OTT Movie : ఫిలిపైన్ నుంచి ఒక వాంపైర్ లవ్ స్టోరీ రీసెంట్ గా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమా ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. చావే లేని ఒక వాంపైర్, కొన్ని వందల సంవత్సరాలుగా ప్రేమించిన వాళ్ళని తన కళ్ల ముందే పోగొట్టుకుంటూ ఉంటాడు. అతనికి ఉన్న ఈ శాపం ఎమోషన్స్ ని టచ్ చేస్తుంది. అయితే అతను మనుషుల రక్తం తాగే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
‘The Time That Remains’ 2025లో వచ్చిన ఫిలిపైన్ డార్క్ ఫాంటసీ రొమాంటిక్ మూవీ. అడాల్ఫో అలిక్స్ దర్శకత్వంలో కార్లో అక్వినో (మాటియాస్), బింగ్ పిమెంటెల్ (డొమింగా) లీడ్ రోల్స్ లో నటించారు. 116 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.0/10 రేటింగ్ పొందింది. 2025 ఆగస్టు 8న ఈ సినిమా ఫిలిప్పీన్స్ థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
డొమింగా అనే 90 ఏళ్ల వృద్ధురాలిని దొంగలు కాల్చడంతో ఆసుపత్రిలో చేరుతుంది. ఆమెకు రాత్రిపూట సేవలు అందించడానికి మాటియాస్ అనే యువకుడిని నర్సుగా నియమిస్తారు. ఈ సమయంలో డొమింగా తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆమె యువతిగా ఉన్నప్పుడు మాటియాస్ అనే ఒక వ్యక్తితో ఆమెకు గాఢమైన ప్రేమ పుడుతుంది. అయితే మాటియాస్ సాధారణ మనిషి కాదు. అతడు కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకుతున్న ఒక ఇమ్మార్టల్ వాంపైర్. అతడు రక్తం తాగి బ్రతుకుతాడు. ఎప్పటికీ చావడు.
డొమింగాతో అతడు కూడా డీప్ రొమాన్స్ నడుపుతాడు. కానీ ఇంతలో మాటియాస్ సీక్రెట్ వల్ల చుట్టుపక్కల పీపుల్ డెత్స్ జరుగుతాయి. బ్లడ్ డ్రైన్ అయిన బాడీస్ దొరుకుతాయి. పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంగువా ఈ మర్డర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఇప్పుడు మాటియాస్ బ్యాక్ స్టోరీ ఓపెన్ అవుతుంది. అతనికి పురాతన కాలం నుంచి ఒక శాపం ఉంటుంది. ఈ శాపం వల్ల అతను ప్రేమించిన వాళ్ళందరూ అతనికి దూరం అవుతుంటారు.
Read Also : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక