Samantha Srichakra Controversy:సెలెబ్రిటీలకి సంబందించిన ఏ చిన్న వార్త అయినా నిమిషాల్లో వైరల్ అవ్వడం సహజం.ఇపుడు ఆకోవలోనే టాలీవుడ్ వెటరన్ బ్యూటీ సామ్ కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .కారణం ఏంటంటారా ..?అయితే చూసేద్దాం .
తాజాగా సమంత తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెల్సిందే.ఇక ఆ ఫొటోల్లో సమంత చాలా అందంగా, ట్రెడిషనల్ గా కనిపించింది కూడా . దీంతో అభిమానులు ఫొటోలకు లైకులు, కామెంట్లు కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.కానీ అదే ఫొటోల్లో ఒకటి మాత్రం ఇప్పుడు మరో కారణంతో వైరల్ అవుతోంది.
శ్రీచక్రం ఆకారంలో సమంత
అదే … సమంత శ్రీచక్రం ఆకారంలో ఏర్పాటు చేసిన ఒక డిజైన్ మధ్యలో కూరుకోవడమే . అంతే.. ఈ ఫొటో చూసిన నెటిజన్లకు ఒక డౌట్ వచ్చింది.వెంటనే అసలు “శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?” అంటూ సోషల్ మీడియాలో డిబేట్లకి తెరతీశారు.
శ్రీచక్రం అంటే సాధారణ డిజైన్ కాదని, హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా శ్రీవిద్య ఉపాసనలో దానికి ఎంతో ప్రాధాన్యత ఉందని కొందరు భక్తులు చెబుతున్నారు. అందుకే శ్రీచక్రంపై కూర్చున్నట్టుగా కనిపిస్తున్న ఈ ఫొటో తమకు నచ్చలేదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
శ్రీచక్రాన్ని ఇలా ఉపయోగించడం సరైనదేనా?
ఒక నెటిజన్ అయితే ఏకంగా.. “ఇంత పవిత్రమైన శ్రీచక్రాన్ని ఇలా ఉపయోగించడం సరైనదేనా?” అంటూ ప్రశ్నించాడు. మరికొందరు “శ్రీచక్రాన్ని పూజించే వారికి ఇది తప్పుగా అనిపించలేదా?” అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకొందరు మాత్రం “అది నిజంగా పూజించే శ్రీచక్రమేనా? లేక ఫొటోషూట్ కోసం వేసిన డిజైనేనా?” సెటైర్ వేస్తున్నారు . కూడా.ఇక ఈ పద్దతి కొందరు “తప్పు” అంటుంటే.. మరికొందరు “అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు” అంటున్నారు.
అయితే ఈ సీమంతం వేడుకని నిర్వహించిన పంతులు ఒక చిన్నపిల్లాడిని ,అతడికి పెద్దగా దీనిపైన అవగాహన లేకపోవడంతో ఇలా శ్రీ చక్రం మధ్యలో కూర్చోబెట్టాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది .
సామ్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో
సమంత సినిమాల విషయానికి వస్తే.. ‘ఏ మాయ చేసావే’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వెటరన్ బ్యూటీ ‘ఈగ’, ‘మనం’, ‘అత్తారింటికి దారేది’, ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘ఓ బేబీ’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సంగతి తెల్సిందే.ఇక రీసెంట్ గా మా ఇంటి బంగారంతో మరోసారి తన సత్తా సాలిడ్ గా చాటింది. చూడాలి మరి ఈ శ్రీ చక్రం కాంట్రవర్సీ పై సామ్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.