Bigg Boss 9wild card: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9 telugu)కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఐదు వారాలను పూర్తి చేసుకుంది ఐదవ వారంలో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్ లో హౌస్ నుంచి బయటకు వెళ్లారు మొదట ఫ్లోరా సోని బయటకు వెళ్ళగా, రెండవ కంటెంట్ గా దమ్ము శ్రీజ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఐదవ వారంలోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ(Wild Card Entry)లో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారు. మొదటి కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష హౌస్ లోకి అడుగు పెట్టారు.
ఇక రెండవ కంటెస్టెంట్ గా సినీనటుడు శ్రీనివాస్ సాయి(Srinivas Sai)ను హౌస్ లోకి పంపించారు అయితే ఈయన గురించి చాలామందికి తెలియకపోవచ్చు . శ్రీనివాస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా నాగార్జున నటించిన కేడి సినిమాలోను అలాగే ఊపిరి సినిమాలో కూడా శ్రీనివాస్ నటించారు. అలాగే గోల్కొండ హై స్కూల్ సినిమాలో కూడా నటించారు. ఇలా అక్కినేని హీరోల సినిమాలలో నటించడంతో అక్కినేని ఫ్యామిలీ మెంబర్ గా ఈయన హౌస్ లోకి అడుగు పెట్టారు. శ్రీనివాస్ వేదిక పైకి రాగానే ఆయనకు సంబంధించిన ఏపీ ప్రసారం చేశారు. అనంతరం నాగార్జున కూడా శ్రీనివాస్ తో మాట్లాడుతూ.. ఎందుకు బిగ్ బాస్ కు రావాలని కోరుకున్నారు అంటూ అడగడంతో తన కెరియర్ కోసమేనని తెలిపారు.
తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించాను. ఇక నాకు హీరోగా కూడా అవకాశాలు వస్తాయని భావించాను కానీ అది నిజం కాదని తెలిపారు. ఇలా బిగ్ బాస్ వంటి ఒక మంచి ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెడితే తన కెరీర్ కు ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమానికి వచ్చానని శ్రీనివాస్ సాయి తెలిపారు. శ్రీనివాస్ సాయి హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున ఆయనకు మరొక పవర్ ఇచ్చారు. సాయికి డార్క్ బ్లూ స్టోన్ ఇచ్చారు. ఇది ఇమ్యూనిటీ పవర్ ఇస్తుందని తెలిపారు. ఎప్పుడైనా ఎలిమినేషన్ లో దీనిని నీకోసమైనా ఉపయోగించుకోవచ్చు లేదా హౌస్ లో ఎవరినైనా సేవ్ చేయడానికి అయినా ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు.
ఇమ్యూనిటీ పవర్ తో వెళ్ళిన సాయి..
ఇలా బ్లూ స్టోన్ తో, ఇమ్యూనిటీ పవర్ తో శ్రీనివాస్ సాయి రెండవ కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా సినీ బ్యాగ్రౌండ్ ఉండి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన బిగ్ బాస్ హౌస్ ద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు అనుకున్న విధంగానే ఈ కార్యక్రమం తన కెరీర్ కు ప్రయోజనకరంగా మారుతుందా? తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read:Bigg Boss 9 wild Card: వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా పచ్చళ్ళ పాప.. హౌస్ లోకి అడుగుపెట్టగానే రచ్చ!