Ayesha Out From Bigg Boss: ఆ వార్తలే నిజం అయ్యాయి. రౌడీ బేబీ అయేషా హౌజ్ వీడింది. అనారోగ్యం కారణంగా ఆయేషా బయటకు రాక తప్పలేదు. ఈ రోజు ఎపిసోడ్ ఆమె హెల్త్ అప్డేట్ ఇచ్చాడు బిగ్ బాస్. తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో పాటు స్వల్ప డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టు పరీక్షలో వెల్లడైంది. ఆయేషాని మెడికల్ రూంకి రావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయేషాకు డాక్టర్ తనకు టెఫాయిడ్ తో పాటు డెంగ్యూ కూడా ఉన్నట్టు చెప్పారు. ఇక తదుపరి బిగ్ బాస్ పిలుపు వరకు మీరు హౌజ్ లో ఉండండని చెప్పారు. అది విని ఆయేషా తీవ్ర నిరాశకు గురైంది.
బాధతో బయటకు వచ్చిన ఆమెను నిఖిల్ ఏమైందని ఆరా తీయడంతో అసలు విషయం చెబుతూ ఏడ్చింది. ఆ తర్వాత గార్డెన్ ఎరియాలో ఆయేషా ఒక్కతే కూర్చుంటుంది. అప్పుడే రాము వచ్చి తనతో మాట్లాడతాడు. ఇక తాను హౌజ్ ని వీడక తప్పదని తెలిసి ఆయేషా తీవ్ర నిరాశలో ఉంది. ఎవరితో మాట్లాడకుండ కూర్చుని ఉన్న ఆయేషా దగ్గర రాము రాథోడ్ వెళ్లి మాట్లాడుతుంటాడు. ఈ సందర్భంగా ఆయేషా తన ఆవేదనను అతడితో పంచుకుంది. ‘నాకు లైఫ్ లోకి ఏది ఈజీ గా రాలేదు. సెకండ్ ఛాన్స్ ఎవరికి రాదు. కానీ, నాకు వచ్చింది. ఇలాంటి అదృష్టం ఎవరికి ఉండదు. నాకు వచ్చింది. కానీ, అది ఎంతోకాలం నిలవలేదు. నా లైఫ్ లో నేను ఎక్కువగా ప్రేమిస్తానో.. ఏది ఇంపార్టెంట్ అనుకుంటానో అది నాతో ఎక్కువ కాలం ఉండదు‘ అంటూ ఆయేషా కన్నీరు పెట్టుకుంది.
ఆ తర్వాత అయేషాను బిగ్ బాస్ కన్ఫెషన్ రూంకి పిలిచారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసిన బిగ్ బాస్ తనకు మెరుగైన చికిత్స కోసం ఆయేషా హౌజ్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. తను ఇప్పుడు వైద్యులు పర్యవేక్షణలో ఉండటం ముఖ్యమని భావించే తనని బయటకు పంపుతున్నట్టు స్పష్టం చేశారు. దీనికి ఆయేషా కన్నీటితోనే ఒకే చెబుతుంది. తనకు ఈ చాన్స్ దొరకండ సంతోషంగా ఉందని, ఇప్పుడు వచ్చింది.. ఫ్యూచర్ లో కూడా వస్తుందని ఆశిస్తున్నా అంటూ బిగ్ బాస్ కు బాయ్ చెప్పింది. ఆ తర్వాత బయటకు వచ్చి హౌజ్ మేట్స్ కి విడ్కోలు చెప్పింది. ఈ విషయం తెలిసి అంత షాక్ ఉండిపోతారు.
కానీ, ఆయేషా వెళ్లలేక వీడలేక హౌజ్ మేట్స్ కి గుడ్ బై చెబుతూ బిగ్ బాస్ మెయిర్ డోర్ నుంచి బయటకు వెళ్లింది. వైల్డ్ కార్డ్ గా హౌజ్ లోకి వచ్చినప్పటి నుంచి ఆయేషా మాస్క్ లేకుండ ఆడింది. తను అనిపించింది, మనసులో ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా బయట పెట్టేది. మొఖం మీద ఇచ్చిపడేసేది. రాగానే తనూజని టార్గెట్ చేసిన ఆయేషా.. తర్వాత తన ఆట తీరు చూసి మెచ్చుకుంది. ఇక తనూజ లవ్ ట్రాక్స్ కోసమే బిగ్ బాస్ కి వచ్చిందంటూ ఆమెను టార్గెట్ చేస్తూ తరచూ గొడవలాడేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఫుల్ వార్ మొదలైంది. అలా హౌజ్ లో మొహం మీదే కొట్టినట్టు మాట్లాడుతూ ఇచ్చిపడేస్తూ రౌడీ బేబీ గుర్తింపు పొందింది.