Vijay Politics: విజయ్.. తాను స్టాలిన్‌కు ప్రత్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. తనకు, డీఎంకేకే పోటీ అని చెప్పారు. అదే సమయంలో బీజేపీతో కలిసేది లేదని తేల్చిచెప్పారు. సోలో పర్‌ఫామెన్స్‌నే నమ్ముకున్నారు. ద్రవిడ మూలాల్నే నమ్ముకున్న డీఎంకేనే తన టార్గెట్ అని. డీఎంకే సంప్రదాయ ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకున్నారు. మరి, విజయ్ తన టార్గెట్‌ను చేరుకోగలరా ? ప్రస్తుతం ఈ సినిమా స్టార్ భవితవ్యం – బ్యాలెట్ బాక్స్‌లో ఉందిప్పుడు.. మరి ఆ రిజల్ట్ ఎలా ఉండబోతోంది? ఆయన ఇకపై కూడా ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంది? డీటైల్డ్ స్టోరీ.. మీకోసం. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు బాగా మారింది. దళపతి విజయ్ తమిళ వెట్రి కళగం ఎంట్రీతో.. ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక టీవీకే పార్టీ సిద్ధాంతాలు ప్రకటించిన తీరు చూస్తుంటే ఆయన వ్యూహాత్మకమైన ద్వంద్వ పోరాట నీతిని ఎంపిక చేసుకున్నట్టు చెప్పాలి.
అయితే ఇక్కడ విజయ్ వెళ్లే ధోరణిని బట్టీ చూస్తే ఆయన మెయిన్ టార్గెట్ ఢీఎంకీని ఢీ కొట్టడం. అయితే డీఎంకే కోటను బద్ధలు కొట్టడం సాధ్యమేనా? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగా ఆయన తొలుత వంశపారంపర్య రాజకీయాలను టచ్ చేశారు. కారణం డీఏంకే బలమంతా కూడా అదే. కరుణ నుంచి స్టాలిన్. స్టాలిన్ నుంచి ఉదయనిధి స్టాలిన్ వరకూ ఈ పరంపర ఎంతో స్ట్రాంగా ఉంది. ఇక కనిమొళి వంటి వారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం మరొక ఎత్తు. ఇందుకు మారన్ సోదరుల మీడియా ఇతరత్రా రాజకీయ మద్ధతు పుష్కలంగా ఉంది. పార్టీలోని ప్రధాన పాత్ర మొత్తం కరుణ కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. వారిలో వారికి ఎన్ని గొడవలున్నా.. కరుణ కుటుంబం అనేది అతి పెద్ద రాజకీయ, సినీ, మీడియా కోట. ఈ కోటను ఢీ కొట్టాలన్నా డీకోడ్ చేయాలన్నా.. ఆ వారసత్వం మీదే దెబ్బ కొట్టాలి. ఇదే విజయ్ తన ఫస్ట్ టార్గెట్ గా ఎంపిక చేసుకున్నారని చెప్పాల్సి ఉంటుంది.
డీఎంకే రాజకీయ వారసత్వం మీద దెబ్బ తీయడానికి తనకున్న క్రేజ్ అనే ఆయుధం వాడుతున్నారు విజయ్. బేసిగ్గా యువతే భవిత కాబట్టి.. ఆ యువతలో తనకు అసాధారణమైన పాపులారిటీ ఉంది కాబట్టి.. దీని ద్వారా డీఎంకేని అధిగమించాలనుకుంటున్నారు విజయ్. ఒకవేళ యువ ఓటర్లలో మార్పు అనివార్యమనే భావన సాలిడ్ గా ఉంటే.. విజయ్ కిది ఇప్పుడు కాకున్నా వచ్చే రోజుల్లో చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా మారనుంది. అలాగని దశాబ్దాల తరబడి ఎంతో పటిష్టమైన కేడర్ గల డీఎంకేని దాని పునాదనులను కేవలం ఇమేజ్ తో కదిలించడం అదేమంత మాములు విషయం కాదంటారు పలువురు పొలిటికల్ ఎనలిస్టులు.
Also Read: కోట్ల ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ నటి.. ఏమన్నారంటే?
ఇక పోతే బీజేపీకి వ్యతిరేఖమనే అంశం. దీని ద్వారా విజయ్ ఏం చెప్పదలుచుకున్నారంటే.. ఎప్పుడూ బలంగా ఉండే ద్రవిడ సెంటిమెంట్ ని నమ్ముకోవడం. తనవైపునకు తిప్పుకోవాలని భావించడం. బీజేపీ బీటీం అనే ముద్ర తనపై పడకుండా జాగ్రత్త వహించడం. బేసిగ్గా తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా కీలక పాత్ర పోషిస్తోన్న పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే. రెండింటి భావజాలం కూడా ఒకటే. అదే ద్రవిడ భావజాలం. ఇక్కడా అక్కడా ఒకేలాంటి ఓటు బ్యాంకు ఉంటుంది. ప్రస్తుతం విజయ్ కూడా వీరికి కొనసాగింపు ద్రవిడ రాజకీయాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి విజయ్ పొలిటికల్ పాలసీలకు అన్నాడీఎంకే లోని అసంతృప్తులు సైతం ఆకర్షితులయ్యే అవకాశముంది.
తమిళనాడు రాజకీయాల్లో రాణించడం అంటే మరో సవాల్ కూడా ఎదురవుతుంది. ఇక్కడ ఒంటెత్తు పోకడలకు ఆస్కారం లేదు. ఒంటరి పోరాటాలకు కూడా ఏమంత తావు లేదు. దీంతో సోలో పాలిటిక్స్ దాదాపు అసాధ్యంగానే ఉంటాయి. ఎంజీఆర్, జయ, కరుణ వంటి దిగ్గజాలకే అది సాధ్యం. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనువుగా లేవు. విజయ్ ఒంటరి పోరు ఆయన ఆత్మవిశ్వాసాన్ని సూచించేదే.. అయినా.. గ్రౌండ్ లెవల్లో ఏజెంట్లు, బలమైన నాయకత్వ పరంపర లేక పోతే ఓట్లు సీట్లుగా మారే ఛాన్స్ లేదు. 18-35 ఏళ్ల మధ్య గల ఓటర్లు విజయ్ కి అతి పెద్ద బలం. కాగా మహిళా ఓటర్లు కూడా ఆయన వైపు నిలిచే ఆస్కారముంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన మహిళలపై హామీల వర్షం కురిపించారు. అవి ఎంత వరకూ సత్ఫలితాలను ఇస్తాయన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.
ఇక పోతే విజయ్ టార్గెట్ ని రీచ్ అవుతారా? లేదా అన్నది ఆయన చెప్పే మాటల కంటే కూడా చేతలను బట్టీ ఉంటుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం- వేరు. బ్యాలెట్ బాక్సులను ఓట్లతో నింపడం వేరు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఆ టార్గెట్ రీచ్ అవుతారా? లేదా అన్నది కూడా.. త్వరలోనే తేలనుంది. ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టీ విజయ్ పార్టీ మూడో ప్రత్యామ్నయ శక్తిగా ఎదగడమా? లేదా అన్నది కూడా త్వరలోనే తెలిసిపోతుంది.
Also Read: గులాబీ పార్టీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కన్నేసిన కవిత..!
అయితే ఇక్కడ విజయ్ కి శుభశకునాలు ఏమంత అనుకూలంగా లేవు. అదెలా చెప్పగలం అంటే విజయ్ బేసిగ్గా సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారు. ఎంజీఆర్, జయ, కరుణ వంటి వారిని పక్కన పెడితే వారి తర్వాత తమిళ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ కాంత్ నుంచి మొదలు పెడితే కమల్ వరకూ ఇదో పెద్ద సినీ రాజకీయ పరంపర. ఇక్కడ ప్రతి పాపులర్ సినిమా నటుడికీ ఒక పార్టీ ఉంటుంది. ఒక స్థాయిలో పాపులారిటీ సాధించిన వారు.. తర్వాత వెంటనే చేసే పని.. రాజకీయ పార్టీ పెట్టడం లేదా ఏదో ఒక పార్టీ నుంచి చట్ట సభలకు వెళ్లడం. ఇదీ ఇక్కడి సినీ పొలిటికల్ పరంపర.
ఇక విజయ్ జెండా, అజెండా ఎలాంటిదో చూస్తే ఆయన తన రాజకీయ సిద్ధాంతం.. లౌకిక సామాజిక న్యాయం అని అంటున్నారు. ఇక ఆయన ఎరుపు, పసుపు రంగులను తన జెండా రంగుగా ఎంపిక చేశారు. ఆపై రెండు ఏనుగులు, మధ్యలో వాగై పువ్వు గుర్తు ఉంటుంది. ఇది ప్రాచీన తమిళ సంప్రదాయానికి, విజయాలకు చిహ్నం. ఏనుగు అన్నది బీఎస్పీ ద్వారా ఒక దళిత శక్తిగా ఇది వరకే నిరూపితమైంది. వాగై పుష్పం మహిళలకు ప్రతీకగా భావించారు. ఇలా యువత, దళిత, వనిత ఆయన ప్రధానంగా ఎంపిక చేసుకున్న ఓటు బ్యాంకు. నిజానికి ఇవి చాలు.. రాజకీయంగా రాణించడానికి. అందుకే ఆయన మహిళలకు అన్నేసి వరాల వర్షం కురిపించారు. ఇక నిరుద్యోగుల భృతితో పాటు, విద్యా రుణాల రద్దు, అవినీతి రహిత పాలన అంటూ జనాల్లోకి వెళ్లారు.
తన రాజకీయ విధి విధానాలు ఇంత పటిష్టంగా ఉన్నా.. ఆయన్నుగానీ, ఇతర అభిమానులను గానీ పట్టి పీడిస్తోన్నది.. ఏంటంటే ఒక సినిమా వ్యక్తికి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో రాజకీయంగా అంత పట్టు సాధించడం సాధ్యమేనా? అని. నిజానికి ప్రస్తుతం ఎంతో ద్రవిడ పరిజ్ఞానం ఉన్న కమల్ హాసన్ కే ద్రవిడ రాజధాని తమిళనాడులో పట్టు సాధ్యం కాలేదు. ఇక విజయ్ కాంత్ ని చూస్తే ఆయన ఏకంగా ద్రవిడ శబ్ధంతో కూడిన పార్టీని పెట్టినా రాణించలేక పోయారు. కరుణానిధి, ఎంజీఆర్ లాంటి వారు.. కేవలం సినిమా పరిజ్ఞానంతో మాత్రమే రాజకీయాల్లో రాణించలేదు. వారికంటూ ఉన్న ద్రవిడ ఉద్యమ భావజాలమే వారిని రాజకీయంగా నిలబెట్టింది. ఇక జయలలిత ఎంజీఆర్ వారసురాలిగా పార్టీని తన గుప్పెట్లో తీసుకోవడంలో ఆమె చూపించిన ధైర్యసాహసాలు ఆమెను రాజకీయాల్లో నిలబెట్టాయి. అమ్మ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కరుణ, జయ పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న పటిష్టమైన పార్టీ యంత్రాంగమే.. ఒక ఆయువు పట్టుగా మారి.. అసాధారణ రాజకీయ దురంధురులు కాగలిగారా ఇద్దరూ.
Also Read: మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!
వారి తర్వాతి సినీ రాజకీయ తరంగా వచ్చిన విజయ్ కాంత్, కమల్ హాసన్.. ఎందుకు వెనకబడ్డారంటే.. వీరిద్దరిలో విజయ్ కాంత్ కాస్త ఎక్కువ రాణించగలిగారు. ఆయన పదిశాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకోగలిగారు. కానీ, ఆరోగ్య సమస్యలు, సరైన రాజకీయ వ్యూహకర్తలు లేక పోవడం పెద్ద మైనస్ గా మారింది. ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో ఘోరమైన వైఫల్యం చెందడం కూడా.. డీఎండీకే బలహీనపడుతూ వచ్చింది. ఇక పోతే కమల్ హాసన్.. ఆయన రాజకీయాలు కేవలం పట్టణ ప్రాంత వాసులకు, చదువుకున్న వర్గాల వారికి మాత్రమే పరిమితమయ్యాయి. ఇక గ్రామీణ ఓటర్లు, కులసమీకరణాలు కూడా కమల్ పార్టీని బాగా దూరం పెట్టాయి. ఒక్కమాటలో చెప్పాలంటే క్లాస్ పాలిటిక్స్ ట్రై చేశారు కమల్. అలాగని అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. వీటిని బట్టీ విజయ్ పార్టీ భవిష్యత్తును అంచనా వేయడం కూడా సరికాదంటారు రాజకీయ విశ్లేషకులు.
ఇదంతా ఇలా ఉంచితే.. విజయ్ కి కావల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు ఎలాంటివి? ఆయన రాణించే అవకాశాలు ఎంతెంత? అని చూస్తే.. ప్రస్తుతానికి విజయ్ మధ్యే మార్గం అనుసరిస్తున్నారు. ఈ మార్గంలో రాణించాలంటే.. బూత్ లెవల్లో పట్టు అత్యవసరం. ఇక సినిమా ఫ్యాన్ క్లబ్బులను రాజకీయ కేడర్ గా మార్చడం.. అతి పెద్ద సవాల్ గా నిలుస్తోంది. అభిమాని ఓటు వరకూ వేస్తాడు. కానీ కార్యకర్త పది మంది చేత ఓటు వేయించగలడు. అంటే అభిమానుల బలం మాత్రమే ఉంటే సరిపోదు.. విజయ్ రాజకీయ విధానాలను అకళింపు చేసుకున్న కరడుగట్టిన కార్యకర్తలు అత్యవసరం. తమిళనాడులో ఈ ఓటు బ్యాంకు డెబ్భై శాతం ద్రవిడ భావజాలంతో ముడిపడి ఉంటుంది. పెరియార్, అన్నాదురై వంటి నేతల వారసత్వాన్ని విజయ్ లోనూ చూడగలిగితేనే ఆయనకు రాజకీయ అవకాశాలు పుష్కలంగా అందివస్తాయి. అలాగే జయ మరణం తర్వాత ఎటు వైపు మొగ్గాలో తెలీక డైలమాలో ఉన్నారు మహిళా ఓటర్లు. తమ కోసమంటూ ఒక నాయకత్వం కోసం వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తన కుటుంబంలో ఎన్నేసి సమస్యలున్నా.. విజయ్ ఇంటింటి నాయకుడు కాగలిగితే.. మహిళా ఓటు బ్యాంకును విశేషంగా ఆకర్షించగలుగుతారు. ఏకంగా గేమ్ ఛేంజర్ కాగలుగుతారని అంటారు తమిళ రాజకీయ పండితులు.
ఆ తర్వాత ఓర్పు- నేర్పు ఎంతో అవసరం. బలం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు బలహీనత మీద కూడా తగిన అవగాహన కలిగి ఉండాలి. ఒక సారి దెబ్బ తిన్నా.. ఇంకోసారికి మరింత ఎక్కువ శక్తియుక్తులతో రాజకీయ ఎవనికపైకి తిరిగి దూసుకురావల్సి ఉంటుంది. ఇరవై నాలుగు గంటలు వన్ మేన్ షో చేయడం ఒక్కోసారి సాధ్యం కాక పోవచ్చు.. అది ఆ కాలం. ఈ కాలం బాగా మారింది కాబట్టి అందుకు అనుగుణంగా తన రాజకీయ గమ్యాన్ని మార్చుకుంటూ, భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ వెళ్లాల్సి ఉందంటారు పలువురు విశ్లేషకులు.
Also Read: నా ఓటు ఎవరో వేశారు..ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నటి!