BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్.. మిగతా ఇండస్ట్రీలో 18,19 సీజన్లు పూర్తిచేసుకుంది. తెలుగులో మాత్రం కేవలం ఎనిమిది సీజన్లు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం 9వ సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ మొదలయ్యి 8 వారాలు పూర్తయ్యాయి.. ఎనిమిదో వారం దువ్వాడ మాదిరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. 9వ వారం నామినేషన్స్ మాత్రం గొడవలకు ఆజ్యం పోశాయి.. మొత్తానికి ఈ నామినేషన్స్ మాత్రం గొడవలు, ఎమోషనల్ సీన్లతో పూర్తి అయ్యాయి. అయితే ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఆసక్తిగా మారింది.. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం తనూజ టాప్ లో దూసుకుపోతుంది. విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఈయనకి ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈమె హౌస్ నుంచి బయటికి రాకముందే ఓ సినిమా ఆఫర్ ఆమె వరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇంతకీ ఆ హీరో ఎవరు సినిమా ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..


బంఫర్ ఆఫర్ పట్టేసిన తనూజ..

ముద్దమందారం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ తనుజ గౌడ. ఈ సీరియల్ తర్వాత ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు కానీ.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ షో ఇప్పటికే 8 వారాలు పూర్తిచేసుకుని తొమ్మిదవ వారంలోకి అడుగు పెట్టింది. తనుజ మొదటి నుంచి చురుగ్గా పాల్గొంటూ ప్రేక్షకులను తన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. దాంతో ఆమెను హౌస్ లో కొనసాగేలా ఓటింగ్ నమోదు అవుతుంది. అయితే మరికొన్ని వారాలు బిగ్ బాస్ షో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ షో తర్వాత ఈమె ఓ స్టార్ హీరో సినిమాల్లో నటించబోతుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి బాబి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో చిరంజీవి మరదలుగా ఈ అమ్మడు నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also Read : సీరియల్ హీరోల రెమ్యూనరేషన్.. అందరికంటే ఎక్కువ అతనికే..?


బిగ్ బాస్ విన్నర్ ఈమెనా..? 

సీరియల్ యాక్టర్ తనూజ తెలుగు సీజన్ 9 బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. మొదటినుంచి తన అమాయకత్వం అందంతో ప్రేక్షకులను మెప్పిస్తూనే వస్తుంది. అటు ఆటలో కూడా తన చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ ప్రతి వారం సేవ్ అవుతూ వస్తుంది. ఈమధ్య కొన్ని వారాల నుంచి ఏమైనా నామినేషన్స్ లోకి వస్తుంది. కానీ ఆమె ఓటింగ్ను బట్టి ఆమె సేవ్ అవుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్ల ఓటీంగ్ చూస్తే ప్రస్తుతం ఈమె టాప్ లో కొనసాగుతుంది. తర్వాత సంజన తర్వాత పవన్ ఉన్నారు. చూస్తుంటే ఈవారం గ్రాఫ్ తనూజకు ఫెవర్ గా ఉందని తెలుస్తుంది.. దాంతో ఈ సీజన్ కు ఈమె విన్నర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో నిజమేంత ఉందో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

 

Related News

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Bigg Boss 9: పాపం ఒంటరైన సంజన.. పేరుకే అమ్మా.. ఏంటి ఇమ్మాన్యుయేల్ ఇది

Bigg Boss 9 Day 58: హౌజ్ లో ఇద్దరు రెబల్స్.. పక్కనే ఉంటూ వెన్నుపోటు.. బలైన కళ్యాణ్, మళ్లీ ఒంటరైన సంజన

Bigg Boss 9: నాన్న పోయి తమ్ముడచ్చాడు.. తనూజకి కొత్త బాండింగ్ దొరికిందోచ్

Bigg Boss: మితిమిరిన గొడవలు.. కొట్టుకున్న కంటెస్టెంట్స్, అసలేమైందంటే..

Bigg Boss 9 promo 2: రెబల్ గా సుమన్ శెట్టి.. సూపర్ పవర్స్ ఇచ్చిన బిగ్ బాస్!

Big Stories

×