Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ 8లో మరొక వీకెండ్ ఎపిసోడ్ మొదలుకానుంది. అయితే ఇందులో డబుల్ ట్విస్ట్‌తో కంటెస్టెంట్స్‌కు షాకిచ్చారు నాగార్జున. ప్రస్తుతం ఫైనల్స్‌కు చేరుకోవడానికి చాలామంది కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉండడంతో ఈవారం సింగిల్ కాదు డబుల్ ఎలిమినేషన్ అని నాగ్ రాగానే ప్రకటించారు. దీంతో కంటెస్టెంట్స్‌లో టెన్షన్ మొదలయ్యింది. ఆ టెన్షన్‌ను మరింత పెంచడం కోసం వారి మధ్య మనస్పర్థలు పెరిగే ఆటలు ఆడించారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇందులో కంటెస్టెంట్స్ అంతా తాము కాకుండా విన్నర్ అవ్వగలిగే దమ్ము ఎవరికి ఉందో బయటపెట్టారు. ఈ క్రమంలో టేస్టీ తేజ దుమ్ములో కలిసిపోయాడు.
గట్టి పోటీ
‘‘ఫినాలేలో విన్నర్ ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఆ ఫినాలేకు చేరకుండా దుమ్ము దుమ్ముగా అయిపోయే ప్లేయర్ ఎవరు?’’ అని కంటెస్టెంట్స్‌ను నాగార్జున అడగడంతో బిగ్ బాస్ 8 లేటెస్ట్ ప్రోమో ప్రారంభమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నబీల్ ముందుకొచ్చాడు. దమ్ము ట్యాగ్‌ను నిఖిల్‌కు ఇచ్చాడు. ‘‘నా తర్వాత నిఖిల్ అని ఎప్పుడో అనుకున్నాను. స్టార్టింగ్ నుండి టాస్కుల్లో గట్టి పోటీ ఇస్తున్నాడు’’ అని నబీల్ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రోహిణి వచ్చి దమ్ము ట్యాగ్‌ను గౌతమ్‌కు ఇచ్చింది. ఫినాలేకు చేరకుండా దుమ్ము అయిపోయేది ఎవరు అంటే ప్రేరణ పేరు చెప్పింది.
Also Read: ఇండస్ట్రీలో మరో విషాదం.. రతిక రోజ్ తండ్రి మృతి..!
రూల్స్ అతిక్రమించాడు
టేస్టీ తేజకు అవకాశం రాగానే దుమ్ము స్టిక్కర్‌ను విష్ణుప్రియాకు అతికించాడు. పృథ్వి ఏమో అదే స్టిక్కర్‌ను టేస్టీ తేజకు అతికించాడు. కేవలం టాస్క్ పరంగానే ఈ అభిప్రాయం చెప్తున్నట్టు అన్నాడు. ఆ తర్వాత వచ్చిన గౌతమ్.. ప్రేరణకు దుమ్ము స్టిక్కర్ అతికించాడు. ‘‘చాలా సందర్భాల్లో తను మాటలు జారింది. నా ఉద్దేశ్యంలో అది తప్పు’’ అని కారణం చెప్పాడు. ఆపై వచ్చిన అవినాష్.. దుమ్ము స్టిక్కర్‌ను పృథ్వికి అతికించాడు. ‘‘రూల్స్ బ్రేక్ చేయకుండా బాగా ఆడితే బాగుంటుంది. నామినేషన్స్ పాయింట్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం’’ అని చెప్పుకొచ్చాడు అవినాష్. ఆ తర్వాత చాలావరకు దుమ్ము స్టిక్కర్స్ తేజకే వచ్చాయి.
కంటెంట్ క్రియేటర్
టేస్టీ తేజకు దుమ్ము స్టిక్కర్ అతికించిన ప్రేరణ.. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ‘‘అవసరం లేని సందర్భాల్లో కంటెంట్ క్రియేట్ చేయాలని చూస్తాడు. ఇది ఆడియన్స్ కనిపెట్టేస్తే ఫినాలేకు రారనుకుంటాను’’ అని నమ్మకంగా చెప్పింది. ఆ తర్వాత విష్ణుప్రియాకు కూడా తేజకే దుమ్ము స్టిక్కర్ అంటించి ఇద్దరితో మాత్రమే మాట్లాడతాడు అని కారణం చెప్పింది. ‘‘గౌతమ్‌తో బాగానే ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఎందుకు సెలక్ట్ చేయలేదు అని అడిగాడు’’ అని గుర్తుచేశారు నాగార్జున. ‘‘నాకు తప్పు అనిపిస్తే ఎవరినైనా అడుగుతాను. ఆ విషయంలో నాకు పర్సనల్‌గా ఇబ్బంది అనిపించి ప్రశ్నించాను. గౌతమ్ చేసిందేంటో తన మనస్సాక్షికి తెలుసు’’ అని పొగరుగా సమాధానమిచ్చాడు తేజ.