BigTV English

Israel-Iran War: తాడో-పేడో తేలాల్సిందే..! కొడితే దిమ్మ తిరగాల్సిందే.. బయటికొస్తున్న బ్రహ్మాస్త్రాలు

Israel-Iran War: తాడో-పేడో తేలాల్సిందే..! కొడితే దిమ్మ తిరగాల్సిందే.. బయటికొస్తున్న బ్రహ్మాస్త్రాలు

Israel-Iran War: ఇరాన్, ఇజ్రాయెల్ భీకరంగా తలపడుతున్నాయి. వార్ వన్ సైడ్ అనడానికి వీల్లేకుండా పోయింది. ఈ రెండిట్లో ఏ దేశాన్నీ తక్కువ అంచనా వేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒకరిని మించి మరొకరు అస్త్రాలను బయటకు తీస్తున్నారు. ఇన్నాళ్లూ బయటి ప్రపంచానికి తెలియని బాంబులను తెరపైకి తెస్తున్నారు. ప్రయోగిస్తున్నారు. కాబట్టి వార్ మరో రేంజ్‌కు వెళ్లినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఇరాన్, ఇజ్రాయెల్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలేంటి? వాటి కెపాసిటీ ఎంత? ఎవరిది పైచేయి అవుతుంది?


అటు బస్టర్ బాంబ్..
ఇటు క్లస్టర్ బాంబ్..
కొడితే దిమ్మ తిరగాల్సిందే..
బయటికొస్తున్న బ్రహ్మాస్త్రాలు..
ఇరాన్-ఇజ్రాయెల్ తాడో పేడో..

ఒకరిది హైపవర్ మిసైల్, మరొకరిది హైపర్ సోనిక్ మిసైల్. ఎవరూ తగ్గట్లే. అవును ఇన్నాళ్లూ ఎవరికి తెలియని బాంబులు తెరపైకి వస్తున్నాయ్. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ లో పవర్ ఫుల్ బాంబులు అలజడి సృష్టిస్తున్నాయ్. అసలు అలాంటి వెపన్స్, మిసైల్స్ ఉన్నాయా అని అంతా ఆశ్చర్యపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఎందుకంటే రెండువైపులా కొత్త కొత్త బాంబు ప్రయోగాలు జరుగుతున్నాయి. విధ్వంసం మరో రేంజ్‌లో ఉంటోంది. ఏంటి ఆ పవర్ ఫుల్ బాంబులు? వాటి ఎఫెక్ట్ ఎంత?


ముందుగా ఇజ్రాయెల్ వాడుతున్న పవర్ ఫుల్ వెపన్స్, మిసైల్స్ ఏంటో చూద్దాం. ప్రతి దేశం దగ్గర బ్రహ్మస్త్రాలు ఉంటాయి. ఇజ్రాయెల్ కూడా అలాంటివి చాలానే దాచిపెట్టుకుంది. వీటికి తోడు అమెరికా సపోర్ట్ ఉండడంతో చాలా వెపన్స్ వస్తాయనుకుంటోంది.

GBU-57A/B బంకర్ బస్టర్ బాంబ్..

ఇది చాలా పవర్ ఫుల్. 13,600 కిలోల బరువు ఉంటుంది. భూమి లోపలికి 60 మీటర్ల లోతు కాంక్రీట్‌లోకి కూడా చొచ్చుకుపోయే కెపాసిటీ ఉంటుంది. ఇరాన్‌లోని భూగర్భ అణు కేంద్రాలను టార్గెట్ చేసేందుకు అమెరికా నుంచి హామీ తీసుకుంది. ఇది నాన్ న్యూక్లియర్ అయినప్పటికీ అత్యంత విధ్వంసకర పవర్ ఉంటుంది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ప్రయోగించాలంటే అమెరికా హెల్ప్ అవసరం.

బాలిస్టిక్ మిస్సైల్స్ – జెరిఖో సిరీస్

జెరిఖో-3 మిస్సైల్ 1,000 నుంచి 1,300 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్తుంది. దీనికి 4,800 నుంచి 6,500 కిలోమీటర్ల దాకా వెళ్లే రేంజ్ ఉంది. ఇది ఇజ్రాయెల్ స్వదేశీ బాలిస్టిక్ మిస్సైల్. లాంగ్ రేంజ్ కెపాసిటీ దీని సొంతం. న్యూక్లియర్ తో పాటే సాంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే కెపాసిటీ ఉంది. టెహ్రాన్ వంటి లాంగ్ రేంజ్‌ను కచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. ఇరాన్‌లోని టెహ్రాన్, నటాంజ్, ఫోర్డో వంటి న్యూక్లియర్ సైట్స్ ను డ్యామేజ్ చేస్తుంది. వీటి ద్వారానే నటాంజ్, ఫోర్డో అణు కేంద్రాల దగ్గర ఎటాక్ చేసింది ఇజ్రాయెల్.

జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యూనిషన్ – JDAM

ఇది 500-2,000 పౌండ్లు బరువు ఉంటుంది. టార్గెట్‌ను కచ్చితంగా ఛేదించే కెపాసిటీ ఉంది. లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకే సామర్థ్యం. ఇవి GPS గైడెడ్ బాంబులు. కీలక సైనిక స్థావరాలు, డ్రోన్ ఫ్యాక్టరీలను ధ్వంసం చేయడానికి ఉపయోగపడతాయి. వీటిని వాడుతోంది ఇజ్రాయెల్.

అణ్వాయుధాలు

ఇజ్రాయెల్ తన అధునాతన సైనిక సాంకేతికత, అమెరికా సహాయంతో.. అత్యంత శక్తివంతమైన వెపన్స్‌ను రెడీ చేసి పెట్టుకుంది. ఇవే ఇజ్రాయెల్‌ను మిడిల్ ఈస్ట్‌లో పవర్ ఫుల్ కంట్రీగా నిలబెట్టాయి. ఇజ్రాయెల్ దగ్గర 90 నుంచి 140 దాకా న్యూక్లియర్ వార్‌హెడ్‌లను కలిగి ఉన్నట్లు అంచనా ఉంది. ఈ వార్‌హెడ్‌లు జెరిఖో బాలిస్టిక్ మిసైల్స్ ద్వారా లేదంటే F-15, F-16, F-35 యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించే వీలుంది. అయితే ఇది లాస్ట్ ఆప్షన్.

UAVs

ఇజ్రాయెల్ అమ్ములపొదిలో డ్రోన్లు, మానవ రహిత యుద్ధ విమానాలు చాలానే ఉన్నాయి. ఇందులో హెర్మేస్-900 కీలకం. దీని రేంజ్ కిలోమీటర్లుగా ఉంది. ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్లు ఉంటాయి. వీటిని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ సీక్రెట్ గా ఇరాన్‌కు తరలించి.. అక్కడి లక్ష్యాలను టార్గెట్ చేయించింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ స్టార్ట్ అయిన రోజున వీటిని రిమోట్ ఆధారంగా ఇజ్రాయెల్ ఆపరేట్ చేసి ఇరాన్ రక్షణ వ్యవస్థలకు భారీ నష్టం చేసింది. ఈ UAVలను భారత్, ఇజ్రాయెల్ కంపెనీలు జాయింట్‌గా తయారు చేస్తున్నాయి.

ఇజ్రాయెల్ దగ్గర తగ్గుతున్న ఆయుధసంపత్తి

సో అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇరాన్‌పై యుద్ధంలో తమపై పైచేయి అవుతోందని, ఇరాన్‌ గగనతలంపై పూర్తి డామినేషన్ సాధించామని ఇజ్రాయెల్‌ పదేపదే చెప్పుకుంటోంది. కానీ యుద్ధాన్ని కంటిన్యూ చేయాలంటే ఆయుధ సంపత్తి రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ఇరాన్‌ క్షిపణులను నేలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్‌ రేంజ్‌ మిస్సైల్‌ ఇంటర్‌సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది. ఇప్పుడున్న సిస్టమ్స్‌ మరో 10 నుంచి 12 రోజు ల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితేనే ఇజ్రాయెల్‌కు రిలీఫ్ అంటున్నారు. ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్‌ ఒప్పుకుంది.

ఇరాన్ దగ్గరున్న బ్రహ్మస్త్రాలేంటి?

ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ ఇస్తున్నా.. అటు ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా అమెరికాకే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరాన్ దగ్గర కూడా ఆయుధ సంపత్తి భారీగానే ఉంది. వీటికి తోడు చైనా కూడా సీక్రెట్ గా సహాయం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇరాన్‌కు సొంతంగానే కెపాసిటీ చాలా ఉంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌ను కూడా డ్యామేజ్ చేసింది. ప్రత్యర్థికి కంటిమీద కునుకు లేకుండా మిసైల్స్ వర్షం కురిపిస్తోంది. మరి ఇరాన్ దగ్గరున్న బ్రహ్మస్త్రాలేంటి?

ఇరాన్ దగ్గర దేశీయంగా తయారైన వెపన్స్ ఎన్నో

యుద్ధంలో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యర్థి బలహీనతలను చూసి తక్కువగా చూడొద్దు. బలం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అదే జరుగుతోంది. ఇజ్రాయెల్ ఒకటి అనుకుంటే ఇరాన్ మరొకటి చేసి చూపెడుతోంది. ఇరాన్ రచించిన మాస్టర్ ప్లాన్ ఇజ్రాయెల్‌ను ఎలా దెబ్బకొట్టింది?

ఇరాన్ దగ్గరున్న కీలక హైపర్ సోనిక్ మిసైల్ ఇది

దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి చేసుకోకపోతే ఏ దేశానికైనా కష్టమే. యుద్ధం వస్తే చాలా రోజుల దాకా పోరాడే కెపాసిటీ ఉండదు. మధ్యలోనే చేతులెత్తేయాలి. లేదంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఇతర దేశాల నుంచి కొనుక్కోవాలి. సో ఇరాన్ దేశీయంగా చాలానే వెపన్స్, మిసైల్స్ ప్రొడ్యూస్ చేసి పెట్టుకుంది. ఈ కారణంగా మిడిల్ ఈస్ట్‌లో అతిపెద్ద బాలిస్టిక్ మిసైల్ స్టాక్‌పైల్‌ ఇరాన్ సొంతం. ఇరాన్ దగ్గరున్న కీలకమైన ఆయుధాలేంటో చూద్దాం.

ఫతాహ్-1 & ఫతాహ్-2 హైపర్‌సోనిక్ మిసైల్స్

ఇవి ఇరాన్ దగ్గరున్న కీలక మిసైల్ సిరీస్. ఫతాహ్ ప్రయోగించిందంటే ప్రత్యర్థికి మూడినట్లే అని అర్థం. ఈ హైపర్ సోనిక్ మిసైల్స్ రేంజ్ 1,400 కిలోమీటర్ల నుంచి 1,500 కిలోమీటర్ల దాకా ఉంది. 400 కిలోల పేలోడ్ మోసుకెళ్తుంది. హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ ఎక్కడైనా ఆపరేట్ అవుతాయి. ఫతాహ్-2 హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ HGV అయితే ఫుల్ టెక్నాలజీ లోడెడ్ గా ఉంది. తక్కువ ఎత్తులో ఎగురుతూ రాడార్‌ల నుంచి తప్పించుకుంటుంది. దీంతో ఇజ్రాయెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు ఎఫెక్ట్. ఫతాహ్ 1 ను ఆల్రెడీ ఇరాన్ ప్రయోగించి చాలా డ్యామేజ్ చేసింది కూడా.

ఖాసెం బసీర్ బాలిస్టిక్ మిసైల్

దీని రేంజ్ 1,200 కిలోమీటర్లు ఉంది. సాలిడ్ ఫ్యూయల్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఇది. ఎలక్ట్రో ఆప్టికల్ సీకర్స్‌తో రాడార్ జామింగ్‌ నుంచి తప్పించుకుంటుంది.

ఖైబర్‌ షేకన్

దీని సామర్థ్యం 1,450 కిలోమీటర్ల రేంజ్ ఉంది. 500 కిలోల పేలోడ్ మోసుకెళ్తుంది. మాన్యువరబుల్ రీ-ఎంట్రీ వెహికల్ ఇది. థర్డ్ జెనరేషన్ సాలిడ్-ఫ్యూయల్ బాలిస్టిక్ మిసైల్ ఇది. IRGC ఏరోస్పేస్ డివిజన్ ద్వారా దేశీయంగా ఇరాన్ డెవలప్ చేసుకుంది.

షహీద్ డ్రోన్స్

ఈ డ్రోన్స్ కెపాసిటీ 1,200-1,550 కిలోమీటర్ల రేంజ్ ఉంది. 50 నుంచి 450 కిలోల పేలోడ్ తీసుకెళ్తుంది. తక్కువ ఎత్తులో ఎగురుతూ రాడార్‌ల నుంచి తప్పించుకుంటుంది.

ఎతెమాద్

దీని రేంజ్ 1,700 కిలోమీటర్లు. 16 మీటర్ల పొడవైన లిక్విడ్ ఫ్యూయల్ మిసైల్ ఇది. ప్రెసిషన్ గైడెడ్ వార్‌హెడ్‌తో ఉంటుంది. ఇజ్రాయెల్ లక్ష్యాలను అధిక కచ్చితత్వంతో డ్యామేజ్ చేస్తుంది.

క్లస్టర్ బాంబులు

ఇవి ఒక ప్రత్యేక రకం ఆయుధాలు. క్లస్టర్ బాంబు ఒక పెద్ద కంటైనర్‌లా ఉంటుంది. ఇందులో డజన్ల నుంచి వందల సంఖ్యలో చిన్న చిన్న పేలుడు పదార్థాలు ఉంటాయి. ఈ క్షిపణి వార్‌హెడ్‌ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండు సామగ్రిగా విడిపోయి నష్టం చేస్తాయి. ఫుట్‌బాల్ గ్రౌండ్ అంతగా వ్యాపిస్తాయి. సాంప్రదాయ బాంబులతో పోలిస్తే, ఇవి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి. దీంతో నష్టం ఎక్కువగా ఉంటుంది. సైనికులు, జనంపై ప్రయోగించేందుకు వీలుగా ఉన్నాయి. కొన్ని క్లస్టర్ బాంబులు గైడెడ్ సబ్‌మ్యూనిషన్లతో కచ్చితమైన లక్ష్యాలను చేరేలా ఉంటాయి. వీటిని బాలిస్టిక్ మిసైల్స్, అలాగే డ్రోన్ల ద్వారా ప్రయోగించవచ్చు. ఈ క్లస్టర్ బాంబుల స్పెషాలిటీ ఏంటంటే.. కొన్ని పేలకుండా ఉండిపోతాయి. చాలా రోజుల తర్వాత పేలుతాయి. దీంతో సామాన్య జనం ప్రాణాలు పోతాయి. ఇవి చాలా డేంజర్ కాబట్టే.. 2008లో 111 దేశాలతో సహా 12 ఇతర సంస్థలు క్లస్టర్‌ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ, వాడకంపై అంతర్జాతీయంగా నిషేధించినట్లు తెలిపే పేపర్లపై సంతకం చేశాయి. అయితే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మాత్రం అందులో చేరేందుకు నిరాకరించాయి.

అణ్వస్త్రాలు

అణ్వస్త్రాలు లేవని ఇరాన్ అధికారికంగా చెబుతోంది. కానీ 60 శాతం యురేనియం శుద్ధి చేసి 9 అణు బాంబులను తయారు చేయగల కెపాసిటీకి ఇరాన్ చాలా దగ్గరైందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ IAEA రిపోర్ట్ ఇచ్చింది. అందుకే ఇరాన్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ఇజ్రాయెల్‌కు అప్పుడే తెలిసి వచ్చింది. అందుకే నటాంజ్, ఫోర్డో అణు స్థావరాలను ఇజ్రాయెల్ మొదటగా టార్గెట్ చేసుకుంది. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చింది. ఎందుకంటే ఇరాన్ అణ్వస్త్ర ప్రయోగాలు ముందుకెళ్లకుండా చేయడమే దీని లక్ష్యం.

అయితే ఇరాన్ సైన్యం జవాదాబాద్‌లో అత్యాధునిక ఎఫ్‌ – 35 ఫైటర్ జెట్‌ను ఇరాన్‌ సేనలు పేల్చేశాయి. దాదాపు 140 కోట్ల విలువైన హెర్మెస్‌ డ్రోన్‌నూ నేలకూల్చాయి. ఇజ్రాయెల్‌పై దాదాపు 400 బాలిస్టిక్‌ మిస్సైల్స్ ప్రయోగించింది. వీటిలో చాలావరకు మిస్సైళ్లను ఇజ్రాయెల్‌ సైన్యం మధ్యలోనే కూల్చివేసింది. ఇజ్రాయెల్‌ భూభాగాన్ని చేరే కెపాసిటీ ఉన్న క్షిపణులు ఇరాన్‌ వద్ద ఇంకా 1,600 దాకా ఉన్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్‌పై ప్రయోగించే ఛాన్స్ ఉంది. అయితే వాటన్నింటినీ కూల్చే ఇంటర్‌సెప్టార్లు ఇజ్రాయెల్‌ దగ్గర లేవు. మరోవైపు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మాజిద్‌ ఖాదేమిని నియమించుకుంది. ఇటీవలే ఈ irgc చీఫ్… ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యాడు. దీంతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇజ్రాయెల్ ఊహించనంతగా నష్టం చేస్తోంది ఇరాన్.

Related News

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

×