Bigg Boss 9 Promo : బిగ్ బాస్ సీజన్ 9 ఊహించని ట్విస్టులు తో డిజైన్ చేశారు. ఆల్రెడీ చాలామంది బయటకు వెళ్లి పోయారు అనుకున్న తరుణంలో మళ్లీ వాళ్లని లోపలికి ఎంట్రీ ఇచ్చేలా చేశారు. అయితే బయటికి వెళ్లి హౌస్ లోకి రావడం అనేది ఒక లక్ అని చెప్పాలి.
ముఖ్యంగా శ్రీజ దమ్ము విషయానికి వస్తే బయటకు వెళ్లిపోయిన తర్వాత, చాలామంది జస్టిస్ ఫర్ శ్రీజ అంటూ పోస్టులు కూడా వేశారు. విపరీతంగా వైరల్ చేశారు. మొత్తానికి బిగ్ బాస్ యాజమాన్యం దృష్టికి కూడా ఇది చేరినట్లు ఉంది. అందుకే శ్రీజ మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా హౌస్ లోకి గౌరవ్ గుప్తా కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గౌరవ గుప్తాకి తెలుగు రాదు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్ లో ఉంటూ తెలుగు నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.
ఆల్రెడీ హౌస్ లోకి భరణి మరియు శ్రీజ ఎంట్రీ ఇచ్చారు. అయితే వాళ్ల మైనస్ పాయింట్లు చెప్పమని హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ ను అడిగారు. దీనికి గౌరవ గుప్తా భరణి మైనస్ ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ స్టార్ట్ చేశాడు.
గోల్ గేమ్ లో వన్ గోల్ వన్ ఎలిమినేషన్ ఇది కేవలం ఫిజికల్ టాస్క్ మాత్రమే కాదు మెంటల్ టాస్క్ కూడా. అయితే మీరు అక్కడ ఫిజికల్ గా ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యారు అని నాకు అనిపించింది అని చెప్పాడు.
మీ టీం ఆ టాస్క్ లో గెలిచింది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాట వచ్చింది మా టీం గెలిచి ఉంటే ఈ మాట కూడా రాదు అని భరణి చెప్పాడు. అక్కడ కంప్లీట్ గా క్లారిటీ ఇచ్చేసాడు భరణి.
దివ్య కిచెన్ రూమ్ దగ్గర మాట్లాడుతూ నేను ఆ టీం కాబట్టి చెబుతున్నాను. టీం టాస్క్ గురించి మాట్లాడుతున్నాను. అయితే గౌరవ గుప్తా కి తెలుగు సరిగ్గా అర్థం కాదు. మొత్తానికి దివ్య ఏదైతే మాట్లాడే ప్రయత్నం చేసింది. అయిపోయిందా అని అడిగాడు.
దివ్య అలా మాట్లాడటం వల్ల కొత్త చిక్కు మొదలైంది కేవలం భరణిను అలా అనడం వల్లే దివ్య మాట్లాడింది అని చాలామంది హౌస్ మేట్స్ కి అనిపించింది. మళ్లీ బంధం కొనసాగించడం కోసం, భరణి తరపున ఆర్గ్యుమెంట్ చేస్తుంది అని కొంతమంది అభిప్రాయం.
అయితే ఇదే విషయాన్ని భరణితో కూడా ఫైర్ అవుతూ దివ్య చెప్పింది. మీరు గేమ్ ఆడటానికి వచ్చారు తను ఎందుకు స్టాండ్ తీసుకుంటుంది అని తనుజ మళ్లీ భరణిని ప్రశ్నించింది. ఈ తరుణంలో వాళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.
Also Read: Director Karuna Kumar : ప్రమోషన్స్ అంటే హీరోలు ఫోన్లు ఎత్తరు… ఇండస్ట్రీని హీటెక్కించే కామెంట్ ఇది