Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అనౌన్స్ చేసినప్పుడు ఇది చదరంగం కాదు రణరంగం అన్నారు. కొంతమేరకు అది కరెక్టే అని అనిపించింది. కొన్ని ట్విస్టు లు కూడా ఇచ్చారు. ఐదు వారాల్లో ఆరుగురు కంటిస్టెంట్లను బయటకు పంపించి, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆరుగురిని మళ్లీ హౌస్ లోకి పంపించారు. సాఫీగా సాగిపోతున్న షో కి ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది కొంతమేరకు ప్లస్ అయింది అనేది వాస్తవం. వీడియో కంటెంట్ కూడా బానే వస్తుంది.
బయట నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది కంటెస్టెంట్ ల గురించి బయట ఏమనుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ వాళ్లకు ఇచ్చారు. దానిని దృష్టిలో పెట్టుకొని నామినేషన్స్ లో కూడా మాట్లాడారు. వాళ్లతో పాటు ప్రతివారం ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్లు హౌస్ మేట్స్ కి కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. దానిని పరిగణలోకి తీసుకొని హౌస్ మేట్స్ ఆడుతూ ఉంటారు ఇది కామన్ గా జరుగుతుంది. దీనితో పెద్ద సమస్య లేదు.
అసలు హౌస్ లో ఎవరు గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మిగతా కంటెస్టెంట్లకు తెలియదు. కానీ చూసే ఆడియన్స్ కి అంతా తెలుస్తుంది. దానిని బట్టి అసలైన రంగులేంటో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అయితే హౌస్ లో జరుగుతున్న పరిణామాలు సంభాషణలు చూస్తుంటే స్క్రిప్ట్ లీక్ అవుతుంది అని అనిపిస్తుంది.
నిన్న పోలీసు గెటప్ లో అర్జున్, అమర్ దీప్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ల ఎంట్రీ తో కొంత మేరకు ఫన్ క్రియేట్ చేద్దాం అని బిగ్ బాస్ ప్లాన్ చేశారు. కానీ ఊహించిన స్థాయిలో ఫన్ క్రియేట్ అవ్వలేదు. ఏదో వచ్చి హడావిడి చేశారంతే.
అయితే వాళ్లను లోపలకు పంపించేటప్పుడు బేసిక్ గా కూడా ఎటువంటి కండిషన్స్ బిగ్ బాస్ చెప్పలేదు. బయట విషయాలేవీ లోపల వాళ్లకు తెలియకూడదు మినిమం డిస్ప్లేమర్ కూడా ఇవ్వలేదు. వాళ్లు ఏవైనా చెప్పేసి ఉంటే పరిస్థితి ఏంటి.? రీతు చౌదరి ఇమ్మానుయేల్ సంభాషణల బట్టి స్క్రిప్ట్ లీక్ అయినట్టు అర్థమవుతుంది.
గార్డెన్ ఏరియాలో ఇమ్మానుయేల్ మరియు రీతు నడుస్తూ మాట్లాడుకున్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనుజ గురించి కంప్లీట్ పాజిటివ్ గా బయటకు వెళ్తుంది అని ఇమ్మానుయేల్ చెప్పాడు. ఈ విషయం ఇమ్మానుయేల్ కు ఎలా తెలిసింది.?
అయితే రీతు దీనికి సమాధానంగా భరణి గారు ఉండటం వల్ల కొంత మేరకు నడిచింది, కళ్యాణ్ కొంత సపోర్ట్ చేశాడు, నువ్వు కొంత సపోర్ట్ చేశావు అంటూ ఏదో ఆన్సర్ ఇచ్చింది. అయితే తనుజ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ గా వస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత పాజిటివ్ గా వస్తుంది అని ఇమ్మానుయేల్ కు ఎవరు చెప్పారు. లీక్ చేయకుండా తెలిసే అవకాశం లేదు.
Also Read: Yellamma: హీరో కన్ఫర్మ్ అయినట్లే, మరి మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి ఏంటి? వేణు కాంప్రమైజ్ అవుతాడా?