Bharani Injured in BB9 House: హౌజ్లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎలిమినేట్ అయిన వారిలో ఇద్దరిని మళ్లీ హౌజ్లోకి తీసుకువస్తున్నారు. వారిలో శ్రీజ, భరణి పేర్లు గట్టిగా వినిపించాయి. అయితే విరీద్దరి రీఎంట్రీ కన్ఫాం అయ్యింది. హౌజ్లోకి కూడా రీఎంట్రీ ఇచ్చేశారు. అయితే తిరిగి వచ్చిన వారు ఎంతవరకు అర్హులో తేల్చేందుకు బిగ్ బాస్ వారికి టాస్క్లు పెట్టాడు. రెండు లెవెల్లో జరిగిన ఈ టాస్క్లో ఒక లెవెల్లో రోప్ పుల్లింగ్ టాస్క్ పెట్టారట. భరణి, శ్రీజలకు రోప్ పుల్లింగ్ టాస్క్ పెట్టగా వారికి హౌజ్లోని ఇద్దరు ఇద్దరు కంటెస్టెంట్స్ సపోర్టు చేయాలి.
మొదట భరణికి ఇమ్మాన్యుయేల్, గౌరవ్లు సపోర్టు చేశారు. శ్రీజకు డిమోన్, నిఖిల్ సపోర్టు చేశారట. ఈ టాస్ ఫుల్ ఫిజికల్ అవ్వడంతో భరణి తీవ్రంగా గాయపడ్డాడట. టాస్క్లో రెజ్లింగ్ రేంజ్లో జరిగిన ఈ రోప్ పుల్లింగ్ టాస్క్లో భరణి స్విమ్మింగ్ పూల్లో పడ్డాడట. ఈ టాస్క్లో తీవ్రంగా గాయపడ్డ భరణిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి రెండు గంటలకు మెయిన్ గేట్ నుంచి భరణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారట. భరణి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో రీ ఎంట్రీతో మళ్లీ హౌజ్లో వస్తున్నాడని తెలిసి భరణి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ, ఈ గాయం వల్ల అతడి రీఎంట్రీ ఉండటమే కష్టమే అంటున్నారు.
గాయాలు ఎక్కువ తగడం వల్ల అతడికి విశ్రాంతి తప్పనిసరి. మరి భరణి రీఎంట్రీ ఉంటుందా? ఉండదా? అనేది నేటి ఎపిసోడ్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భరణితో పాటు ఈ టాస్క్లో ఆడిన అందరికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. భరణి కోసం రంగంలోకి దిగిన ఇమ్మాన్యుయేల్.. గాయాలు అవ్వడంతో ఆడలేనని చెప్పి టాస్క్ మధ్యలోనే వెళ్లిపోయాడు. దీంతో ఇమ్మూ స్థానంలోకి రాము రాథోడ్ వచ్చి భరణి కోసం ఆడాట. ఈ టాస్క్లో పాల్గొన్న డిమోన్, గౌరవ్, రాము, నిఖిల్లకు కూగా గాయాలు అయినట్టు తెలుస్తోంది. కాగా సీరియల్స్ మంచి గుర్తింపు పొందిన భరణి సినిమాల్లో పలు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. బుల్లితెరపై విలనిజం చూపించిన ఆయన.. బిగ్ బాస్ హౌజ్లో ౠట ఎలా ఉంటుందో అని ఆడియన్స్ అంత ఆసక్తి చూపించారు.
Also Read: Mahhi Vij Divorce: విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్.. 14 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి!
ఆయన ఎంట్రీ కూడా ఓ రేంజ్లో ఇచ్చారు. కానీ, హౌజ్లోకి వచ్చాక అందరితో రిలేషన్స్ పెంచుకుంటూ ఒక్కొరికి తన ఆటను త్యాగం చేస్తూ వచ్చారు. అలా ఫైనల్గా ఆరో వారంలో నామినేషన్లో నిలిచి ఎలిమినేట్ అయ్యి హౌజ్ని విడాడు. ఇక నిన్న నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ తిరిగి హౌజ్ లోకి పిలిచారు. అలా వచ్చిన భరణి.. సంజనను నామినేట్ చేశారు. తను అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే ఒకలా టైం బట్టి మనుషులను ఉంటుందంటూ సంజనపై ఫైర్ అయ్యారు. హౌజ్లో తను చేస్తే ఒకరూల్.. ఎదుటి వాళ్లు చేస్తూ తప్పు అన్నట్టు ఉంటుందని, ఈజీ నోరు జారుతుందని ఆమెను నామినేట్ చేశాడు. నామినేషన్ ప్రక్రియ ముగిశాక.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ శ్రీజ, భరణిలను హౌజ్లోకి రీఎంట్రీ ఇప్పించారు. కానీ, హౌజ్లోకి అడుగుపెట్టగానే ఇలా భరణి గాయంతో మళ్లీ హౌజ్కి దూరం అవ్వడంతో ఫ్యాన్స్ని బాధిస్తోంది.