Bigg Boss Buzzz Srija : బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ లందరూ బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూలు ఇస్తారు అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్ మేట్స్ ఆడే ఆట తీరును మంగపతి శివాజీ తన ఇంటర్వ్యూలో ఎండగడతారు. ఎవరికి ఇవ్వాల్సిన కౌంటర్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఇస్తారు.
వాస్తవానికి చెప్పాలంటే ప్రతి వీకెండ్ నాగార్జున మొదటి క్లాస్ అయిపోతే, నామినేషన్స్ తర్వాత శివాజీ రెండవ క్లాస్ తన ఇంటర్వ్యూలో స్టార్ట్ అవుతుందని చెప్పాలి. అయితే ఈ వారం బిగ్ బాస్ లో ఇద్దరితో ఇంటర్వ్యూ చేశారు. డబల్ ఎలిమినేషన్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఎలిమినేట్ అయిన ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ దీనిలో పాల్గొన్నారు.
ప్రోమో స్టార్ట్ అయిన వెంటనే శ్రీజ దమ్ముతో శివాజీ మాట్లాడుతూ కామనర్స్, సెలబ్రిటీస్ అని మనసులో నువ్వు గట్టిగా పెట్టేసుకున్నావ్. నా నోటి నుండి కామనర్స్ సెలబ్రిటీస్ అని ఒక్కసారే వచ్చింది. నువ్వు మెయిన్ మైనస్ అవ్వడానికి కారణమే అది.
ఫ్లోరా ను ఉద్దేశిస్తూ మీరు అసలు గేమ్ ఎందుకు ఆడలేకపోయారు అని అడిగారు. నేను ప్రతి వారం ఇంప్రూవ్ అయ్యాను అని ఫ్లోరా చెప్పారు. లేదండి మీరు గేమ్ ఆడలేదు అని చెప్పేసారు.
గేమ్స్ , ఎమోషన్స్, పర్సనల్స్ అసలు నువ్వు ఎందుకు అరిచావు అని శ్రీజ దమ్మును అడిగారు శివాజీ. ఒక మనిషిని నువ్వు నెగిటివ్ నువ్వు నెగిటివ్ అని పదే పదే అంటుంటే, నువ్వు ఎవరికీ సెట్ కావు. నీతో మాట్లాడకూడదు అని అంటుంటే. ఆటోమేటిక్ గా లో అవుతాం అని శ్రీజ దమ్ము చెప్పింది.
శ్రీజ కు గొంతు ఎక్కువ వెనక ముందు చూడకుండా అనేస్తది అని అనగానే నేను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర కూర్చుంటే నా దగ్గర నుంచి లేచి వెళ్లిపోయేవాళ్ళు. అని శ్రీజ చెప్పింది.
నీ హౌస్ మేట్స్ మిమ్మల్ని చూసి పారిపోతున్నారు అంటే ఆ రెండు వారాలు మీరు ఎంత టార్చర్ పెట్టారు మీకు అర్థం కాలేదా అని శివాజీ తిరిగి ప్రశ్నించారు.
ఫ్లోరాను ఉద్దేశిస్తూ సంజనా మిమ్మల్ని తోలుబొమ్మలాగా ఆడించింది అన్నారు. మరోవైపు శ్రీజ ను ఉద్దేశిస్తూ నేను వెళ్తే లవ్ యాంగిల్ ఏమైనా ట్రై చేయొచ్చా అనేటట్లు ఉండేవాడు. ప్లాన్ గా లవ్ యాంగిల్ నడుపుతున్నాడంటావా అని ప్రశ్నించారు శివాజీ. కంటెంట్ కోసం చేసి ఉండొచ్చు అని శ్రీజ దమ్ము చెప్పింది. దమ్ముంటే టచ్ చేయండి, ధైర్యం ఉంటే టచ్ చేయండి, కొడతా, తంతా వంటి మాటలు పవన్ మాట్లాడేవాడు.
Also Read: Bigg Boss 9 Wild Card : తమిళ్ బిగ్ బాస్ లో 65 రోజులు ఉన్నా, ఈ లోపు నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో…