BigTV English

Thanuja: కన్నింగ్ కు కేర్ అఫ్ అడ్రస్, మరి ఇంతలా నటించాలా?

Thanuja: కన్నింగ్ కు కేర్ అఫ్ అడ్రస్, మరి ఇంతలా నటించాలా?
Advertisement

Thanuja: తెలుగు బిగ్ బాస్ సీజన్ కు ప్రేక్షకులు విపరీతంగా అలవాటు పడిపోయారు. కొంతమంది జీవితంలో బిగ్ బాస్ అనేది కూడా ఒక భాగం అయిపోయింది. ఇంట్లో ఆడవాళ్లు సీరియల్ కు ఎలా అయితే ఎడిట్ అయిపోతారు చాలామంది వీక్షకులు బిగ్ బాస్ అనే షో కు కూడా ఎడిట్ అయిపోయారు. ఈ షో మొదలై ఇప్పటికీ ఆరు వారాల పూర్తయిపోయింది. సక్సెస్ఫుల్ గా 7వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేశారు.


ఎవరు ఊహించని విధంగా ఈ షోలో ఎన్నో సంచలనమైన ఎలిమినేషన్లు జరిగాయి. ఎవరైతే బాగా ఆడి ఫైనల్ వరకు వెళతారు అని ఊహించామో వాళ్లే ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. అందులో అందరినీ షాకింగ్ కి గురిచేసిన ఎలిమినేషన్స్ శ్రీజ మరియు భరణిది. భరణి బంధాల మధ్య నలిగిపోయి సరిగ్గా గేమ్ ఆడలేదు అనే కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా తనుజ వల్లనే తన గేమ్ పోయింది అనేది కొంతమంది అభిప్రాయం.

కన్నింగ్ కు కేరాఫ్ అడ్రస్ 

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనుజ కొంత మేరకు హౌస్ లో నటిస్తుంది అనేది చూసేవాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. తనుజ కి కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉండొచ్చు. వాళ్లు ఈ విషయాలను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ సరిగ్గా గమనిస్తే తనుజ రంగులను మనం పసిగట్టవచ్చు.


వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మాధురి రాగానే శ్రీజ తో గొడవ పెట్టుకుంది. కేవలం పేరు గురించే వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ అప్పుడు జరిగింది. ఆ తరువాత తనుజ ఇమ్మానుయేల్ దగ్గరికి వెళ్లి యాంగ్రీ బర్డ్ ఆ అని అడిగింది. ఏమో నాకు తెలియదు అని ఇమ్మానియేల్ కూడా తెలివిగా తప్పించుకున్నాడు.

ఆ వెంటనే తనూజ క్యూట్ ఎమోషనల్ బాండ్ మాధురి తో జరిపి రాత్రిపూట తనతో కలిసి పడుకునేది. ఒకరోజు మాధురితో కళ్యాణ్ కి గొడవ జరిగింది. ఏదో పంచాయతీ తీర్చే దానిలాగా కళ్యాణ్ ఇటు రా అని కిచెన్ దగ్గరికి పిలిచి మరీ ఆ టాపిక్ మళ్ళీ ప్రస్తావించింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఆర్గ్యుమెంట్ మొదలైంది.

ఇంతలా నటించాలా? 

తనుజ గురించి మాధురి దగ్గర సంజన ప్రస్తావిస్తూ ఆ అమ్మాయి చాలా క్యూట్ గా నటిస్తుంది. సీరియల్ యాక్టర్స్ కదా అందుకే. ఎవరు నటిస్తున్నారో మాకు ఈజీగా అర్థమయిపోతుంది. అంటూ మాధురితో చెప్పింది. మాధురి మాత్రం నాకు జెన్యూన్ అనిపిస్తుంది అని సంజనాకు సమాధానం ఇచ్చింది.

ఒక సందర్భంలో భరణితో మాధురి మిమ్మల్ని నామినేట్ చేస్తాను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఎందుకు అని భరణి అడిగాడు. తనుజా ను కూతురు అని, దివ్యాను చెల్లి అని బాండింగ్ అనగానే, రాజు ఎందుకు అని తనుజ వచ్చి మాధురి చేతులు పట్టుకుని మరి నటించింది. ఇలాంటి ఉదాహరణలు తనుజ విషయంలో చాలా ఉన్నాయి. ఇప్పటికైనా స్ట్రాంగ్ గా నిలబడి గేమ్ ఆడితే బాగుంటుంది అనేది చాలామంది ఒపీనియన్.

Also Read: Emmanuel: నమ్మించి మోసం చేసిన ఇమ్మానుయేల్, నెగెటివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం

Related News

Bigg Boss 9 Promo: విశ్వరూపం చూపించిన తనూజ.. విజిలేసి మరి రమ్య, మాధురికి ఇచ్చిపడేసింది..

Bigg Boss 9 Winner: విన్నర్ ఎవరో చెప్పేసిన హైపర్ ఆది.. ఈసారి టైటిల్ ఆమెదే, టాప్ 5లో రీతూ పక్కా!

Bigg Boss 9 Promo: తనూజ దెబ్బకు పచ్చళ్ళ పాప సైలెంట్.. గట్టిగా ఇచ్చిందిగా!

Bigg Boss 9 Promo: ఆయేషా వర్సెస్ రీతూ.. మరీ ఇంత ఆటిట్యూడ్ అయితే ఎలా?

Thanuja: సిగ్గు లేదా తనుజా.. క్యారెక్టర్ తక్కువ చేసినా కూడా మళ్లీ మాట్లాడుతున్నావ్

Bigg Boss 9: ఫ్యామిలీ మెసేజ్, టెన్షన్ పడ్డ సంజన, ఆది కామెంట్స్ కి మొహం మాడ్చిన ఆయేషా

Bigg Boss Buzz: మనకి బంధాల అవసరమా, భరణికి మరోసారి క్లాస్ పీకిన శివాజీ

Big Stories

×