Nindu Noorella Saavasam Serial Today Episode: చిత్ర, మనోహరి రూంలోకి వెళ్లిపోతారు. వెనకే వెళ్లిన వినోద్ తనకు ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. ఇక మనోహరి ఆశ్చర్యంగా చిత్ర నీ గురించి చాలా తక్కువ అంచనా వేశాను. ఇంట్లోకి వచ్చీ రాగానే దానికి దెబ్బ తగిలేలా చేశావు చూడు నిజంగా నువ్వు గ్రేట్. అసలు అది దెబ్బ తగిలి రక్తం వచ్చినా కూడా అది మౌనంగా వెళ్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా..? అయినా మోసం చేసి పెళ్లి చేసుకున్నావని వాళ్లందరికీ నిజం తెలుసని నీకు తెలిసినా ఎలా ఈ పని చేశావు. అసలు ఏం చూసుకుని నీకు అంత ధైర్యం అని అడుగుతుంది.
దీంతో తాళి చూపిస్తూ దీన్ని చూసుకునే నాకు అంత ధైర్యం ఇప్పుడు నేను అరుంధతి స్నేహితురాలు చిత్రను కాదు మను. ఈ ఇంటి చిన్న కోడలిని ఈ ఇంట్లో భాగీకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అని చెప్తుంది. ఇన్ని రోజులు వాడు దాన్ని ఒక్క మాట అననివ్వలేదు. కానీ ఇప్పుడు వాళ్లందరూ నోరు తెరవలేకపోవడం చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అంటుంది మనోహరి. దీంతో ఏంటి ఇంత చిన్న దానికే ఇంత హ్యాపీ అవుతావా..? రేపు నేను ఆ భాగీని పర్మినెంట్‌గా ఈ ఇంట్లోంచి పంపించి వేస్తాను. నేను దాచేసిన నా గతాన్ని అందరికీ చెప్పాలనుకుంటుందా..? అందుకే భాగీని వెంటనే ఈ ఇంటికి బావగారికి దూరం చేస్తాను అంటుంది. దీంతో అదంతా ఈజీగా కాదు చిత్ర అమర్‌కు ఇప్పుడే భాగీ మీద ప్రేమ మొదలైంది అంటుంది మను.
నువ్వు చూస్తూ ఉండు నా మెడలో పడిన తాళి సాక్షిగా బావగారి చేతే భాగీని ఈ ఇంట్లోంచి బయటకు గెంటిస్తాను అని చెప్తుంది. దీంతో మనోహరి.. ఆరు ఎప్పుడూ తాళి పవర్ గురించి చెప్తుండేది.. దాని పవర్ అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది.. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు నేను ఈ ఇంటి కోడలు అయిపోతాను అంటుంది. ఇంతలో మనోహరికి రణవీర్ కాల్ చేస్తాడు. ఈ టైంలో వీడు కాల్ చేస్తున్నాడేంటి..? అని లిఫ్ట్ చేస్తుంది. రణవీర్ తాను వెంటనే కలవాలని ఎయిర్‌ఫోర్ట్ నుంచి మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు. వద్దని రావొద్దని తర్వాత కలుద్దామని మనోహరి చెప్తుంది. అయితే నేను ఇప్పుడే అమరేంద్రను కలిసి నిజం చెప్తాను అంటూ బెదిరించడంతో ఇప్పుడు నేనేం చేయాలి అని మనోహరి అడుగుతుంది. నేను అంజలిని చంపాలనుకుంటున్నాను అందుకు నువ్వు హెల్ప్ చేయాలి అని చెప్తాడు రణవీర్. రణవీర్ మాటలకు మనోహరి షాక్ అవుతుంది.
ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా..? ఇప్పుడు చిత్ర, వినోద్‌ల పెళ్లి అయింది. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు అని మనోహరి చెప్తుండగానే రణవీర్ కాల్ కట్ చేస్తాడు. మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంటే.. చిత్ర ఏంటి మను మాజీ మొగుడి నుంచి పిలుపు వచ్చిందా..? అని అడుగుతుంది. నువ్వు వెళ్లి అక్కడ లెక్క సెటిల్ చేసుకుని రా ఇక్కడ నేను అందరి లెక్క సెట్ చేస్తాను అంటుంది. మనోహరి సరే అంటూ వెళ్లిపోతుంది. తర్వాత రణవీర్ దగ్గరి నుంచి ఇంటికి వచ్చిన మనోహరికి ఎదురుగా హల్లో పేకమేడలు కడుతున్న అంజు కనిపిస్తుంది. వెనక నుంచి మెల్లగా వెళ్లిన మను వాటిని కూలిపోయేలా చేస్తుంది. అంజు బాధ పడుతుంటే ఫీలవకు అంజు కొంత మంది ఎంత ట్రై చేసినా ఫినిష్ లైన్‌ను దాటలేరు అంటూ చెప్పి వెళ్లిపోతుంటే అమ్ము వచ్చి ఒక్క నిమిషం ఆంటీ అంటూ చెప్ప అందరూ వచ్చి పేకమేడలు కడుతారు. దీంతో అంజలి మనోహరి ఆంటీ చూశారు కదా నేను ఎంత ట్రై చేసినా ఫినిష్ లైన్ దాటలేను అన్నారు కదా..? ఇప్పుడు చూశారా..? నా ఫ్యామిలీ అంతా నా పక్కనే ఉండి అందరూ నన్ను ఎలా దాటించారో అంటూ వెటకారంగా చెప్తుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?