BigTV English

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Deepthi Sunaina: దీప్తి సునయన( Deepthi Sunaina) పరిచయం అవసరం లేని పేరు. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంతో ఫేమస్ అయిన ఈమె అనంతరం షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసే అవకాశాలను అందుకున్నారు. వెబ్ సిరీస్ ల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునయనకు బిగ్ బాస్(Bigg Boss) అవకాశం లభించింది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా తనని తాను నిరూపించుకుంటూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన వీడియోలను అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.


బిజినెస్ రంగంలోకి దీప్తి సునయన..

ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉన్నా దీప్తి సునయన తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు. తన జీవితంలో ఒక గొప్ప నిర్ణయం మరొక అడుగు ముందుకు వేయబోతున్నాను అంటూ ఈమె ఈ వార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇలా జీవితంలో మరో అడుగు ముందుకు వేయబోతున్నానని చెప్పడంతో ఈమె పెళ్లి చేసుకోబోతుందా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ శుభవార్త పెళ్లికి సంబంధించింది కాదని తెలుస్తుంది.


హెచ్ కె హాస్పిటల్స్…

ఈ సందర్భంగా దీప్తి సునయన ఈ వార్తను తెలియజేస్తూ.. ఫైనల్లీ ఇట్స్ హ్యాప్పీనింగ్.. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలలో ఇది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపారు. ఈమె తన ఫ్రెండ్స్ హెచ్ కె మేకప్ ట్రీట్మెంట్ క్లినిక్ వారితో కలిసి టైప్ అప్ అవుతూ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారని వెల్లడించారు. త్వరలోనే చెన్నైలో కొత్త క్లినిక్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక సాధారణ అమ్మాయిని పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఈ స్థాయిలో నిలబెట్టారు ఇప్పుడు కూడా మీ అందరి మద్దతు కావాలి అంటూ ఈమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

?igsh=c3EyeXhzZTdtNnV4

ఇక హెచ్ కె మేకప్ క్లీనిక్ ట్రీట్మెంట్ ను నమ్మిన మొట్టమొదటి వ్యక్తి దీప్తి సునయన అని , అందుకే తనతో కలిసి తాము హెచ్ కె హాస్పిటల్స్ (H.K.Hospitals) కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేయడంతో అభిమానులు దీప్తి సునయనకు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక దీప్తి సునయన గతంలో మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో ఉన్నారు అయితే బిగ్ బాస్ కారణంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయి కెరియర్ పరంగా దృష్టి సారించి ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కాకుండా బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Actor Venkitesh: డిప్రెషన్‌లో కింగ్డమ్ విలన్… అమ్మ కేజిఎఫ్ లేడీ.. వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×