Kodangal Politics: సీఎం ఇలాఖా కొడంగల్‌పై బీఆర్ఎస్ నేతల ఫోకస్ పెరిగింది. అన్నాచెల్లెల్లు పాలమూరు టూర్‌లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. కవిత భారీ సభకు ఒకరోజు ముందే కేటీఆర్ పర్యటన చేపట్టడం ఆసక్తిగా మారింది. ఇద్దరి టార్గెట్ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే.
సీఎం ఇలాఖాపై కవిత నజర్ పెట్టారు. ఆదివారం కొడంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆమె పార్టీ పెట్టిన దగ్గర నుంచి పాలమూరులో సభలు నిర్వహించడం ఇది రెండోసారి. తొలిసారిగా షాద్‌నగర్ సమీపంలోని చౌదరిగూడెంలో సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎం సొంత నియోజకవర్గంలోనే భారీ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కవిత భారీ బహిరంగ సభకు ఒకరోజు ముందే.. అంటే శనివారం నాడు కేటీఆర్ హడావుడిగా పాలమూరు టూర్ పెట్టుకున్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకున్న కేటీఆర్.. అనంతరం పెబ్బేరులో మీడియాతో మాట్లాడారు. వనపర్తిలో రోడ్ షో నిర్వహించి కాంగ్రెస సర్కార్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏడాదిన్నర ఓపిక పట్టండి.. మళ్లీ కేసీఆర్ వస్తారని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కృష్ణా నీళ్లలో మన వాటాను కూడా వాడుకోలేకపోతున్నారని, ఆంధ్ర పెద్దఎత్తున తరలించుకుపోతుందని విమర్శించారు.
చెల్లె కవిత సభకు ముందురోజే కేటీఆర్ పాలమూరు పర్యటన చేపట్టడం.. ఇద్దరూ సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కవిత సభపై తెలంగాణ రక్షణ సేన శ్రేణులు భారీ హైప్ క్రియేట్ చేశాయి. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఈ వేదికగా ప్రకటించున్నారనే హింట్ ఇవ్వడం మూలంగా ఇంకా ఆమే ఏమైనా కొత్త పథకాలను పార్టీ తరపున ప్రకటిస్తారా? అనే చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే భూ లక్ష్మి పథకాన్ని ప్రకటించిన కవిత.. మరిన్ని ప్రకటనలు చేస్తారా అన్న చర్చ సాగుతోంది.
Also read: రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కుమార్తె.. కీలక బాధ్యతలిచ్చిన వైసీపీ పార్టీ!