Sunitha Reddy: వైఎస్ ఫ్యామిలీ నుంచి మరొకరు..పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? వైఎస్ వివేకానంద కూతురు సునీతా రెడ్డి రాజకీయారంగేట్రం చేయనున్నారా..? ఈ ప్రశ్నలు రావడానికి కారణం..ఆమె సీఎం చంద్రబాబును కలవడమే! అసలు సునీత ముఖ్యమంత్రిని ఎందుకు కలిసింది..? కలిసి ఏం మాట్లాడింది..?
వైఎస్ వివేకానంద రెడ్డి మరణం తర్వాత మొదటి సారి బయటి ప్రపంచానికి తెలిసిన పేరు సునీతారెడ్డి. తండ్రి మరణంపై హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐ, ఈడీ అంటూ న్యాయం కోసం తిరిగిన సునీత..ఆ తర్వాత తండ్రి మృతిపై సీఎం చంద్రబాబును పలుమార్లు కలిశారు. కానీ గతంలో కలిసింది వేరు..! ఇప్పుడు కలవడం వేరు.! ఇటీవల సునీతారెడ్డి దంపతులు..చంద్రబాబుతో భేటీ అవడంపై ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాశంగా మారింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలింది. ఇక 2024 ఎన్నికల సమయంలో వివేకా హత్యపై సోదరి షర్మిలతో కలిసి..వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే 2024 ఎన్నికల్లో ఇన్ డైరెక్ట్‌గా కూటమి విజయానికి సహకరించాం కాబట్టి ఇప్పుడు జడ్పీ చైర్మన్ పదవి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారనే ప్రచారం పులివెందులతో జోరందుకుంది.
సునీత రెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అన్న నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి కుమారుడు అనురాగ్ రెడ్డిని జెడ్పీ చైర్మన్ చేయాలని సునీత చంద్రబాబును కలిసి కోరినట్లు తెలుస్తోంది. నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ప్రముఖ కాంట్రాక్టర్‌గా జిల్లా వాసులకు సుపరిచిమే. వైయస్ బామ్మర్దిగా రాజకీయంగా పలుకుబడి కలిసొస్తుందని ఎలాగైనా పొలిటికల్‌గా టిడిపి నుంచి బలపడాలని సునీత రెడ్డి దంపతులు ప్లాన్ చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.
పులివెందుల జెడ్పీ చైర్మన్ పదవి కోసం కడప జిల్లాలోని టిడిపి నాయకులు.. ఇప్పటికే పలువురు కర్చీప్ వేసి కూర్చున్నారని.. సునీత రెడ్డి ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడంపై కొంత అసంతృప్తి మొదలవుతుందని ప్రచారం సాగుతోంది.
Also read: రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా? ‘మైసా’ టీజర్ దిమ్మతిరిగేలా!