BigTV English
Advertisement

Bigg Boss 9: ఈ వారం నామినేషన్ లో మొత్తం 8 మంది.. వాళ్లు ఎవరెవరంటే

Bigg Boss 9: ఈ వారం నామినేషన్ లో మొత్తం 8 మంది.. వాళ్లు ఎవరెవరంటే


Bigg Boss 9 8th Week Nominations: నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఎనిమిదో వారం హౌజ్ నుంచి ఇంటి వెళ్లేందుకు నామినేషన్స్ జరుగుతున్నాయి. ఈ సారి నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ కొత్తగా ప్లాన్ చేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని లోపలికి పిలిచి.. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసే హక్కు ఇచ్చాడు. అలా హౌజ్ లోకి ముందుగా వచ్చిన ప్రియ సంజనను నామినేట్ చేసి మరో కత్తిని కళ్యాణ్ కి ఇచ్చింది. అతడు రాము రాథోడ్ ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్.. కళ్యాణ్ నామినేట్ చేసి కత్తిని ఇమ్మాన్యుయేల్ కి ఇచ్చాడు. ఇమ్మూ తనూజని నామినేట్ చేశాడు. నెక్ట్స్ వచ్చిన ఫ్లోరా రీతూని నామినేట్ చేసి కత్తిని సుమన్ శెట్టికి ఇవ్వగా అతడు సంజనని, శ్రీజ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసి మరో కత్తిని మాధురికి ఇవ్వగా.. ఆమె రీతూని నామినేట్ చేసింది. ఇదంత నిన్న జరిగింది.

డిమోన్ పొడిచిన శ్రేష్టి వర్మ

ఇక ఇవాళ్లి నామినేషన్ కోసం శ్రేష్టి వర్మ లోపలికి వచ్చింది. హౌజ్ లో అందరికి ఒక క్లారిటీ ఉంది.. కానీ నీకు లేదు. రమ్య మోక్ష అన్నట్టుగానే నీకు బుర్రలేదు అంటుంది శ్రేష్టి. కండ బలం ఉంటే సరిపోతు.. బుద్ది బలం కూడా ఉండాలంటూ డిమోన్ ని నామినేట్ చేసింది. ఆ తర్వాత మరో కత్తిని రాము రాథోడ్ కి ఇవ్వగా అతడు గౌరవ్ ని నామినేట్ చేశాడు. హౌజ్ లో అందరికి ఏం జరుగుతుంది, ఏమౌతుందో తెలుసు. కానీ, నువ్వే భాష రాదని అసలేం పట్టనట్టు ఉంటున్నావ్. ఇప్పటికైనా యాక్టివ్ అయ్యా ఆటలోకి రా అంటూ గౌరవ్ కు కత్తి దింపాడు. ఆ తర్వాత భరణి వచ్చాడు. అతడు రాగానే దివ్య సంతోషంగా వెళ్లి నాన్న అంటూ పట్టుకుంటుంది. కానీ, భరణి అప్పటి ఎమోషన్ మాత్రం చూపించలేదు. అప్పుడే కత్తి తనకు ఇవ్వామని అడిగింది. ఇక నామినేషన్ మొదలు పెట్టిన భరణి సంజనను చేశాడు.


మొత్తం 8 మంది నామినేటేడ్

హౌజ్ లో అందరికి ఒక రూల్ అయితే నీకు ఒక రూల్.. నువ్వు చేస్తే సరదా.. మిగతా వాళ్లు చేస్తే దొంగతనమా అంటూ సంజనపై ఫైర్ అయ్యాడు. మొదటల్లో మీరు స్ట్రాంగ్ లేరు ముందుముందు టాస్క్ లు మరింత సీరియస్ అవుతాయి ఈ ఫిట్ నెస్ ఆడలేరు అంటే బాడీ షేమింగ్ చేశారని ఏడ్చావు. మరి నువ్వు ఎంతమందిని బాడీ షేమింగ్ చేస్తున్నావ్. ఎంతమందిపై నోరు జారుజారుతున్నావు అని ప్రశ్నించాడు. ‘నువ్వు చేస్తే మజాక్.. మిగతా వాళ్లు చేస్తే రజాక్‘. హౌజ్ ఎవరికి రెస్పాక్ట్ ఇవ్వవు.. కనీసం కెప్టెన్ అంటే కూడా వాల్యూ లేదా? అంటూ సంజనపై ప్రశ్నల వర్షం కురిపించాడు భరణి.

ఈ కారణాలతో ఆమెను నామినేట్ చేశాడు. ఆ తర్వాత కత్తిని నిఖిల్ కి ఇచ్చాడు. దీంతో నిఖిల్ తనూజని నామినేట్ చేశాడు. అమ్మాయిని నాకు కెప్టెన్సీ ఇచ్చేయ్ అని ఇమ్మాన్యుయేల్ అడిగావ్ కదా.. ఏ ఆడి గెలిచిన సత్తా లేదా? రేపు బిగ్ బాస్ ట్రోఫీ కూడా అలాగే అడుగుతావా? అంటూ తనూజని నామినేట్ చేశాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నేరుగా మాధురి నామినేట్ అవ్వడంతో ఈ వారం బయటకు వెళ్లే వారిలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. మాధురి, తనూజ, సంజన, రీతూ, డిమోన్ పవన్, కళ్యాణ్ పడాల, రాము రాథోడ్, గౌరవ్ లు ఈ వారం నామినేషన్ నిలిచారు.

Related News

Bigg Boss 9: దివ్య మళ్లీ బంధాన్ని కొనసాగించాలి అని చూస్తుందా? గౌరవ్ గుప్తాతో ఆర్గ్యుమెంట్ అవసరమా?

Bigg Boss 9 : నాన్న మారిపోయాడు.. దివ్యని అవైయిడ్ చేసి తనూజతో.. అసలేం జరిగింది

Bigg Boss 9 day 51: శ్రీజ దెబ్బకు ఏడ్చిన మాధురి.. రీఎంట్రీ లో ట్విస్ట్.. తనూజపై ఇమ్మూ గాసిప్స్

Bigg Boss 9 : బిగ్ బాస్ యాజమాన్యం సంచలన నిర్ణయం, హోస్ట్ గా నాగార్జున ఇక లేనట్లేనా?

Bigg Boss 9 Promo : అన్నా చెల్లి.. ఓ తెలుగు రాని అబ్బాయ్, దివ్య స్మార్ట్ గేమ్ ఆడుతుందా?

Bigg Boss 9 Bharani: హౌస్‌లో భరణికి తీవ్రగాయాలు.. అర్ధరాత్రి హాస్పిటల్‌కు తరలింపు

Bigg Boss 9 Promo : మాధురి vs శ్రీజ… ఆ నోళ్ల మోతను భరించాల్సిందేనా…

Big Stories

×