INDW vs AUSW: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 12 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇవాళ టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( India Women vs Australia Women ) మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( ACA-VDCA Cricket Stadium, Visakhapatnam ) జరిగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు పోటా పోటీ పడ్డాయి. కానీ చివరికి మ్యాచ్ మాత్రం ఆస్ట్రేలియాను వరించింది. చివరి వరకు పోరాడిన ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 331 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు నష్టపోయి 49 ఓవర్స్ లో ఫినిష్ చేసింది ఆస్ట్రేలియా. చివరలో సిక్సర్ కొట్టి మరి మ్యాచ్ గెలిపించారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. దీంతో పాయింట్లు పట్టికలో నెంబర్ వన్ స్థానానికి దూసుకు వెళ్ళింది ఆస్ట్రేలియా.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మొన్న సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా ఇవాళ ఆస్ట్రేలియా చేతిలో కూడా దారుణ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళల జట్టు 48.5 ఓవర్లు ఆడి 330 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 300కు పైగా పరుగులు చేసినప్పటికీ టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. దీంతో 49 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా టార్గెట్ ఛేదించింది. అంటే ఈ మ్యాచ్ లో మొత్తం 660 కి పైగా పరుగులు నమోదు చేశాయి రెండు జట్లు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానానికి దూసుకు వెళ్ళింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో ఏడు పాయింట్లు ఉండగా ఇంగ్లాండ్ ఆరు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. టీమిండియా కేవలం నాలుగు పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో అదిరిపోయే క్యాచ్ అందుకుంది టీమిండియా యంగ్ ప్లేయర్ స్నేహ రాణా. సెంచరీ తో చెలరేగిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ ( Alyssa Healy) 150 పరుగుల దిశగా దూసుకు వెళ్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ క్యాచ్ ను డైవ్ చేసి మరి, ఈ స్నేహ రాణా అందుకున్నారు. 142 పరుగుల వద్ద శ్రీ చరణ్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ ఆడారు ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ. అయితే అక్కడే ఉన్న స్నేహ రాణా అద్భుతంగా క్యాచ్ అందుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
It took another moment of brilliance to stop Alyssa Healy! 🙌
Shree Charani ends her spell with 3 wickets, while Sneh Rana takes a stunner 🔥
Will this wicket be the turning point of the match? 👀
Catch the LIVE action ➡https://t.co/qAoZd44TEs#CWC25 👉 #INDvAUS | LIVE NOW… pic.twitter.com/NMKHPYlZ8q
— Star Sports (@StarSportsIndia) October 12, 2025
Sneh Rana takes a brilliant catch, Alyssa Healy walks back for 1⃣4⃣2⃣ 🏏
📸: JioHotstar#CWC2025 #INDWvsAUSW #AlyssaHealy #SnehRana #CricketTwitter pic.twitter.com/sLaOln9DnV
— InsideSport (@InsideSportIND) October 12, 2025