Bigg Boss 9 : తెలుగులో బిగ్ బాస్ మొదట సీజన్ మొదలైనప్పుడు చాలామందికి విపరీతమైన ఆసక్తి నెలకొనేది. అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన మొదటి సీజన్ బాగా పాపులర్ అయింది. ఎక్కువ శాతం మంది తెలిసిన సెలబ్రిటీలు కూడా దానికి రావడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ చేశారు. నాని కూడా షో నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు.
ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. 9 సీజన్స్ గడుస్తున్న కూడా యాంకర్ ను మాత్రం మార్చలేదు. ఈ షో కి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఇకపై అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరగకుండా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు.
బిగ్ బాస్ షో ను ఎండమోల్ అనే ఒక సంస్థ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్త ఇప్పుడు ఒక కొత్త స్టూడియో ను ప్రారంభించినట్లు సమాచారం వినిపిస్తుంది. స్టూడియో సంషాబాద్ దగ్గరలో ఉంది. ఈ స్టూడియో పూర్తి అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 అక్కడే జరగబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
అన్నపూర్ణ స్టూడియోలో జరగవలసిన షూటింగ్ అక్కడ జరుగుతుంది కాబట్టి దీనిని బట్టి హోస్ట్ ను మార్చేసే అవకాశం ఉంది అనేది విశ్వసినీయా వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. అక్కడ తెలుగు మరియు కన్నడ షో షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తుంది. కానీ ఇదంతా ఇప్పుడు కాదు నెక్స్ట్ సీజన్.
బిగ్ బాస్ సీజన్ చేసి నాగార్జున కూడా బాగా అలవాటైపోయారు. కొన్ని విషయాల్లో నాగార్జున మాట్లాడే తీరు అమితంగా ఆకట్టుకుంటుంది. మరికొన్ని విషయాల్లో నాగార్జున జడ్జిమెంట్ అనేది వీక్షకులు జడ్జిమెంట్తో సరితూగదు. అటువంటి టైంలోనే హోస్ట్ మీద కూడా విమర్శలు వస్తాయి.
గత కొన్ని వారాలుగా నాగార్జున మీద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అలానే బిగ్ బాస్ యాజమాన్యం సరిగ్గా షోను నిర్వహించడం లేదు అనేది కూడా కొంతమేరకు వినిపిస్తున్న కామెంట్స్. కొంతమందికి చాలా ఫేవర్ గా ఈ షో జరుగుతుంది అని ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా బహుశా బిగ్ బాస్ యాజమాన్యం దృష్టికి చేరి ఉంటాయి. అందువల్లనే ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అనేది కొంతమంది చెబుతున్న అభిప్రాయం. అయితే దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు త్వరలో వస్తుంది. దీనిపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి.
Also Read: Bison: బైసన్ సినిమాపై ముఖ్యమంత్రి ప్రశంసలు, తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి