Janwada Farmhouse: కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం.. జన్వాడలోని కేటీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూములను పరిశీలించింది. భూ రికార్డులు, హద్దులు, ప్రభుత్వ భూములతో సంబంధాలపై ఆరా తీశారు. మరిన్ని వివరాలు సేకరిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రదీప్ రెడ్డికి, కేటీఆర్‌కు ఉన్న లింకేంటని ప్రశ్నించారు ఎంపీ చామలకుమార్ రెడ్డి. ఫిరంగి నాలాను కబ్జా చేసి ఫాంహౌస్ నిర్మించారని ఆరోపించారు. ఫాంహౌస్ పక్కనే కేటీఆర్ సతీమణి శైలిమకు 3 ఎకరాలు ఉందన్నారు. శైలిమ తల్లి శశిరేఖ పేరిట 18 గంటల భూమి ఉందని చెప్పారు. ఈ భూములన్నీ ఒకప్పుడు సత్యం రామలింగరాజు శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఉండేవన్నారు ఎంపీ చామల. ఆ కంపెనీ నుంచి ప్రదీప్‌రెడ్డి పేరుపైకి మార్చుకున్నారని తెలిపారు.
జన్వాడ ఫాంహౌస్ భూములపై ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి హైడ్రా కమిషనర్‌తో మాట్లాడారు. నాలా కబ్జాపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్‌కు కాల్ చేయగా.. ఫాంహౌస్‌కు ఎలాంటి పర్మిషన్స్ లేవని చెప్పారు. కేటీఆర్ కబ్జా చేసిన భూములన్నీ కక్కిస్తామన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ప్రదీప్‌రెడ్డి.. కేటీఆర్‌కు ఫాంహౌస్‌ని లీజుకిస్తే.. డాక్యుమెంట్స్ చూపించాలని డిమాండ్ చేశారు.
జన్వాడ ఫాంహౌస్‌లో ఉన్న సర్వే నెంబర్‌లో కేటీఆర్ భార్య, అత్తమ్మ పేరు మీద భూములు ఎందుకు ఉన్నాయని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ క్వశ్చన్ చేశారు. మొత్తంగా.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భూములు, ఆస్తులపై.. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా గ్రౌండ్‌లోకి దిగడంతో.. తెలంగాణలో రాజకీయం రీసౌండ్ వస్తోంది.
Also read: వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు