Bigg Boss 9 Day 47 Episode Review: కంటెండర్ టాస్క్ కోసం జరిగిన వాంటెడ్ పేట ముగిసింది. దొంగతనాలు, దోపిడిలతో ఇద్దరు గ్యాంగ్ స్టర్స్, వారి టీం రెచ్చిపోయింది. ఇక వారి ఆట కట్టించేందుకు హౌజ్ లోకి ఇంద్రజిత్, అభిజిత్ పేరుతో పోలీసులుగా మాజీ కంటెస్టెంట్సైన అర్జున్, అమర్ దీప్ లు వచ్చారు. వీరు గ్యాంగ్ స్టర్ లీడర్లను పట్టుకుని జైల్లో వేసేందుకు వచ్చారు. మారు వేషాల్లో తిరుగుతున్న వారిని పట్టుకునేందకు మిగతా నేరస్థులకు రకరకాల ఆఫర్ష్ తో ఆశ చూపుతున్నారు. ఆ ఇద్దరిని పట్టించిన వారిని డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్స్ చేస్తామని వల విసిరారు. ఇందులో పడ్డ తనూజ సంజన సైలెన్సర్ మారు వేషంలో తిరుగుతుందని హింట్ ఇవ్వడమే కాదు నేరుగా ఆమెని పట్టి ఇస్తుంది.
దీంతో సంజన సైలెన్సర్ ని జైల్లో వేశారు. దీంతో తనూజ నేరుగా కంటెండర్ అయ్యింది. ఆ తర్వాత రెండో డాన్ పట్టుకునేందుకు మళ్లీ కంటెండర్లను సాయం తీసుకున్నారు. కానీ ఎవరూ మాస్ మాధురి పట్టించే సాహసం చేయలేదు. అయితే వారు ఇచ్చిన ఓ సీక్రెట్ టాస్క్ కి రీతూ ఒకే చెప్పింది. తన కటౌట్ పై కిల్ (Kill) అని రాయాలి. కానీ, ఆమె రాసినట్టు ఎవరూ చూడకూడదు, కనిపెట్టకుడదు. అలా అయితే మాధురి జైలుకు వెళ్తుంది. రీతూ కనిపెడితే మాత్రం తను కంటెండర్ అవ్వలేదు. చివరికి ఈ సీక్రెట్ టాస్క్ గేలిచి రీతూ నేరుగా కంటెండర్ గా నిలిచింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్పమనగానే.. అంత తమ తమ వద్ద ఉన్న డబ్బులు తీసి బయటపెట్టారు.
దీంతో అందరిలో టాప్ 4ని కెప్టెన్సీ కంటెండర్ ఎన్నిక చేశారు. 4500 నిఖిల్, 4430 డెమోన్, సాయి 4100, సుమన్ 3150, దివ్య 4880, 4630 ఇమ్ము, కళ్యాణ్ 4830 డబ్బులు ఉన్నాయని చెప్పారు. అందరి కంటే ఎక్కువ డబ్బులు ఉన్న కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్,నిఖిల్, దివ్యలు కంటెండర్లుగా నిలిచారు. ఒక్క వంద రూపాయల తేడాతో డిమోన్ కెప్టెన్సీ కంటెండర్ మిస్ అయ్యింది. రీతూని డబ్బులు అడిగిన ఇవ్వలేదట. మొత్తం ఇవ్వకుండ.. సగం ఇచ్చింది. దీంతో డిమోన్ ఫుల్ హార్ట్. బతిమాలితేనే ఇస్తావా? మన ఫ్రెండిషిప్ ఇదేనా అంటూ పవన్ వాపోయాడు. రీతూ మాత్రం నేను రెడ్ టీం కదరా మొత్తం ఎలా ఇస్తాను అంటూ వివరణ ఇచ్చుకుంది అయినా డిమోన్ వినలేదు. పాపం రీతూ నిన్ను నమ్మాను.. కానీ, నువ్వు నాలా లేవు అన్నట్టు ఇన్ డైరెక్ట్ కామెంట్స్ పోడుస్తూనే ఉన్నాడు. దీంతో రీతూ ఏడ్చింది.
ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్ కోసం చివరి పోరు మొదలైంది. హ్యాట్ తో వేట పేరుతో పెట్టిన ఈ పోరులో చివరికి ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. సర్కిల్లో హ్యాట్ పెట్టి.. చూట్టూ కంటెండర్స్ ఉండాలి. సైరన్ మోగగానే హ్యాట్ పట్టుకోవాలి. అలా ముందు ఎవరూ పట్టుకుంటే వాళ్లు కంటెండర్ షిప్ లో లేనివాళ్లకు వచ్చి వారు కెప్టెన్ అవ్వాలనుకునేవారికి సపోర్టు చేస్తూ ఒకరిని ఎలిమినేట్ తియాలి. అలా మొదట హ్యాట్ చేజిక్కించుకున్న అఖిల్.. గౌరవ్ కి ఇవ్వగా.. అతడు కళ్యాణ్ ని ఎలిమినేట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా ఇమ్మాన్యుయేల్ హ్యాట్ పట్టుకుని చివరికి కెప్టెన్ అయ్యాడు. దీంతో హౌజ్ ఏడోవారం కెప్టెన్ గా ఇమ్మూ నిలిచాడు.
కెప్టెన్సీ కంటెండర్ తర్వాత తనూజ కాస్తా అస్వస్థతకు గురైంది. వీక్ నెస్, బాడీ డిహైడ్రెట్ వల్ల కళ్లు తిరిగిపోవడంతో ఎమర్జేన్సీ చికిత్స అందించారు. కాసేపు విశ్రాంతి తర్వాత బయటకు వచ్చింది. తనూజకి అలా అవ్వడంతో కళ్యాణ్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. ఇమ్మాన్యుయేల్ గట్టిగా పట్టుకుని గుక్కపెట్టి ఏడ్చాడు. అలాగే ఇమ్మాన్యుయేల్, మాధురి కూడా తనూజని పట్టుకుని ఏడ్చారు. ఇక తనూజ కళ్యాణ్ ఎందుకు ఏడ్చావ్ అని అడిగితే.. నామినేషన్ లో ఉండటం వల్ల ఎలిమినేట్ అవుతాననే భయంతో ఏడ్చానని మాట మార్చాడు. మరోవైపు అస్వస్థ వల్ల అయేషా హౌజ్ వీడింది. డెంగ్యూ, టైఫాయిడ్ లక్షణాల ఉండటం మెరుగైన చికిత్స కోసం అయేషా హౌజ్ ని వీడక తప్పలేదు.