వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత వేగం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు భారతీయులు మాత్రమే ప్రశంసించిన వందే భారత్ ప్రయాణాన్ని తాజాగా ఓ బ్రిటిష్ ఫ్యామిలీ హైలెట్ చేసింది. తాజాగా వందే భారత్ రైల్లో ప్రయాణించిన ఆ ఫ్యామిలీ తన ఎక్స్ పీరియెన్స్ ను షేర్ చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన హచిన్సన్ ఫ్యామిలీ నాలుగు గంటల పాటు వందే భారత్ లో ప్రయాణించింది. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోను షూట్ చేసి తమ అభిప్రాయాన్ని పంచుకుంది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వందే భారత్ ఆన్ బోర్డ్ సర్వీసులకు ఫిదా అయినట్లు బ్రిటీష్ ఫ్యామిలీ వెల్లడించింది.
ఇన్ స్టాగ్రామ్ వీడియోలో తల్లిదండ్రులు, వారి ముగ్గురు కుమార్తెలు రైల్లో ప్రయాణించారు. తమ సీట్లలో కూర్చుని రైలులో అందించే ఉచిత స్నాక్స్ ను టేస్టీ చేస్తూ కనిపించారు. “ఈ టిక్కెట్ల ధర వాస్తవానికి మా నలుగురికి ఒక్కొక్కరికి 11 పౌండ్లు(రూ. 1200). ఫుడ్ ఫ్రీగా అందిస్తున్నారు. మా అమ్మాయిలు ఇప్పటికే ఫుడ్ తీసుకున్నారు” అంటూ ఆమె తల్లి చెప్పుకొచ్చింది. ఈ ఫుడ్ లో కారామెల్ పాప్ కార్న్, ఒక ప్యాటీ, మ్యాంగో జ్యూస్, అల్లం టీ సాచెట్ ఉన్నాయి. వారు తమకు అందించిన ఫుడ్ ను కూడా రివ్యూ చేశారు.“ మేము చాయ్ పౌడర్ ఏంటీ అనుకున్నాం. కానీ, వేడి నీరు అందించారు. అందులో కలిపి తాగితే ఎంతో రుచిగా ఉంది. నిజంగా అద్భుతం” అని వీడియోలో చెప్పుకొచ్చారు.
బ్రిటిష్ ఫ్యామిలీ వందే భారత్ ట్రైన్ జర్నీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటికే 1.5 మిలియన్ల మందికి పైగా చూశారు. వందేభారత్ లో అందించే సౌకర్యాలను హైలెట్ చేసినందుకు ఇండియన్ నెటిజన్లు వారి ప్రశంసిస్తున్నారు. “ముందుగా, మీరు ఇండియాను విజిట్ చేసినందుకు ధన్యవాదాలు. మా రైళ్ల గురించి మీరు అందించిన పాజిటివ్ రివ్యూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గమనించారు. ఇది మా వందే భారత్ సూపర్ ఫాస్ట్ రైలు, ఇందులో ఎగ్జిక్యూటివ్, చైర్ కార్ అనే రెండు తరగతులు ఉన్నాయి. నెక్ట్స్ టైమ్ మీరు ఈ రైలులో ప్రయాణించినప్పుడు, మరింత సౌకర్యవంతమైన అనుభవం కోసం ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోండి. మీ రివ్యూకు నిజంగా థ్యాంక్స్” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “వందే భారత్ చాలా సౌకర్యవంతమైన రైళ్లు, ఆర్థిక స్థోమత ఉన్నవారికి” అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. “భారత్‌కు స్వాగతం. వందే భారత్ ఒక లెవల్ అప్ రైలు. తేజస్, రాజధాని, విస్టాడోమ్ ప్రయాణాన్ని కూడా ప్రయత్నించండి!” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తంగా హచిన్సన్ ఫ్యామిలీ వందేభారత్ రివ్యూ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. వందేభారత్ ప్రయాణం పట్ల క్రేజీని కలిగిస్తుంది.
Read Also: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!