Bigg Boss 9 Promo : బిగ్ బాస్ సీజన్ 9 చాలా రసవత్తరంగా ఉంది. షో స్టార్టింగ్ కి ముందు నాగార్జున (Nagarjuna ) చెప్పినట్లే ఇందులో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతున్నాయి.. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యాక ఆరు వారాలకు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 6 కంటెస్టెంట్లు హౌస్ లోకి వచ్చారు. అది పక్కన పెడితే తాజాగా ఎలిమినేట్ అయి బయటికి వెళ్లిన ఇద్దరు కంటెస్టెంట్లను మళ్ళీ హౌస్ లోకి తీసుకువస్తున్నారు. అలా ఇప్పటికే ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన వారిని మళ్లీ హౌస్ లోకి రప్పించి ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న వారిని నామినేట్ చేయించడంతోపాటు మరో ఇద్దరినీ హౌస్ లోకి తీసుకువచ్చారు వాళ్లే భరణి, దమ్ము శ్రీజ.. ఇక భరణి విషయం అటుంచితే.. దమ్ము శ్రీజ వచ్చిందంటే అంత దుమ్ము దుమ్మే. ఎందుకంటే ఇప్పటికే ఏదైనా ఇష్యూ అయితే హౌస్ మొత్తం దద్దరిళ్లేలా మాట్లాడే మాధురి ఉంది. ఈమెకి తోడు శ్రీజ కూడా హౌస్ లోకి వచ్చిందంటే వీరిద్దరి మధ్య ఏదైనా చిన్న ఆర్గ్యూ వస్తే ఇక హౌస్ అంతా దద్దరిల్లాల్సిందే.
అందులో భాగంగానే.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు..ఈ ప్రోమోలో దమ్ము శ్రీజ, భరణి ఇద్దరు రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీలో వచ్చిన శ్రీజ, భరణిలు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరి చేసుకోవాలని బిగ్ బాస్ చెపుతారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వచ్చి శ్రీజ, భరణిలకి ఏ విషయం సరి చేసుకోవాలి అనేది మిర్రర్ పై రాసి సజేషన్ ఇవ్వాలని బిగ్ బాస్ చెబుతారు. అలా మొదట ఇమ్మానుయేల్ వచ్చి శ్రీజని ఏదైనా గొడవ వస్తే ఆర్గ్యూ చేయడం మంచిదే కానీ మరీ దాని లాగకూడదని ఒక సజేషన్ ఇచ్చారు.ఆ తర్వాత డిమోన్ పవన్ వచ్చి భరణికి ట్రస్ట్ గురించి చెబుతూ మీ మీద ఇప్పటికే నాకు ట్రస్ట్ పోయింది.మళ్లీ మిమ్మల్ని నమ్మాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తుందని తన పాయింట్ చెప్పడంతో భరణికి కోపం వచ్చి నమ్మడం, నమ్మకపోవడం నీ ఇష్టం అది నీ పర్సనల్ పాయింట్ అని షాక్ ఇచ్చారు. ఆ తర్వాత మాధురి వచ్చి శ్రీజ కి మైండ్ యువర్ వర్డ్స్ అనే పాయింట్ ని మిర్రర్ పై రాసి చూపించింది.
ఈ సజేషన్ మాధురి.. శ్రీజకి ఇవ్వడం కాస్త హాస్యాస్పదమే. ఎందుకంటే ఈ పాయింట్ చెప్పడానికి అసలు మాధురి అర్హురాలు కాదు. ఎందుకంటే మాధురి నోటికి ఏది వస్తే అది వాగుతుందనే వాదన ఈమె హౌస్ లోకి వచ్చినప్పటి నుండే ఉంది.అలాంటి పాయింట్ ని శ్రీజకి మాధురి ఇవ్వడం నిజంగా కామెడీగానే ఉంది అని ఈ ప్రోమో చూసిన జనాలు కామెంట్లు పెడుతున్నారు. ఇక మాధురి చెప్పిన పాయింట్ కి శ్రీజ ఇచ్చి పడేసింది.. నేను ఎప్పుడైనా సరే నోటికి ఏది వస్తే అది మాట్లాడను.. మీరు మాట్లాడినట్టు నేను ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. మీరు ఇచ్చిన సజేషన్ ని నేను యాక్సెప్ట్ చేయను అంటూ శ్రీజ షాక్ ఇచ్చింది.ఇక శ్రీజ మాటలకి మాధురి కోపంతో మిర్రర్ అక్కడ పెట్టేసి సైలెంట్ గా వెళ్ళిపోయింది. అయితే ఈ ప్రోమో చూస్తుంటే మాత్రం ఇక హౌస్లో రచ్చ మొదలైనట్టే అర్థం చేసుకోవాలి.
హౌస్ లోకి ఎంటర్ అవ్వడంతోనే మాధురి – శ్రీజల మధ్య గొడవ జరిగిందంటే ఇక పోను పోను హౌస్ మొత్తం దద్దరిల్లుతుంది. ఇద్దరు ఏదైనా ఇష్యూ వస్తే గట్టిగా అరుస్తారు. గయ్యాలిలా ప్రవర్తిస్తారు. ఏదైనా ఆర్గ్యూ చేయాల్సి వస్తే ఇద్దరిలో ఎవరు కూడా వాయిస్ కంట్రోల్ లో పెట్టుకోరు. అలాంటిది హౌస్ లో వీరిద్దరికే గొడవ వస్తే ఎలా ఉంటుంది అనేది ముందు ముందు మనం చూడవచ్చు. వీరి మధ్య వచ్చే గొడవలకు వీరు అరిచే అరుపులకు హౌస్ మొత్తం దద్దరిల్లుతుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల కర్ణభేరీలు పగలాల్సిందే అంటూ ప్రోమో చూసిన నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఇప్పటివరకు మాధురి ఎంత అరిచినా కూడా నాగార్జున ఎంతో కొంత సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు మరొక సౌండ్ బాక్స్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక నాగార్జున పరిస్థితి ఏంటో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి చూడాలి బిగ్ బాస్ 9 శ్రీజ vs మాధురి ల రచ్చ ఎలా ఉంటుందో.
ALSO READ:Tejaswi Madivada: బఠానీలు అమ్మినట్లు శృం*రం అమ్ముతారు.. తేజస్వి బోల్డ్ కామెంట్స్