BB Telugu 8:మరి కొన్ని గంటలు ఆగితే 14వ వారానికి సంబంధించిన ఓటింగ్ లైన్ కాస్త క్లోజ్ కానుంది. నామినేషన్ లో మొత్తం 6 మంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే టాప్ -5 లో ఎవరు ఉన్నారు? ఎవరు ఈసారి విజేత కాబోతున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఓటింగ్లో మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉండడం గమనార్హం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకోనుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అటు టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి అవినాష్ టాప్ సిక్స్ లో మొదటి ఫైనలిస్ట్ గా నిలిచారు. దాంతో ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే మిగిలిన వారిలో మరో ఐదుగురు ఫైనల్ కి వెళ్తే, ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆరుగురు ఫైనల్ కి వెళ్లినా ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత సీజన్ సెవెన్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనలిస్టులుగా ప్రకటించారు. ఇక ఈ సీజన్ కూడా అలాగే ఉండబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా పలు మీడియా సంస్థలు అనధికారిక పోల్ నిర్వహించగా గౌతమ్ మొదటి స్థానంలో నిలిచారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ చివరి వారాల్లో టైటిల్ రేస్ లోకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మిగతా కంటెస్టెంట్స్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆడియన్స్ కూడా గౌతం వైపు మొగ్గు చూపుతున్నారు. రెండవ స్థానంలో నిఖిల్ ఉండగా నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంటే. అయితే ఈసారి ఆయనకే టైటిల్ ఇస్తారనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం. అంతేకాదు ప్రతి టాస్క్ లో కూడా 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇప్పటివరకు అనేక విజయాలు కూడా సాధించాడు. అయితే నిఖిల్ కి నాన్ లోకల్ అనే ట్యాగ్ మైనస్ గా మారడమే కాకుండా సోనియా, యష్మీ ఎలిమినేషన్ కి కూడా పరోక్షంగా కారణం అయ్యాడనే అపవాద కూడా ఉంది.
ఇక మరొకవైపు ప్రేరణ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈమె కూడా స్ట్రాంగ్ ప్లేయర్ కావడం గమనార్హం. కాకపోతే కొంతమందితో మాత్రమే సన్నిహితంగా ఉండడంతో ఆమెపై నెగిటివ్ ఏర్పడింది. పైగా అప్పుడప్పుడు నోరు జారడం వల్లే నెగెటివిటీ ఏర్పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గౌతమ్, నిఖిల్, ప్రేరణ టాప్లో ఉండగా.. ఈ ముగ్గురు ఫైనల్ లో కనిపించడం ఖాయం. ఇక నాలుగో స్థానంలో రోహిణి నిలిచింది. ఇక గత రెండు మూడు వారాలుగా తనలోని పవర్ చూపిస్తూ టాస్క్ లు ఆడుతూ అలరిస్తోంది. ఇక దాంతో రోహిణి గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. ఇక మరోవైపు విష్ణు ప్రియ ఐదో స్థానంలో ఉంది. భారీ ఫేమ్ వున్న విష్ణు ప్రియ గేమ్ పరంగా వెనుకబడడమే కాకుండా పృథ్వీ చుట్టూ తిరుగుతూ గేమ్ వదిలేసింది. ఇక ఆ తర్వాత స్థానాలలో నబీల్ ఉన్నాడు. ఇక వీరిద్దరిలో ఒకరు ఈవారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే గౌతమ్ ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ వైల్డ్ కార్డు టైటిల్ ఇస్తే విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరోవైపు టైటిల్ కి నిఖిల్ అర్హుడు అనడంలో సందేహం లేదు. మరి ఓట్ల ప్రకారం గౌతమ్ మొదటి స్థానంలో ఉన్నారు. చివరికి ఎవరికి టైటిల్ ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది..