Siddu Jonnalagadda : నీరజ కోన దర్శకురాలుగా చేస్తున్న తెలుసు కదా సినిమా పైన మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. జాక్ సినిమా తర్వాత సిద్దు జొన్నలగడ్డ కూడా సక్సెస్ కొట్టాలి అని ఉద్దేశంతో ఉన్నారు. ఈ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అందరూ అనుకుంటున్నారు. అలానే ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాలో ఉండటం కూడా అలా అనుకోవడానికి ఒక కారణం.
ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రేపు 11:34 విడుదల కానుంది. అయితే ఈ తరుణంలో ఈ ట్రైలర్ చూసిన కొంతమంది మంచి ఎలివేషన్ ఇస్తున్నారు. నీరజకోన దర్శకురాలు కాకముందు చాలామంది సెలబ్రిటీలతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ గా పెద్దపెద్ద ఫిలిమ్స్ కూడా చేశారు కాబట్టి అందుకు ట్రైలర్ గురించి చెబుతున్నారు అనుకుంటే పొరపాటే.
సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ రైజ్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ట్రైలర్ గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ, అలానే యాంకర్ సుమ కూడా ట్వీట్ చేశారు.
నాగవంశీ ట్వీట్ చేస్తూ… మన సిద్ధు బోయ్ మళ్ళీ పూర్తిగా ఆల్ఫా మోడ్‌లోకి వచ్చాడు. మా సిద్దు సినిమా నే కదా… ఎదో ఆబ్లిగేషన్ ట్వీట్ కాదు. నేను సినిమా చూశానని లేదా సినిమా రిజల్ట్ గురించి నాకు తెలుసు అని చెప్పడం లేదు. కానీ రేపు ఉదయం రాబోయే అవుతున్న ట్రైలర్ మంచి కిక్ అనిపించింది.
లవ్ ఫెయిల్యూర్ బాయ్స్ సిద్ధంగా ఉండండి మీకోసం మంచి మెటీరియల్ రెడీ చేశాడు. ‘తెలుసు కదా’ టైటిల్ చూసి ఈదో సాఫ్ట్ లవ్ స్టోరీ అని ఫిక్స్ అవ్వొద్దు…మీకు ఒక పెద్ద సర్ ప్రైజ్ ఉంది.
కొంత మంది మీద కొన్నికొన్ని ఫీలింగ్స్ అలా ఉండి పోతాయి అంటే, రమ్మంటే వచ్చాయ్ ఏంటి? పోమంటే పోడానికీ..! అనే సినిమాలోని డైలాగ్ కూడా రివీల్ చేశాడు.
Our Siddhu Buoy is back in full-blown alpha mode! 🔥 #TelusuKada
Maa Siddu cinema ne kada… edo obligation tweet kaadu 😎
I’m not saying i have seen the film or i am commenting on the result of the film…but
The Trailer dropping tomorrow morning looks kkkickasss!🔥 Siddu’s…
— Naga Vamsi (@vamsi84) October 12, 2025
ఇప్పుడే ఏదో ఎగ్జైటింగ్ సిద్దు జొన్నలగడ్డ ట్రైలర్ రఫ్ కట్ అని చూసా మస్త్ వుంది. అది చూసిన తర్వాత నేను సినిమా చూడకుండా ఉండలేను అని అనిపిస్తుంది. చూడప్ప సిద్ధప్ప .. … రేపు ట్రైలర్ నే కదా అప్పా ?? తెలుసు కదా అంటూ ట్విట్ చేశారు.
Just watched something exciting 👀@Siddubuoyoffl Trailer rough cut ani choosaa… mast vundhi after seeing that i cant wait to watch the film.. chudappa siddhappa .. … trailer tomorrow ne kada appa ?? #TelusuKada this one’s got emotion class and that subtle
— Suma Kanakala (@ItsSumaKanakala) October 12, 2025
ఈ రెండు ట్వీట్స్ మరియు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్స్ చూస్తుంటే సినిమా మీద క్యూరియాసిటీ మరింత పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఈ సినిమా దివాలి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read: Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు