Hyper Aadi on Bigg Boss Title Winner: ప్రస్తుతం బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి డబుల్ హౌజ్, ఊహించని మలుపులతో రణరంగమే అంటూ ఈ సీజన్ లాంచ్ చేశారు. మొదటి చప్పగా ఉన్న ఈ షో ఇప్పుడు ఫుల్ స్పైసీ అయ్యిందంటున్నారు. కుటుంబం సీరియల్ గా సాగుతున్న బిగ్ బాస్ ని వైల్డ్ కార్డ్స్ అమాంతం లేపేశారు. ముఖ్యంగా మాధురి, ఆయేషా, రమ్య రాకలతో హౌజ్ రణరంగంగా మారింది. హౌజ్ లో ఎప్పుడు యే గొడవలు అవుతాయి.. ఎవరేవరికి వార్ జరుగుతుందనేది ఊహించలేకపోతున్నారు. అంతేకాదు ఎలిమినేట్ ఎవరూ అవుతారనేది కూడా చెప్పడం కష్టంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ సీజన్ విన్నర్ ఎవరనేది మరింత సస్పెన్స్ నెలకొంది.
ఇప్పటి వరకు సాగిన ఎపిసోడ్స్ చూస్తుంటే టైటిల్ గెలిచేందుకు ఎవరూ అర్హులు అనేది చెప్పలేకపోతున్నారు. కొంతమంది పేర్లు వినిపిస్తున్నా.. అవి ఖచ్చితం అనేది మాత్రం చెప్పలేం. అలాంటి ఈ షోకి నిన్న దీపావళి ఎపిసోడ్ సందర్భంగా జబర్దస్త్ ఫేం, కమెడియన్ హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు. ఎప్పటిలాగే ఆది ఉన్నంతసేపు ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. హౌజ్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఫుల్ నవ్వుకున్నారు. అయితే ఆది ఎప్పుడు వచ్చిన.. ఈ సీజన్ కి సంబంధించి కీలకమైన క్లూ వదిలి వెళుతుంటాడు. ఈసారి కూడా ఈ సీజన్ ఎవరనేది మాటల్లోనే హింట్ ఇచ్చి వెళ్లాడు. పాపరాయుడిగా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన ఆది కంటెస్టెంట్స్ ని కడిపాడేశాడు. ఎవరి ఆట ఎలా ఉంది.. ఎలా ఆడాలి.. ఎలా ఆడకుడదో తనదైన స్టైల్లో వివరిస్తూ పంచ్ లు వేశాడు.
ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఆయేషాకి ఇచ్చిన కౌంటర్ నెక్ట్స్ లెవెల్ అంటున్నారు ఆమె యాంటీ ఫ్యాన్స్. గత రెండు సీజన్లుగా వరుసగా హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజ్ పై అలరిస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి ఎపిసోడ్ లో అతడి అప్పియరెన్స్ పక్కా. అలా బిగ్ బాస్ స్టేజ్ కి వచ్చినప్పుడల్లా ఆది ఏదోక కీలక అప్డేట్ ఇచ్చి వెళుతుంటాడు. ఈసారి కూడా బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో హింట్ ఇచ్చాడు. అందరు కంటెస్టెంట్స్ కి తమ ఆట తీరు వివరిస్తూ.. వారి తప్పులు వదిలేస్తే.. మంచి మంచి ఆటగాడిగా ఆడియన్స్ మనుస్సుల్లో నిలుస్తారంటూ సూచనలు ఇచ్చాడు. ఇలా సంజన, రాము రాథోడ్, ఇమ్మాన్యుయేల్ మళ్లీ బ్యాక్ వచ్చిన తమ ఆట మెరుగుపరుచుకోవాలని చెప్పాడు. డిమోన్ స్ట్రాంగ్ ప్లేయర్ అని, కానీ, ఆట ఎక్కడో మర్చిపోతున్నావు అన్నాడు. ఆ తర్వాత ఎవరిపై ఆధారపడకుండ నీ ఆటని నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటావని రీతూకి చెప్పాడు. అలాగే టాప్ 5 సుమన్ ఖచ్చితంగా ఉంటాడని తేల్చాడు.
Also Read: Bigg Boss 9: ఫ్యామిలీ మెసేజ్, టెన్షన్ పడ్డ సంజన, ఆది కామెంట్స్ కి మొహం మాడ్చిన ఆయేషా
అందరికి టాప్ 5, బెస్ట్ ప్లేయర్ అంటూ సూచన చేసిన ఆది.. ఒక్క తనూజకి మాత్రం టైటిల్ గెలుస్తావంటూ సజేషన్ ఇచ్చాడు. ఎవరో వచ్చిన నీన్ను కాపాడుతారని ఎదురుచూడకుండా.. నీ ఆటని నువ్వు కాపాడకునే గేమ్ ఆడితే లేడీ విన్నర్ కూడా గెలిచే ఛాన్స్ ఉంది. హ్యాపీగా ఆడు అంటూ తనూజకి చెప్పాడు. అందరికి టాప్ 5 ప్లేయర్ అవుతారని, స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ ప్రశంసించిన ఆది ఒక్క తనూజ దగ్గర మాత్రమే టైటిల్ గెలుస్తావని చెప్పడం చూస్తే.. ఈ సీజన్ విన్నర్ ఆమెనా? అని అంత అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు బిగ్ బాస్ 9 విన్నర్ ని ఆది ఇలా హింట్ ఇచ్చాడని, అయితే ఈ సీజన్ టైటిల్ తనూజదే సందేహిస్తున్నారు. కాగా తనూజకి కూడా బయట మంచి పాజిటివ్ టాక్.. కాస్తా దురుసు ప్రవర్తన ఉన్న సమయాన్ని బట్టి తగ్గుతుందని, హౌజ్ మేట్స్ అందరితోనూ మాట్లాడుతూ గొడవలు, వివాదాలకు దూరంగా ఉంటుంది. అలాగే ఆటలోనూ వందశాతం ఎఫర్ట్స్ పెడుతూ.. గట్టి కాంపిటేషన్ ఇస్తుంది.