Rohit Sharma: టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ధోని కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన రోహిత్ శర్మ ఆ తర్వాత కెప్టెన్ స్థాయికి దిగాడు. టెస్టులు, టి20 లు అలాగే వన్డేలకు కెప్టెన్ గా కూడా ఎదిగాడు రోహిత్ శర్మ. అలాంటి రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు వన్డే కెప్టెన్సీ ఉండగా దాన్ని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలగించింది. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ బరిలో దిగుతున్నాడు రోహిత్ శర్మ. ఈ సిరీస్ పూర్తయిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తన రిటైర్మెంట్ కంటే ముందు కొన్ని రికార్డులు రోహిత్ శర్మను ఊరిస్తున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై ( Australia) ఆ రికార్డులను క్రియేట్ చేసే అవకాశం రోహిత్ శర్మకు దక్కింది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) వన్డే సిరీస్ ప్రారంభాని కంటే ముందు రోహిత్ శర్మను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. అందులో మొట్ట మొదటిది 500 అంతర్జాతీయ మ్యాచులు. ఆస్ట్రేలియా తో తొలి వన్డే రోహిత్ శర్మ ఆడితే, 500 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ప్లేయర్ గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు రోహిత్ శర్మ. అలాగే మరో ఎనిమిది సిక్సర్లు కొడితే, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు సృష్టిస్తాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు వన్డేలలో 344 సిక్సర్లు కొట్టాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో 88 కొట్టగా టి20 లలో 205 బాదేశాడు.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
ఆస్ట్రేలియా గడ్డపై చిట్టచివరి సిరీస్ రోహిత్ శర్మ ఆడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మ ఒక్క సెంచరీ చేయాలని అంటున్నారు ఆయన అభిమానులు. ఒకే ఒక్క సెంచరీ చేస్తే తన కెరీర్ లో మొత్తం 50 అంతర్జాతీయ శతకాలు పూర్తి చేసిన బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టిస్తాడు. అదే సమయంలో మరో 300 పరుగులు చేస్తే 20,000 ఇంటర్నేషనల్ పరుగుల లిస్టులోకి చేరిపోతాడు. ఇక క్యాచ్ ల విషయానికి వస్తే, మరో మూడు క్యాచ్ లు పడితే వన్డేల్లో 100 క్యాచ్ లు పట్టిన ప్లేయర్ గా రికార్డు లోకి రోహిత్ శర్మ ఎక్కుతాడు. మరి ఆస్ట్రేలియా గడ్డపై ఈ రికార్డులు సాధిస్తే, రోహిత్ శర్మకు మంచి ఫేర్ వెల్ దొరికినట్లు అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే వన్డే వరల్డ్ కప్ 2027 వరకు రోహిత్ శర్మ ఆడాలని కూడా పోస్టులు పెడుతున్నారు.