Jayaprada Comments:సినీ తారల సినిమాల సంగతుల కన్నా వారి వారి పర్సనల్ విషయాలపైనే అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇపుడు వెటరన్ బ్యూటీ జయప్రద చెప్పిన పలు పర్సనల్ విషయాలు కూడా ఇపుడు అభిమానులకి మాంచి కిక్కునిస్తున్నాయి. ముఖ్యంగా తనతో కలిసి పనిచేసిన హీరోల్లో ఎవరు ఎక్కువగా ఫ్లర్ట్ చేసేవారని అడిగితే ఈ అలనాటి అందాల తార ఏమందో ఒకసారి చూసేద్దాం.
ఈ మధ్యనే కపిల్ శర్మ షోలో పాల్గొంది జయప్రద.అందులో జయప్రదని మేడమ్.. హీరోల్లో ఎవరు ఎక్కువగా ఫ్లర్ట్ చేసేవారు? అంటూ ప్రశ్నా బాణం సందించాడు కపిల్.దానికి జయప్రద సిగ్గుల మొగ్గ అవుతూ “చెప్పనా?” అంటూ నవ్వేసింది.అయినా కపిల్ పట్టు విడవుకుండా అడగటంతో “ధర్మేంద్ర” అంటూ మనసులోని మాటల్ని బయటపెట్టేసింది.జయప్రద, ధర్మేంద్ర కలిసి అప్పట్లో పలు సినిమాల్లో నటించారు.దీంతో ఈ వార్త నిజమే అయ్యుంటుందిలే అంటూ ఒక అంచనాకి వచ్చేస్తున్నారు మూవీ లవర్స్.
అదే షోలో జయప్రద అప్పటి షూటింగ్ రోజుల గురించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రాజేష్ ఖన్నా షూటింగ్‌కు చాలా ఆలస్యంగా వచ్చేవారని గుర్తు చేసుకుంది జయప్రద.ఇక దక్షిణాదిలో సినిమాలు చేసేటప్పుడు తనకు ఉదయం ఏడు గంటలకే సెట్‌లో ఉండటం అలవాటని . కానీ బాలీవుడ్‌లోకి వచ్చాక పరిస్థితి మారిపోయిందని వాపోయింది.
ఇక తనను ఉదయం 9 గంటలకు సెట్‌కు రమ్మని చెప్పేవారని.. తాను టైమ్‌కు వెళ్లి మేకప్ కూడా పూర్తి చేసుకుని రెడీగా ఉండేదానినని కానీ రాజేష్ ఖన్నా మాత్రం చాలా ఆలస్యంగా వచ్చేవారని చెప్పుకొచ్చింది.ఇక సాయంత్రం సమయంలో సెట్‌కు వచ్చి.. ముందుగా వడాపావ్ తినేవారని, ఆ తర్వాత ఒక సీన్ షూట్ చేసి రాత్రి 9 గంటలకే ప్యాక్‌అప్ చెప్పేవారని అలనాటి రోజుల్ని నవ్వుతూ గుర్తుచేసుకుంది ఈ అందాల తార
ఇక జయప్రద చెప్పిన మరో విషయం ఏంటంటే అప్పట్లో తాను రోజుకు ఐదు షిఫ్టుల్లో పనిచేసేదానినని తెలిపింది.పైగా చిన్నా చితకా సినిమాలు కాదని అంతా పెద్ద పెద్ద హీరోలే అని ,ఒక షూటింగ్ పూర్తి అయిన వెంటనే మరో షూటింగ్‌కు పరుగెత్తాల్సి వచ్చేదని ఆనాటి బిజీ లైఫ్ ని గుర్తు చేసుకుంది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జయప్రద సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆమె వయసు కేవలం 16, 17 ఏళ్లు మాత్రమే. అప్పటికే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోలుగా ఉన్న నటులతో కలిసి పనిచేయాల్సి వచ్చేది. దక్షిణాదిలో ఎన్టీఆర్, రాజ్‌కుమార్ లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేశానని గుర్తుచేసుకుంది.
ALSO READ:ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!
జయప్రద కెరీర్ విషయానికి వస్తే .. తెలుగు సినిమాల్లోఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి తెలుగు స్టార్ హీరోలతో నటించిన ఆమె.. బాలీవుడ్‌లో ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ హీరోలతోనూ కలిసి నటించడం విశేషం.మొత్తంగా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జయప్రద ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో సత్తా చాటి టాప్ హీరోయిన్ గా ఎదగడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయమే !