BigTV English

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Bigg Boss 9 : బుల్లితెర టాప్ రియాలిటీ బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇతర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఏకైక షో ఈ బిగ్ బాస్. అన్ని ఇండస్ట్రీలలోనూ ఈ షో ప్రసారం అవుతుంది. తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే తొమ్మిదవ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. సెప్టెంబర్ లో ఈ సీజన్ మొదలు కాబోతుంది. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈ షో గురించి ఒక ప్రోమోను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ కు అభిజిత్ షాక్.. 

ఈ బిగ్ బాస్ షో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్, సీజన్ 1 టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరైన నవదీప్, బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టైటిల్ విన్నర్ బిందు మాధవి వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది.. ఈ షో కి సంబంధించిన అగ్నిపరీక్ష షూటింగ్ మొదలైంది.అభిజిత్ ఈ ప్రక్రియ లో అల్లాడించేశాడని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 లో ఆయన మాస్టర్ మైండ్ గేమ్ ఎలాంటిదో ప్రతీ ఒక్కరు చూశారు. ఒకవిధంగా బిగ్ బాస్ రియాలిటీ షో మీద జనాల్లో ఆసక్తి పెంచడానికి కారణమైన వారిలో అభిజిత్ ఒకరు. ఈ ఎపిసోడ్ ప్రోమోలో కంటెస్టెంట్ మీద అభిజిత్ అరిచేశాడట. దమ్ము శ్రీజ అనే అమ్మాయికి అభిజిత్ క్లాస్ పీకాడట. ఇంటర్వ్యూలో ఏదో కాస్త తేడా జరిగిందట. అందుకే ఆమె మీద అభిజిత్ ఫైర్ అయ్యాడట. ఆ వీడియోనే ప్రస్తుతం వైరల్ అవుతుంది..


Also Read: ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

బిగ్ బాస్ 9 లో వెళ్ళేది ఎవరంటే..? 

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో యూట్యూబర్ ఆదిరెడ్డి ఒకరు.. యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఆట మాట తీరుతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ గురించి ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. తన చానల్లో అగ్నిపరీక్ష గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు.. ఆయన మాట్లాడుతూ అగ్ని పరీక్షలో ముగ్గురు బ్యాడ్జ్ ఇవ్వడం గురించి వివరించారు.. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసిన వాళ్ళని బిగ్ బాస్ 9 లోకి పంపిస్తారని ఆదిరెడ్డి అంటున్నారు.. ఈయన చెప్పిన ఆ విధంగా చూస్తే తేజస్వి, బిందు మాదవిలతో పాటుగా మరో ముగ్గురు సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఆదిరెడ్డి అంటున్నాడు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆదిరెడ్డి ఫైనల్ చేసిన ఆ ఐదుగురు ఈ సీజన్ లో ఉంటారా లేదా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…

 

Related News

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×