Bigg Boss 9 wild card: బిగ్ బాస్ తెలుగు సీజన్9 కార్యక్రమం నేడు ఐదవ వారం జరుపుకుంటుంది. అయితే ఐదో వారంలో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఆరుగురు కంటెస్టెంట్లను పంపించబోతున్నారు. ఈ కంటెస్టెంట్లలో మొదటి కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష (Ramya Moksha) హౌస్ లోకి అడుగుపెట్టారు. పక్కా లోకల్ అంటూ మాస్ పాట ద్వారా ఈమె స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రాగానే నాగార్జున కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక వచ్చి రాగానే నాగార్జునతో ఈమె మాట్లాడుతూ ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలా అని ఎదురుచూస్తున్నాను అందుకు కారణం అమలా గారు అని తెలిపారు.
అనంతరం రమ్య మోక్ష తన ఊర్లో ఉన్న కుక్కలకు ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆ షెల్టర్ అమల గారి చేతుల మీదుగా ప్రారంభించాలన్నదే తన కోరిక అని చెప్పడంతో కచ్చితంగా నీ కోరిక తీరుతుంది అంటూ నాగార్జున కూడా హామీ ఇచ్చారు. అనంతరం రమ్య మోక్ష ఏవి ప్రసారం చేయగా ఆమె తన జీవితంలో జరిగిన సంఘటనలను, తన కుటుంబ విషయాలను, తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనలను కూడా ఈ వీడియోలో తెలియచేస్తూ ఎమోషనల్ అయ్యారు. పికిల్స్ బిజినెస్ లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు తన అక్క డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, తన తండ్రి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ ఏవీలో భాగంగా రమ్య మాట్లాడుతూ.. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమసో ఈ రమ్య కూడా అంతే ఫేమస్ అంటూ డైలాగులు పేల్చారు . ఇక సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఎదుర్కొన్న నెగిటివిటీ నుంచి బయటకు వచ్చి కెరియర్ ప్రారంభించమని కొంతమంది అభిమానులు ఆమెను కోరారు. అందుకే బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. ఇక ఈమె హౌస్ లోకి వెళ్లే ముందు హౌస్లో ఎంటర్టైన్మెంట్ లేదని తాను వెళ్లి అందరిని ఎంటర్టైన్ చేస్తాను అంటూ చెప్పారు. ఇక రమ్య హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున తనకు ఒక లగ్జరీ ఫుడ్ ఫ్లవర్ ఇచ్చారు. హౌస్ లో ఎవరికైనా ఎప్పుడైనా ఇది వాడుకోవచ్చని తెలిపారు. అనంతరం ఆమె చేత కొన్ని పికిల్స్ పంపిస్తూ ఓవరాక్షన్, మేనిపులేటర్, సేఫ్ గేమర్, సెల్ఫిష్, ఫేక్ అంటూ ట్యాగ్ ఇవ్వమని చెప్పడంతో అవి హౌస్ లో ఉన్నవారికి ఈమె ఇచ్చేశారు.
రియాలిటీ బయట పడుతుందా..
ఇలా ఈ ట్యాగ్స్ ఇస్తూనే ఆ కంటెస్టెంట్లతో ఈమె కొంత వాదనకు దిగడమే కాకుండా ఈ హౌస్ లో తనకు ఎవరు నచ్చలేదంటూ కూడా చెప్పారు. మరి హౌస్ లోకి అడుగు పెడుతూనే హౌస్ లో ఉన్న వారందరికీ ట్యాగ్స్ ఇస్తూ రమ్య రచ్చ చేశారు. మరి ముందు ముందు హౌస్ లో రమ్య ఎలా తన ఆట తీరుతో ఆకట్టుకుంటారు .తన రియాలిటీని బయటపెడుతూ తనపై బయట ఉన్న నెగిటివిటీని తొలగించుకుంటారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక పికిల్ బిజినెస్ కారణంగా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు భారీగా నెగిటివిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఇంత నెగిటివిటీతో రమ్య మోక్ష ఎన్ని రోజులపాటు హౌస్ లో కొనసాగుతారో తెలియాల్సి ఉంది.
Also Read: Bigg Boss 9 Elimination :ఈ వారం డబుల్ ఎలిమినేషన్… ఫస్ట్ బయటకు వచ్చింది ఎవరంటే?