BigTV English

Nari Movie : “నారి” సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క

Nari Movie : “నారి” సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క

Nari Movie : ఆమని, వికాస్ వశిష్ఠ,మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా నారి. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నారి సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా


స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క మాట్లాడుతూ – మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నారు. అయినా వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. సమాజ నిర్మాతలు మహిళల అనే నిజాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఆడ పిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాడు అందించాలి. మహిళల్ని గౌరవించాలి. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ తో నారి సినిమా చేసిన సూర్య వంటిపల్లి గారికి అభినందనలు. ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ నా చేతుల మీదుగా విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. నారి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. మహిళల గురించి వారి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

Also Read : Venky Atluri on Dhanush : అందుకే నా కథను తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారు


దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ – ఈ రోజు మా నారి సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క గారికి కృతజ్ఞతలు. ఆమె ఎంతో బిజీగా ఉన్నా మా మూవీ కాన్సెప్ట్ విని టైమ్ ఇచ్చారు. ఇటీవల ఓ స్కూల్ అమ్మాయి తన టీచర్ తో అమ్మాయిగా తన కష్టాలు చెబుతూ తాను మగవాడిగా మారాలని అనుకుంటున్నట్లు చెప్పిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఆ సన్నివేశం మా నారి సినిమాలోనిది. ఆ అమ్మాయి నిత్యశ్రీ. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. డిసెంబర్ 25న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి మహిళ తమ ఇంట్లోని పురుషుడిని వెంట తీసుకెళ్లి ఈ సినిమాను చూపిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Also Read : Tollywood Hit Movies 2024 : ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమాలు.. కలెక్షన్లు మోతే..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×