Rathika Rose father Passes away.. సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అందరిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నిన్న సాయంత్రం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తండ్రి మరణించారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇండస్ట్రీ మొత్తం ఈ షాక్ లో ఉండగా.. ఇప్పుడు మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ బ్యూటీ రతిక రోజ్ (Rathika Rose)తండ్రి కూడా మరణించారు. ఇక ఈ విషయం తెలిసి బిగ్ బాస్ అభిమానులు సైతం విచారణ వ్యక్తం చేస్తున్నారు.
రతిక రోజ్ తండ్రి మరణం..
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ రతిక రోజ్ తండ్రి రాములు (Ramulu)మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ, విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి రతిక కుటుంబాన్ని పరామర్శించి, రాములు మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాములుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ కూడా ఇచ్చారు.
గ్రామ సర్పంచ్ గా రాములు..
ఇకపోతే రతిక తండ్రి రాములు రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం జనగాం గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ఇక రాములు మరణంతో గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ గ్రామానికి అన్ని రకాల అవసరాలు తీర్చారని, ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు అని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే రతిక తండ్రి మరణంతో పలువురి సినీ సెలబ్రిటీలు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో పాటు బిగ్ బాస్ అభిమానులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా రాములు మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.
రతిక రోజ్ కెరియర్:
సినిమా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. కానీ సక్సెస్ కాలేక పోయింది. దాంతో బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన తర్వాత భారీ పాపులారిటీ లభించింది. కానీ బిగ్ బాస్ ద్వారా ఇమేజ్ కి డామేజ్ కలిగింది. పైగా రతిక క్యారెక్టర్ పై మచ్చ కూడా పడింది. అలా ఏడో సీజన్లో బిగ్ బాస్ లో రతిక విలన్ అయిపోయింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో నెగిటివిటీ వచ్చిన ఈమెకు క్రేజ్ మాత్రం బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక రెండోసారి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లి అందర్నీ అల్లాడించింది. ఇక ఈమె ఎవరో కాదు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి మాజీ లవర్ కూడా.. కానీ ఎందుకో విడిపోయారు..? ఏ కారణం చేత విడిపోయారు? అనే విషయాలు మాత్రం బయటపడలేదు. మొత్తానికైతే రతిక రోజ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడానికి ఇప్పుడు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి రతిక అందానికి అభిమానులు మంత్రముగ్ధులవుతూ ఉంటారు. మరి ఇప్పటికైనా ఈమె నటనను మించి అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.