ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది అభిమానులకు, శిష్యులకు ఆ వ్యక్తి ఓషో మాత్రమే. యువతను అత్యంత పవర్ ఫుల్‌గా ఆకర్షించే ప్రసంగాలకు ప్రసిద్ధి. అయితే, దీనికి ముందు ఆ వ్యక్తి ఆచార్య రజనీష్‌గా.. భగవాన్ శ్రీ రజనీష్‌గా.. ఇండియాలోనూ, ప్రపంచమంత పాపులర్ అయ్యాడు. అయితే, ఓషో వేసుకున్న ఈ ముసుగులను తాజాగా సరగమ్ అనే సన్యాసిని బయటపెట్టారు. ప్రేమ్ సర్గమ్‌గా మారిన ఆమె “ఓషో కల్ట్”లో బాధాకరమైన తన బాల్యాన్ని గురించి చెప్పారు. ఆమెకు ఆరేళ్ల వయస్సు నుండే ఓషో ఆశ్రమంలో ‘ఫ్రీ లవ్’ ముసుగులో ఎన్ని లైంగిక వేధింపులను ఎదుర్కొందో తెలిపారు. ఓషో బోధల్లో బయటకు కనిపించని ఈ నిజం ఇప్పుడే బయటపడింది. చిన్నారులపై లైంగిక హింస ఎంత దారుణమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, ఓషో ఉద్దేశంలో “పిల్లలు లైంగికతకు గురికావడం మంచిదని” భావించేవాడంట! ఇంకా, అక్కడ ఎంత దుర్మార్గమైన వాతావరణం ఉండేదో 54 ఏళ్ల ప్రేమ్ సర్గమ్ తెలిపారు. తన చిన్ననాటి విషాద జ్ఞాపకాలను ప్రముఖ ‘ఓషో కల్ట్’లో గుర్తుచేసుకున్నారు.
ఇది ఒక పీడకల అంటూ మొదలైన ఆమె వ్యాఖ్యానం.. ఓషో ఎంత చెడ్డవాడో వెలుగులోకి తెచ్చింది. ఆరేళ్ల వయస్సులో ఆమెను లైంగిక హింసకు గురిచేసినట్లు పేర్కొననారు. ది టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, యూకేకు చెందిన సర్గమ్ తాను ఎలాంటి దారుణమైన పరిస్థితితో పెరిగారో వెల్లడించారు. భారతీయ ఆధ్యాత్మిక వేత్తగా పేరుపొందిన భగవాన్ శ్రీ రజనీష్, అకా.. ఓషో నిర్వహించే ఆశ్రమంలో.. “దుర్మార్గమైన సన్యాసిని సెక్స్ కల్ట్”లో పెరిగినట్లు తెలిపారు. ఆమె చిన్న వయస్సులోనే ఎలా బలవంతంగా లైంగిక వేధింపులకు గురి చేయబడిందో వివరించారు. “స్వేచ్ఛ ప్రేమ” పేరుతో నడిపే ఓషో ఆశ్రమాల్లో ఎంతగా లైంగిక వేధింపులను భరించిందో చెప్పారు. ఆరేళ్ల వయస్సు నుండి ఆమె మూడు సన్యాసిన్ కమ్యూనిటీలు పెరిగారు. ఓషో మాటలకు ఆకర్షితులైన ఆమె తల్లిదండ్రులు సర్గమ్‌ను కూడా అక్కడికే తీసుకెళ్లారు. బ్రిటీష్ ఫ్యామిలీ నుండి అక్కడకు వెళ్లిన ఆమెకు ఓషో ప్రేమ్ సర్గమ్‌గా పేరు పెట్టాడు.
Also Read: సద్గురు పై కామరాజ్ ఆరోపణలు ఎంతవరకు నిజం ?
అయితే, ఆ ప్రేమ వెనుక రాక్షసత్వం, పాశవిక ఆనందం, పైశాచికత్వం ఉంటుందని ఆమెకు తెలియదు. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల ద్వారా ఆమెకు పరిచయం అయిన రజనీష్ చేసిన అకృత్యాలకు అప్పటి నుండి సజీవ సాక్ష్యంగా ఉన్నారు. పిల్లలు క్రమం తప్పకుండా సెక్స్ చూడాలనే ఫిలాసఫీ, బాలికలు మెచ్యూర్డ్ వయస్సుకు వచ్చినప్పుడు పెద్దవయసున్న పురుషులు లైంగిక విషయాలపై మార్గనిర్దేశం చేయాలనే తత్వాన్ని అక్కడ బోధించే వారని ఆమె వివరించారు. ఇక, ఆమెకు 7 నుండి 11 సంవత్సరాల మధ్య.. ఆమెతో పాటు, ఇతర చిన్నపిల్లలు కూడా కమ్యూన్‌లో నివసిస్తున్న పెద్దవారి నుండి లైంగిక హింసకు గురయ్యేవారని తెలిపారు. అప్పుడు కూడా ఏదో తప్పు జరుగుతోందని ఆ చిన్నారులకు తెలిసినా, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే, తన తల్లిదండ్రులు ఓషోకు స్వాధీనం అయిపోయారు. సర్గమ్‌ను హాస్టల్‌కి పంపించి తాము మాత్రం, అమెరికాకి మకాం మార్చిన ఓషో ఆశ్రమానికి వెళ్లారు. ఇక, 12 ఏళ్ల వయసులో తిరిగి ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లన సర్గమ్, అక్కడ 50 సార్లు అత్యాచారానికి గురయ్యారైనట్లు తెలిపారు.
‘రజనీష్ కల్ట్’ అనేది తర్వాత కాలంలో ‘ఓషో కల్ట్’గా పాపులర్ అయ్యింది. దీన్ని 1970లలో స్థాపించారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునే పాశ్చాత్య ఫాలోవర్లను ఎక్కువగా ఆకర్షించింది. అయితే, ఇందులో ఆధ్యాత్మికత కంటే పిల్లలపై లైంగిక దోపిడీ, లైంగిక వేధింపుల చీకటి జీవితం ఉంది. ఎందుకంటే, అది ఓషో ఆశ్రమం. 14 సంవత్సరాల వయస్సు నుండి భాగస్వామి మార్పిడితో అనియంత్రిత వ్యభిచారం మంచిదని వాదించిన వ్యక్తి ఓషో. అతడి విచిత్రమైన ధ్యాన పద్ధతులు, లైంగిక స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ఓషోని భారతదేశంలో “సెక్స్ గురువుగా” పాపులర్ చేశాయి. అందుకే, ఓషో చాలా సీక్రెట్ కార్యక్రమాలకు భారతీయులను అనుమతించేవాడు కాదు. సెక్స్ థెరపీలో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతించేవారు. అదేమంటే, భారతీయులకు ధ్యానమే వైద్యమనీ.. విదేశీ జీవన వ్యవహార శైలిని బట్టి, వారికి ”స్వేచ్ఛా శృంగారం” అవసరమని చెప్పేవాడు.