BigTV English

BB Telugu 8 Winner: విన్నర్ వారే.. 3 వారాల ముందే తేల్చేసిన ఆడియన్స్..!

BB Telugu 8 Winner: విన్నర్ వారే.. 3 వారాల ముందే తేల్చేసిన ఆడియన్స్..!

 BB Telugu 8 Winner :బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే విన్నర్ ఎవరు? అనే అనుమానాలు కూడా అందరిలో వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా హౌస్ లో కొనసాగినన్ని రోజులు ఆటతీరుతో ఓట్ల పరంగా ఎవరైతే మెప్పించారో వారే టైటిల్ విన్నర్. ఈ క్రమంలోనే ఈసారి టైటిల్ కొట్టే కంటెస్టెంట్ ఎవరో కూడా క్లారిటీ వచ్చేసింది. మరి సీజన్ 8 టైటిల్ అందుకునే వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం.


గ్రాండ్ ఫినాలే కి మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్ లో.. 12వ వారం యష్మీ ఎలిమినేట్ అవ్వడంతో 9 మంది మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో టాప్ 5 లో ఉండేది ఎవరు? ఫైనల్ విన్నర్ ఎవరు? అనే ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి. ముందుగా టాప్ ఫైవ్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ని మనం పరిశీలిస్తే, అందులో నిఖిల్, ప్రేరణ కచ్చితంగా ఫైనల్ వరకు ఉంటారనటంలో సందేహం లేదు. ఇక వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ప్రస్తుతం నలుగురు మాత్రమే హౌస్ లో ఉన్నారు. వారిలో రోహిణి, టేస్టీ తేజ, అవినాష్, గౌతమ్. ప్రస్తుతం గౌతమ్ టైటిల్ రేస్ లో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో టాప్ ఫైవ్ కి కచ్చితంగా వస్తారు అని అందరికీ తెలిసిందే. సో అలా నిఖిల్, ప్రేరణ, గౌతమ్ లకు ఫైనల్ బెర్త్ కన్ఫామ్ అయిపోయింది.

ఇక మిగిలిన రెండు స్థానాలు ఎవరివి? అని డైలమాలో పడ్డారు ఆడియన్స్. వాస్తవానికి నబీల్, విష్ణు ప్రియ, రోహిణి, టేస్టీ తేజ.. వీరు నలుగురిలో ఇద్దరికీ చాన్స్ ఉంది. ముఖ్యంగా విష్ణు ప్రియ గేమ్ పరంగా వెనకబడినా.. ఆమెకున్న ఫేమ్ రీత్యా కచ్చితంగా.. టాప్ 5 లో వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు తన ఆట తీరతో స్ట్రాటజీ చూపిస్తూ ముందడుగు వేస్తున్నారు నబీల్. ఈయన కూడా టాప్ ఫైవ్ లో ఉంటారని సమాచారం ఇలా మొత్తంగా చూసుకుంటే.. నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్, విష్ణు ప్రియ టాప్ ఫైవ్లో ఉండబోతున్నారు.


ఇకపోతే అవినాష్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 11 వ వారమే ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. నబీల్ దగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి సేవ్ అయ్యాడు. ఇక 12వ వారం నామినేషన్స్ లోకి రాలేదు.ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో కచ్చితంగా ఈయన ఎలిమినేట్ అవుతారని సమాచారం. ఇకపోతే పృథ్వీ కి టాప్ ఫైవ్ లో చోటు లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే విషయానికి వస్తే నిఖిల్ గౌతమ్ మధ్య పోటీ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇకపోతే గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీ కాబట్టి ఈయనకు టైటిల్ ఎలా ఇస్తారని కొంతమంది తప్పు పడుతున్నారు చివరికి ఎక్స్ కంటెస్టెంట్ అయిన అబ్బాయి నవీన్ కూడా గేమ్ చూసి వచ్చారు కదా వీరికి టైటిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ కూడా వీడియో విడుదల చేశారు. అయితే గేమ్ ఆధారంగా టైటిల్ ఇవ్వాలని.. టైటిల్ విన్నర్ చేయలేని సమయంలో అలాంటప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎందుకు అంటూ ఒక వర్గం అబ్బాయి నవీన్ ను ఖండిస్తోంది. ఇక గత సీజన్లో కూడా అర్జున్ వెంబటి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చాడు కాబట్టి విన్నర్ రేస్ లో ఉన్న తప్పించారు సో ఈసారి కూడా గౌతమ్ పరిస్థితి అదే ఇక అందుకే నిఖిల్ సీజన్ 8 విన్నర్ గా నిలవబోతున్నారని సమాచారం.

Related News

Bigg Boss Buzzz Srija : నేను గ్రూపు దగ్గర కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోయే వాళ్ళు, ప్లాన్డ్ గా లవ్ యాంగిల్ నడిపాడు

Bigg Boss 9 Wild Card : తమిళ్ బిగ్ బాస్ లో 65 రోజులు ఉన్నా, ఈ లోపు నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో…

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ లోకి దువ్వాడ మాధురి. షాక్ అయిన హౌస్ మేట్స్, శ్రీజ తో ఆర్గ్యుమెంట్ మొదలు 

Bigg Boss 9 : మైండ్ చెదిరిపోయే ట్విస్టులు, డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ ఫైర్ వైల్డ్ కార్డు ఎంట్రీస్

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున ఫ్యామిలీ మెంబర్? ఇదెక్కడి ట్విస్ట్?

Bigg Boss 9 wild Card: వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా పచ్చళ్ళ పాప.. హౌస్ లోకి అడుగుపెట్టగానే రచ్చ!

Bigg Boss 9 Elimination :ఈ వారం డబుల్ ఎలిమినేషన్… ఫస్ట్ బయటకు వచ్చింది ఎవరంటే?

Justice For Srija Dammu : శ్రీజ దమ్ము ఎలిమినేట్, హౌస్ లో ఉండాలి అంటూ నెటిజెన్స్

Big Stories

×