E-Paper
Advertisement

బలిదానాల కోసం కాదు తెలంగాణ సాధించుకున్నది.. ఆర్టీసీ కార్మికులకు విజయశాంతి పిలుపు

బలిదానాల కోసం కాదు తెలంగాణ సాధించుకున్నది.. ఆర్టీసీ కార్మికులకు విజయశాంతి పిలుపు
Advertisement

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (రాములమ్మ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. గురువారం తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ కార్మిక లోకానికి పలు విజ్ఞప్తులు చేశారు.

తెలంగాణ అమరవీరులు తమ పోరాటాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నది తిరిగి సమస్యల కోసం ఆత్మబలిదానాలు చేయడానికి కాదని విజయశాంతి గుర్తుచేశారు. కార్మిక సోదరులు ప్రాణాలు తీసుకోవడం వల్ల వారి కుటుంబాలతో పాటు మొత్తం తెలంగాణ సమాజం తీవ్ర కలత చెందుతుందని ఆవేదన చెందారు. ఆత్మాహుతికి ప్రయత్నించిన నర్సంపేట కార్మికుడు శంకర్ గౌడ్ త్వరగా కోలుకోవాలని ఆమె భగవంతుడిని ప్రార్థించారు.

Advertisement

తెలంగాణ బిడ్డలైన కార్మికులు ఎవరూ కూడా అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజయశాంతి చేతులెత్తి మొక్కుతూ విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం దేనికీ పరిష్కారం కాదని ఆమె స్పష్టం చేశారు. అధైర్యపడి కుటుంబాలను రోడ్డున పడేయవద్దని కోరారు. ఒక కార్మికుడికి నష్టం జరిగితే అది ఆ కుటుంబానికే కాక యావత్ రాష్ట్రానికే తీరని లోటని అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీ సమస్యను పరిష్కరించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందని విజయశాంతి నొక్కి చెప్పారు. పరిస్థితులు చేయి దాటకముందే ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మొండి వైఖరి వీడి కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చాలని కోరారు. కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పాలకులకు గుర్తుచేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని ఆమె హితవు పలికారు.

Advertisement

ALSO READ: ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×