Big Boss: యావత్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ (Bigg Boss) ప్రథమ స్థానంలో నిలిచింది. ఎక్కడో పాశ్చాత్య దేశాలలో ‘బిగ్ బ్రదర్’ గా ప్రారంభమైన ఈ షో.. ఆ తర్వాత హిందీలో తొలిసారి ప్రారంభమైంది. బిగ్ బాస్ అంటూ ప్రారంభమైన ఈ షోకి భాషతో సంబంధం లేకుండా విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు అటు హిందీలో 19వ సీజన్ ప్రారంభమవుతుండగా.. ఇటు తెలుగులో కూడా 9వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి పహల్గాం ఉగ్రవాది దాడిలో చనిపోయిన బాధితులకు అవకాశం కల్పిస్తున్నారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లోకి పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్య..
ఇకపోతే బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ పెంచడానికి నిర్వహకులు ఎప్పటికప్పుడు వినూత్న ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలు, సామాన్యులను కూడా తీసుకొస్తూ షోపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి హిందీలో వినూత్న అడుగు వేశారు అని చెప్పవచ్చు. బిగ్ బాస్ సీజన్ 19 ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. కంటెస్టెంట్ల జాబితాపై రోజుకో వార్త వైరల్ గా మారింది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ కంటెస్టెంట్ గా రాబోతున్నట్లు సమాచారం.
హిమాన్షి నర్వాల్ ఎంట్రీపై త్వరలో అధికారిక ప్రకటన..
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో జీవిత భాగస్వామిని ఆమె కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ఆమె ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అటు బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. బిగ్ బాస్ మేకర్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే కంటెస్టెంట్ లను కోరుకుంటున్నారు. అందులో భాగంగానే హిమాన్షి పేరు పరిగణలోకి తీసుకున్నారని సమాచారం. షోని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలి అంటే ప్రేక్షకులకు దగ్గర అయ్యే వ్యక్తులు కంటెస్టెంట్ గా ఉండడం చాలా అవసరం. అందుకే హిమాన్షి నర్వాల్ ను ఇందులో తీసుకోవాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
కన్నీటిని తెప్పించిన హిమాన్షి కథ..
హిమాన్షి విషయానికి వస్తే.. ఈమె కథ వెనుక విషాదం చాలా మందికి కన్నీటిని తెప్పించింది. హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లిన దంపతులపై ఉగ్రదాడులు కాల్పులు జరపడం నిజంగా బాధాకరం. ఆ దాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే హిమాన్షి క్షేమంగా బయటపడ్డారు. ఘటన స్థలంలో భర్త పక్కన కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అందరికీ కన్నీటిని తెప్పించింది. ముఖ్యంగా ఈమె తన భర్త పక్కన కూర్చొని ఏడుస్తున్న ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈమె పేరు బాగా మారుమ్రోగింది. అలా పాపులారిటీ అందుకున్న ఈమెను ఇప్పుడు హౌస్ లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా దీనిపై క్లారిటీ రాలేదు.
బిగ్ బాస్ 19 కంటెస్టెంట్..
ఇక ఈమె తోపాటు బిగ్ బాస్ 19లోకి శైలేష్ లోధా, ఫైసల్ షేక్, మున్మున్ దత్త, లతా సబర్వాల్, జన్నత్ జుబైర్, పూరవ్ ఝూ, అపూర్వ ముఖిజా వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ALSO READ:Mass Jathara Teaser: మాస్ జాతర టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?