Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ కు శ్రీజ దమ్ము మరియు భరణి రీ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒక్కరు మాత్రమే హౌస్ లో ఉంటారు అని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే వాళ్ళిద్దరిలో మార్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ఆల్రెడీ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ ను అడిగారు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క పాయింట్ చెప్పారు. భరణి విషయన్ని ప్రస్తావిస్తూ మనం ఒక టాస్క్ ఆడం అది ఫిజికల్ టాస్క్ తో పాటు మెంటల్ టాస్కు కూడా సంబంధించింది. ఆ విషయంలో మీరు నాకు ఎందుకో ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించారు అని గౌరవ గుప్తా పాయింట్ భరణికి చెప్పాడు. భరణి కొంత సేపు డిపెండ్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేశాడు.
అయితే దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఆర్గ్యుమెంట్ అయిపోయే టైంకి మళ్లీ కిచెన్ దగ్గర అది టీం కు సంబంధించిన టాస్క్ అంటూ దివ్య గౌరవగుప్తతో ఆర్గుమెంట్ కి దిగింది. దివ్య మొత్తం మాట్లాడిన తర్వాత అయిపోయిందా అని అడిగాడు గౌరవ్. నీకు అర్థమైతే నువ్వు మాట్లాడు అందు దివ్య. మొత్తం అర్థమైంది అంటూ అనవసరంగా ఎందుకు? అంటూ గౌరవ్ నేను మొదట స్టార్ట్ చేయలేదు అని క్లారిటీ కూడా ఇచ్చాడు.
నేను ఆల్రెడీ గౌరవ గుప్తా తో మాట్లాడాను. నేను ఇవ్వాల్సింది గట్టిగా ఇచ్చాను. ఇది కొంచెం అర్థమయ్యేటట్లు దివ్య కి చెప్పు అని భరణి తనుజాతో అన్నాడు. ఇది నేను చెప్పడం కంటే కూడా మీరు చెప్పడం ఇంకా బాగుంటుంది అని తనుజ భరణితో చెప్పింది. ఒకవేళ నేను చెప్పినా కూడా అది మళ్లీ నాకే బ్యాడ్ అవుతుంది తను ఎందుకు స్టాండ్ తీసుకుంటుంది అని అంటారు.
మొత్తానికి భరణి కూడా దివ్య అని పిలిచి ఈ విషయాన్ని అడిగాడు. ఇది మీకు అసలు సంబంధంలేని విషయం మీరు కెప్టెన్ కాదు ఆ టాస్క్. వాడికి ఏమీ అర్థం కాలేదు అందుకే నా పాయింట్ నేను చెప్పాను. మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ప్రతి సిచువేషన్ నుంచి నేను తప్పించుకోలేను. నా పాయింట్ కూడా నేను చెప్పాలి కదా. భరణి గారు ఉన్నారు మళ్లీ బాండ్ అనుకుంటారు అని నేను పారిపోనా చెప్పండి అంటూ తిరిగి క్వశ్చన్ చేసింది.
Also Read: Bigg Boss 9 : నాన్న మారిపోయాడు.. దివ్యని అవైయిడ్ చేసి తనూజతో.. అసలేం జరిగింది