు.

మార్క్ జీవితం, ఫేస్ బుక్ ఆవిష్కరణల మీద ‘ద సోషల్ నెట్‌వర్క్’ అనే సినిమా కూడా వచ్చింది.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×