Bigg Boss 9 Elimination : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss 9telugu) కార్యక్రమం నేటితో ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ ఐదవ వారంలో భాగంగా ఎలిమినేషన్ పై ఉత్కంఠత నెలకొంది. ఈ వారం డబల్ ఎలిమినేషన్ (Double Elimination)ఉండబోతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జున కూడా కన్ఫర్మ్ చేయడంతో మరి హౌస్ నుంచి ఈ వారం బయటకు వచ్చే ఆ ఇద్దరు కట్టిస్టెంట్ లు ఎవరు అనే విషయం గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈవారం పదిమంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉండగా చివరికి రీతూ చౌదరి (Rithu Chowdary) ఫ్లోరా షైనీ(Flora Shini) మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది.
ఇలా వీరిద్దరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అంటూ నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్లను అడగడంతో చాలామంది రీతూ సేవ్ అవుతుందని అలాగే ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందని తెలిపారు. ఈ ఎలిమినేషన్ గ్రౌండ్లో భాగంగా నాగార్జున రీతూ చౌదరి ఫ్లోరాను యాక్టివిటీ ఏరియా కు రమ్మనడంతో రీతూ మాత్రం డీమాన్ పవన్‌ని పట్టుకొని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక మీరు హౌస్ లో ఉన్న కంటెంట్ల గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అంటూ నాగార్జున అడగడంతో ఫ్లోరా సంజన గురించి మాట్లాడారు . తాను హౌస్ లో బాధపడుతున్న ప్రతిసారి సంజన వచ్చి నన్ను ఓదార్చింది అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఇక రీతూ మాత్రం డీమాన్ గురించి మాట్లాడుతూ.. నాకు నిన్ను వదిలి వెళ్లాలని లేదనీ ఎమోషనల్ అవుతూ హ్యాపీగా ఉండమని చెప్పారు. ఇక ఈ ఎలిమినేషన్ రౌండులో భాగంగా రీతు చౌదరి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవడంతో ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతూ స్టేజ్ పైకి వచ్చింది. స్టేజ్ మీదకు వెళ్ళిన ఫ్లోరా బిగ్ బాస్ హౌస్ గురించి బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియచేశారు. అనంతరం ఆమె బిగ్ బాస్ జర్నీకి సంబంధించిన ఏవి ప్లే చేశారు. ఇక ఫ్లోరా షైనీ హౌస్ నుంచి వెళ్ళిపోతున్న నేపథ్యంలో నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు ఎవరికి థంమ్స్ అప్, ఎవరికి థంమ్స్ డౌన్ ఇస్తారని అడిగారు.
సంజన విషయంలో ఫ్లోరా ఎమోషనల్..
ఇక ఫ్లోరా థంమ్స్ అప్ లో దివ్య, దమ్ము శ్రీజ, ఇమ్మానియేల్, సంజనకి థంబ్స్ అప్ ఇచ్చింది. అలాగే భరణి, తనూజలకి థంమ్స్ డౌన్ ఇచ్చింది. సుమన్ శెట్టిని మాత్రం రెండింటికీ మధ్యలో పెట్టటం విశేషం. అనంతరం సంజనా గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా ఫ్లోరా షైనీ ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే డబుల్ ఎలిమినేషన్ కావడంతో మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారనే విషయంపై కూడా ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టాయి. దమ్ము శ్రీజ(Dammu Sreeja) కూడా ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక ఫ్లోరా షైనీ హౌస్ నుంచి బయటకు రావడంతో వైల్డ్ కార్డు ఎంట్రీస్ కూడా ప్రారంభమయ్యాయి. వైల్డ్ కార్డు ద్వారా ఆరుగురు కంటెస్టెంట్లు నేడు హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఇండస్ట్రీలోనే రికార్డు!