Actress Sudha..సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లుగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్ చేసిన వాళ్లు కూడా ఫేమస్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటీమణి సుధ (Sudha) కూడా ఒకరు.. ఎన్నో సినిమాల్లో తల్లి, వదిన,అక్క, పిన్ని ఇలా ఎంతోమంది హీరో, హీరోయిన్లతో నటించి టాలీవుడ్ లో ఫేమస్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది సుధ. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ (Uday Kiran) విషయం ద్వారా సుధ మరింత ఫేమస్ అయింది. ఉదయ్ కిరణ్ చేసిన చాలా సినిమాల్లో సుధ నటించి తన కొడుకు లాగే భావించినట్టు, అలాగే ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకోవాలనుకున్నట్టు తెలిపింది. అంతేకాదు ఉదయ్ కిరణ్ చనిపోయిన సమయంలో చాలా ఎమోషనల్ అయ్యింది.
విజయ్ ఆంటోనీ కూతురు మరణం – సుధ ఎమోషనల్..
అయితే అలాంటి సీనియర్ నటి సుధ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాపై తన అక్కసు వెళ్ళగక్కింది. ముఖ్యంగా విజయ్ ఆంటోనీ (Vijay Antony) కూతురు మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. మరి ఇంతకీ విజయ్ ఆంటోనీ కూతురు మరణంపై సుధ ఏం మాట్లాడింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అడుక్కుతింటున్న సుధా అంటూ వార్తలు.. గట్టి కౌంటర్
సీనియర్ నటి సుధ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియా అనేది కొంతమందికి యూస్ అవుతుంటే.. మరి కొంత మంది దాన్ని మిస్ యూస్ చేస్తున్నారు.ఎవరో ఒకరు నా గురించి ఫేస్ బుక్ లో సుధ దారుణమైన పరిస్థితిలో అడుక్కుతింటుందని రాశారు. కానీ నా ఫోటో పెట్టి నా గురించి రాసి నువ్వు అడుక్కుతింటున్నావు.నేను అడుక్కు తింటే ఏంటి? ఆస్తులు పోగొట్టుకుంటే నీకేంటి..? నా గురించి మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీల గురించి కూడా ఇలాగే వార్తలు రాస్తూ ఉంటారు.
విజయ్ కూతురు చనిపోతే.. ప్రేమలో మోసపోయిందన్నారు – సుధ
నేను, తమిళ నటుడు విజయ్ ఆంటోనీతో రోమియో (Romeo) అనే సినిమా చేస్తున్న సమయంలో సడన్గా ఆయన కూతురు సూసైడ్ చేసుకున్నట్టు ఇంటి నుండి కాల్ వచ్చింది.వెంటనే ఆయన ఇంటికి పరిగెత్తారు.ఆ టైంలో షూటింగ్ అయిపోయాక మేం కూడా విజయ్ ఆంటోనీ ఇంటికి వెళ్ళాం కానీ ఆ సమయంలో ఓ యూట్యూబర్ అక్కడున్న సిచ్యువేషన్ ని వీడియో తీసుకొని వెళ్లి నెక్స్ట్ డేనే ఒక వీడియో పోస్ట్ చేశారు.. కొంతమంది యూట్యూబర్లు అయితే విజయ్ ఆంటోనీ(Vijay Antony) కూతురు ఎవరితోనో లవ్ లో పడింది.వాడు మోసం చేశాడు. అందుకే సూసైడ్ చేసుకుందని చాలా నీచంగా రాశారు. ఒక 16 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే ఇలాంటి ఒక నీచమైన వార్త చూసి ఆ చనిపోయిన కూతురు తల్లి తండ్రి ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించారా.. ?
ఆ నరకం మీరు అనుభవిస్తే తెలుస్తుంది – సుధ
కూతురు చనిపోయిన బాధలో వాళ్ళుంటే.. కూతురు ఎవడినో లవ్ చేసిందని వార్తలు రాస్తే ఆ తల్లిదండ్రుల పెయిన్ ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది.. ఇలాంటి వార్తలు క్రియేట్ చేసేవారు సెలబ్రెటీల మీద పడకుండా మీ ఇంట్లో వాళ్ల గురించి రాసుకోండి. మీకు బాగా ఇష్టమైన వారు చచ్చిపోయారని రాసుకొని ఆనందించండి. కానీ సెలబ్రిటీల పేర్లు వాడుకొని డబ్బులు సంపాదించకండి.. విజయ్ ఆంటోనీ కూతురు మరణించినప్పుడే నేను సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ఫైర్ అయ్యాను. దానిపై ఫైట్ మాస్టర్ ఇప్పుడు దాని గురించి వదిలేయండి సుధ అన్నారు. కానీ ఇప్పుడే మాట్లాడాలి ఇలాంటి వారికి బుద్ధి రావాలని తిట్టాను అంటూ సుధ ఆ ఇంటర్వ్యూలో సెలబ్రెటీలపై వచ్చే రూమర్లపై ఫైర్ అయింది..
సోషల్ మీడియాపై సుధ అక్కసు..
చిన్నచిన్న సరదా వార్తలైతే వాటిని చూసి మేం కూడా ఎంజాయ్ చేస్తాం.కానీ ఇలా వారి మనోభావాలను దెబ్బతీసేలా వార్తలు రాస్తే ఆ వార్తలు చూసి బాధలో ఉన్నవాళ్లు మరింత కృంగిపోతారు. ఇలాంటివి రాయడం ఇకనైనా మానండి అంటూ సోషల్ మీడియాపై తన అక్కసు బయటపెట్టింది సుధ.
ALSO READ: Shruti Haasan: అవన్నీ నచ్చకే.. సర్జరీ చేయించుకోవడం పై శృతిహాసన్ బోల్డ్ కామెంట్స్!