BigTV English

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక సెప్టెంబర్ లో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్యక్రమానికి సంబంధించిన వరుస ప్రోమోలను విడుదల చేస్తూ ఈ కార్యక్రమం పై మంచి అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈసారి బిగ్ బాస్ ఊహించని విధంగా ఈ కార్యక్రమం గురించి బిగ్ ట్విస్ట్ఇచ్చారని చెప్పాలి.


డబుల్ హౌస్… డబుల్ డోస్..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా వెన్నెల కిషోర్(Vennela Kishore) తాను బిగ్ బాస్ హౌస్ కి వెళ్తానని వంద రోజులు ఎలాంటి షూటింగ్ లేకుండా చూడమని చెబుతారు. అయితే అక్కడికి వెళ్ళగానే నాగార్జున(Nagarjuna) ఈసారి బిగ్ బాస్ హౌస్ రూల్స్ అన్ని మారిపోయాయని.. ఎప్పటిలా ఓకే హౌస్ కాకుండా ఈసారి డబుల్ హౌస్(Double House) , డబల్ డోస్(Double Dose) ఉండబోతుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమం గురించి వెన్నెల కిషోర్, నాగార్జున మధ్య జరిగే సంభాషణ ఈ కార్యక్రమం పై మంచి అంచనాలను పెంచేస్తుంది. ఇక తాను అన్ని సీజన్లో అన్ని ఎపిసోడ్స్ ఫాలో అయ్యాయని ఈసారి గెలుపు నాదే అంటూ వెన్నెల కిషోర్ మాట్లాడుతారు.


బిగ్ బాస్ నే మార్చేసారా?

ఇక ఈ మాటలకు నాగార్జున పాత సిలబస్ తో కొత్త ఎగ్జామ్ రాస్తావా అంటూ నాగార్జున అడగడంతో నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే మాట్లాడుతాను అంటూ వెన్నెల కిషోర్ అక్కడి నుంచి వెళ్లబోతుండగా నాగార్జున అందుకే ఈసారి బిగ్ బాస్ నే మార్చేశాను అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ సీజన్లో అందరి సరదాలు తీరిపోతాయి.. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ నాగార్జున చెప్పే డైలాగులు మాత్రం ఈ కార్యక్రమం పై మంచి అంచనాలు పెంచేసాయి. మరి ఈసారి బిగ్ బాస్ ని మార్చేశారు అంటే నాగార్జున మాటలకు అర్తం ఏంటి? ఇక రెండు హౌస్ లు ఉండబోతున్నాయి అంటే కామన్ మ్యాన్ క్యాటగిరి లో వచ్చే కంటెస్టెంట్లను ఒక వైపు సెలబ్రిటీలను ఒకవైపు ఉంచబోతున్నారా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

ఇక సీజన్ 9 కార్యక్రమంలో కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుందని ఇప్పటికే కామన్ మ్యాన్ సెలక్షన్ కూడా జరుగుతోందని తెలుస్తోంది. మరి ఈసారి బిగ్ బాస్ 9(Bigg Boss 9)కార్యక్రమం మాత్రం చాలా గట్టిగానే ప్లాన్ చేశారని స్పష్టం అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఇప్పటికే ఎంతోమంది పేర్లు వినపడుతున్నాయి. మరి సీజన్ 9 కంటెస్టెంట్లుగా హౌస్ లోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారు అనేది తెలియాలి అంటే ఈ సీజన్ ప్రసారమయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా బుల్లితెర నటీనటులతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలను కూడా హౌస్ లోకి కంటెస్టెంట్లుగా పంపించబోతున్నట్లు సమాచారం. ఇక ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు .

Also Read: Anupama : ఆ హీరో నా జీవితంలోకి రావడం అదృష్టం..యవ్వారం ఏదో తేడాగా ఉందే?

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×