BigTV English

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Anchor Ravi: యాంకర్ రవి (Anchor Ravi)పరిచయం అవసరం లేని పేరు. కెరియర్ మొదట్లో మ్యూజిక్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈయన అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు . ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈయన బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss 5)కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని దాదాపు 12 వారాలపాటు హౌస్ లో కొనసాగారు. అయితే ఉద్దేశపూర్వకంగానే రవిని ఎలిమినేట్ చేశారంటూ అప్పట్లో ఆయన అభిమానులు నాగార్జున(Nagarjuna) పై విమర్శలు చేయటమే కాకుండా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.


ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్న రవి…

ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత చాలామంది పాజిటివ్ ఒపీనియన్ తో బయటకు రాగా, మరికొంత మంది ఉన్న పేరుని కాస్త చెడగొట్టుకుని బయటకు వస్తారు. ఇక ఈ కార్యక్రమంలోకి వెళ్లిన తర్వాత రవి ఇమేజ్ కాస్త డామేజ్ అయిందని చెప్పాలి. ఇక బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎప్పుడు మాట్లాడిన కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి కారణం అయ్యేలా ఉన్నాయని చెప్పాలి. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ మొదటి నాలుగు సీజన్లు కూడా అవకాశం ఇచ్చారు కానీ నాకు వెళ్లడం ఇష్టం లేదని తెలిపారు.


బిగ్ బాస్ రియల్ కాదా?

ఇక ఐదో సీజన్లో కూడా అవకాశం ఇస్తే ఎక్కువ రెమ్యూనరేషన్ (Remuneration)డిమాండ్ చేసి ఈ ఛాన్స్ మిస్ చేసుకోవాలనుకున్నాను కానీ వారు నేను అడిగిన దానికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అందుకే హౌస్ లోకి వెళ్ళానని తెలిపారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం అంత రియల్ అనుకుంటారు కానీ అక్కడ ఒక డైరెక్టర్ పదిమంది రైటర్స్ ఉంటారని వాళ్ళు ఎప్పుడు ఏం చెబితే అలాగే చేయాలని అసలు విషయం బయట పెట్టారు. మనం కాదని వాదిస్తే అగ్రిమెంట్ చూయించి బ్లాక్మెయిల్ చేస్తారని రవి తెలిపారు. బిగ్ బాస్ కార్యక్రమం రియల్ అని ఎవరైనా అంటే వారిని చెప్పుతో కొట్టాలి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు…

ఇలా బిగ్ బాస్ గురించి రవి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే బిగ్ బాస్ ద్వారా తనకు డబ్బులు కూడా బాగా వచ్చాయని ఆ డబ్బుతో నేను ఇల్లు కొన్నానని తెలిపారు. కానీ బిగ్ బాస్ వెళ్లిన తర్వాత జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. బిగ్ బాస్ కార్యక్రమంలో అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియదు కానీ ప్రోమోల ద్వారా మన క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని, కొంతమంది రివ్యూలు చెప్పే వాళ్ళు కూడా నా వ్యక్తిగత జీవితాన్ని, నా కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారని బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read: Thammareddy: చిరు  రెమ్యూనరేషన్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్… సంపాదన కంటే ఎక్కువంటూ!

Related News

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×